కాఫీ తాగడం చెడ్డ అలవాటా? కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదా?
చాల మందికి తెల్లారి లేచిన తరువాత కప్పు కాఫీ తాగితేకాని బండి కదలదు కనుక కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న ప్రశ్న పుట్టక మానదు. మోతాదు మించకుండా ఉన్నంత సేపు కాఫీ చాల మందికి మంచే చేస్తుందని తెలిసినవారు తీర్మానిస్తున్నారు. మోతాదు అంటే రోజుకి మూడు-నాలుగు కప్పులు. కప్పు అంటే 8 ఔన్సులు (230 మిల్లీలీటర్లు). కాఫీ తాగగానే ఉత్సాహం పుట్టడానికి కారణం కెఫీను అనే రసాయనం! ఉరమరగా కప్పు ఒక్కంటికి 100 మిల్లీగ్రాములు కెఫీను ఉంటుంది. ఒక కప్పులో నిజంగా ఎంత కెఫీను ఉంటుందో చెప్పడం కష్టం: అది గింజల జాతిని బట్టి, గింజలని వేయించిన పద్ధతిని బట్టి, కాఫీని తయారుచేసిన పద్ధతిని బట్టి మారుతుంది. కనుక మోతాదు అంటే రోజుకి 400 మిల్లీగ్రాముల కెఫీను అని అనుకోవడం రివాజు. కాఫీ ఆరోగ్యానికి హాని…
Read More
You must be logged in to post a comment.