జలగ

జలగ ఒక పట్టాన వదలదు. పట్టుకుని లాగినా, రేకు పెట్టి గీకినా మనకే బాధ. ఇలాకాక తేలిగ్గా తీసే మార్గం ఒకటి ఉంది. జలగ మన చర్మాన్ని పట్టుకున్నప్పుడు ఉప్పు ని పట్టి లాగా వేయాలి. అలా పట్టి వేసిన రెండు నిమిషాలకి అది చర్మం నుండి ఊడి పడిపోతుంది . ఉప్పు వేయటం వెనక కారణం ఏంటంటే జలగ లో ఉన్న తేమ ని అంటె నీరు ని ఉప్పు పీల్చేస్తుంది. దానివల్ల జలగ చనిపోయి చిన్నగా అయి పడిపోతుంది.

Read More

చీరమేను

చీరమేను/సీరమేను/చీరమీను అనేది చిన్న చేప, చాకురొయ్యల కన్నా చాలా చిన్నగా, చూడగానే ఏదో సేమ్యాల్లా కనబడతాయి. ఇవి గోదావరిలో వరదల తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు వేళ్ళ సందుల్లో నుంచీ వలల్లోనుంచీ కూడా జారిపోయేంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు. ముఖ్యంగా యానాం, ఎదురులంక, కోటిపల్లి గ్రామాల్లో ఇవి బాగా దొరుకుతాయి. సముద్రపు నీరు, నదిలోని నీరు సంగమం వద్ద ఏర్పడిన ఉప్పునీటిలో ఈ చేప జాతులను గమనించవచ్చు. లార్వా దశలో ఉన్నప్పుడు ఈ చేపలు ఎక్కువ ఆక్సిజన్‌ను పొందడానికి సముద్ర సంగమం వద్ద ఉప్పునీటి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో, అవి మత్స్యకారులకు చిక్కుతాయి. సముద్రం అంతటా చల్లని తూర్పు గాలులు వీచినప్పుడు, చీరమీను…

Read More