మోటేరా స్టేడియం – ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం

మొటేరా స్టేడియం

మోటేరా స్టేడియంకు, క్రికెట్ రికార్డులకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నెలకొల్పినన్ని రికార్డులు ప్రపంచంలో మరే క్రికెట్ మైదానంలోనూ నెలకొల్పి ఉండరు.

1983 ఫిబ్రవరిలో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్.. అహ్మదాబాద్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటేరా గ్రామం సమీపంలో గుజరాత్ క్రికెట్ అసోసియేన్ స్టేడియంకు పునాదిరాయి వేశారు. తరువాత సరిగ్గా తొమ్మిది నెలలకు, అదే ఏడాది ఈ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగింది.

38 ఏళ్ల క్రితం భారత్‌లో తొమ్మిది నెలల్లో ఒక క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోవడం అనేది ఊహకందని విషయం. శర వేగంతో పనులు పూర్తి చేసుకుని రికార్డ్ టైమ్‌లో మోటేరా స్టేడియం తయారైంది. ఈ స్టేడియం రికార్డుల జాబితాలో అది మొదటి రికార్డ్. అప్పట్లో ఈ స్టేడియం ఇన్ని రికార్డులకు వేదిక అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు 2021లో మనం కచ్చితంగా చెప్పొచ్చు.. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని రికార్డులు నమోదవుతాయని.

2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ స్టేడియంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గతంలో దీనికి సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం అని నామకరణం చేశారు. కానీ, అందరూ మోటేరా స్టేడియం అనే పిలుస్తారు. అయితే, తాజాగా ఈ మైదానం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మారుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

దీని సామర్థ్యం మరొక రికార్డ్. 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చోగలిగేలా ఈ స్టేడియంను నిర్మించారు. దీంతో, ఇప్పటివరకూ ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా ప్రాచుర్యంలో ఉన్న మెల్​బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి వెళ్లిపోయింది.

స్వింగ్ బౌలింగ్

క్రికెట్లో రెండు రకాల స్వింగ్ బౌలింగ్ ఉంటాయి

  1. ఇన్ స్వింగ్
  2. ఔట్ స్వింగ్
  • ఇన్ స్వింగ్

క్రికెట్ బంతి నేల మీద పడే ముందు గాలిలోనే తిరిగుతే దాని స్వింగ్ అంటారు. ఒక కుడిచేతి వ్యక్తి ఒక కుడిచేతి బ్యాట్స్మన్ కు ఇన్ స్వింగర్ వేసినప్పుడు బంతి గాలిలోనే జరిగి తన వైపు వస్తుంది క్రింది జీ ఐ ఎఫ్ లో చూపించినట్లు.

క్రికెట్ లో బౌలింగ్ జట్టు బంతి యొక్క ఒక వైపు పాడవకుండా మెరిసేటట్టు చూస్తారు ఇంకో వైపు అలానే వదిలేస్తారు. ఇన్ స్వింగర్ వేయడానికి ఆ మెరిసే వైపు ఎడము పకన ఉండాలి. సీమ్ ఏమో ఫైన్ లెగ్ వైపు ఉండాలి(క్రింది ఇమేజ్ లో లాగా). ఈ ఇన్ స్వింగ్ అనేది బంతి కొత్తగా ఉన్నప్పుడే వేయవచ్చు పాత అయ్యాక వేసిన ఇన్ స్వింగ్ అవ్వదు.

  • ఔట్ స్వింగ్

పైన చెప్పినదానికి అంతా వ్యతిరేకంగా ఉంటుంది ఔట్ స్వింగ్. ఔట్ స్వింగ్ వేసినప్పుడు బంతి గాలిలోనే జరిగి అది కుడిచేతి బ్యాట్స్మన్ వైపు కాకుండా అతని ఆఫ్ సైడ్ వైపుగా వెళ్ళుతుంది. క్రింది జీ ఐ ఎఫ్ ఒక ఔట్ స్వింగ్ బౌలింగ్ కు ఉదాహరణ.

ఇన్ స్వింగ్ లాగా కాకుండా ఔట్ స్వింగ్ కి బంతి యొక్క మెరిసే వైపు కుడి పకన ఉండాలి. సీమ్ ఏమో స్లిప్స్ వైపు ఉండేటట్లు ఉండాలి. క్రింది ఇమేజ్ లో లాగా.

  • రివర్స్ స్వింగ్

రివర్స్ స్వింగ్ అనేది కేవలము ఒక పాత బంతి తోనే చేయగలము 40+ ఓవర్స్ ఆడిన బంతితోటే. ఈ కాలంలో కేవలము టెస్ట్ క్రికెట్ లోనే రివర్స్ స్వింగ్ చేయవచ్చు ఎందుకంటే వన్ డే, టీ 20 ఆటలో ఒక బంతి 20–25 ఓవర్ లు వరకు మాత్రమే ఉపయోగిస్తారు. 1990–2000 కాలంలో వన్ డే క్రికెట్ లో కూడా రివర్స్ స్వింగ్ చేయగలిగేవారు కారణం : ఒకే బంతితో 50 ఓవర్ లు ఆడేవారు.

ఒక బౌలర్ ఇన్ స్వింగర్ వేస్తే అది ఔట్ స్వింగ్ అవుతుంది. అదే ఔట్ స్వింగర్ వేస్తే ఇన్ స్వింగ్ అవుతుంది. అందుకే దీనిని రివర్స్ స్వింగ్ అంటారు. క్రింది జీ ఐ ఎఫ్ లో బౌలర్ ఔట్ స్వింగర్ వేస్తాడు కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యింది.

32 ఏళ్ల జైత్రయాత్రకు టీమిండియా చెక్‌

Team India Rewrites History By Massive Victory Breaking 32 Years Record - Sakshi

గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో (15-01-2021 to 19-01-2021) టీమిండియా విజయం సాధించడం ద్వారా 32 ఏళ్ల రికార్డును తిరగరాసింది. సాధారణంగానే గబ్బా మైదానం అంటేనే ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన వేదిక.. 32 ఏళ్లుగా అక్కడ ఆడిన ఒక్క టెస్టులోనూ ఆసీస్‌ ఓడిపోలేదు. తాజాగా టీమిండియా గబ్బాలో విజయం సాధించడం ద్వారా ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు తెరదించింది. గబ్బాలో ఆసీస్‌ ఇప్పటివరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక 1988లో వివ్‌ రిచర్డ్స్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆసీస్‌ ఓడిపోలేదు.

అంతేగాక టీమిండియా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో మూడు వంద‌ల‌కుపైగా స్కోర్లు చేజ్ చేసి గెల‌వ‌డం ఇది కేవ‌లం మూడోసారి మాత్ర‌మే. ఇంతకముందు 1975-76లో విండీస్‌పై 406 పరుగులు చేధించగా.. 2008-09 సీజన్‌లో ఇంగ్లండ్‌పై 387 పరుగులు.. తాజాగా గబ్బాలో ఆసీస్‌పై 329 పరుగుల లక్ష్యం చేధించి కొత్త రికార్డు సృష్టించింది. అందులోనూ ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన గబ్బా వేదికలో ఇంత భారీ స్కోరు ఛేదించ‌డం అనేది టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2018-19 సీజన్‌లో ఆసీస్‌పై 2-1 తేడాతో సిరీస్‌ గెలిచిన టీమిండియా.. 2020-21లోనూ మరోసారి 2-1 తేడాతో ఆసీస్‌ గడ్డపై వరుసగా రెండోసారి సిరీస్‌ను సాధించి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని అట్టిపెట్టుకోవడం మరో రికార్డుగా చెప్పవచ్చు. 

ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టాప్‌ 5 టీమిండియా ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..
బౌలింగ్‌ :
మహ్మద్‌ సిరాజ్‌ : 13 వికెట్లు( 3 టెస్టులు)
ఆర్‌ అశ్విన్‌ : 12 వికెట్లు( 3 టెస్టులు)
జస్‌ప్రీత్‌ బుమ్రా : 11 వికెట్లు(3 టెస్టులు)
రవీంద్ర జడేజా : 7 వికెట్లు(2 టెస్టులు)
శార్థూల్‌ ఠాకూర్‌ : 7 వికెట్లు(1 టెస్టు)

బ్యాటింగ్‌: 
రిషబ్‌ పంత్‌ : 274 పరుగులు(5 ఇన్నింగ్స్‌లు)
శుబ్‌మన్‌ గిల్‌ : 259 పరుగులు(6 ఇన్నింగ్స్‌లు)
పుజారా : 271 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు)
అజింక్యా రహానే : 268 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు) 
రోహిత్‌ శర్మ : 129 పరుగులు(4 ఇన్నింగ్స్‌లు)