చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా తప్పుకొన్న ధోనీ.. కొత్త సారథి రవీంద్ర జడేజా
పీఎల్-2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మహేంద్ర సింగ్ ధోని షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్ నుంచి చెన్నై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. సీఎస్కే జట్టును ధోని నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఛాంపియన్ గా నిలిపాడు. 2012 నుంచి జడేజా చెన్నై జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా ధోని చెన్నై జట్టును అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. చెన్నై తరఫున 12 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని.. 196 మ్యాచుల్లో 117 విజయాలు సాధించాడు. 77 మ్యాచుల్లో చెన్నై ఓటమి పాలైంది.…
Read More
You must be logged in to post a comment.