వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు

వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు గ్రాఫిక్స్‌ను ఉపయోగించి నిర్వహణ యోగ్యమైన వెబ్‌సైట్‌ను తయారు చేయడం నేర్చుకోవచ్చ. సమాచారాన్ని అందంగా ఎలా కంటికి నచ్చే తీరులో తీర్చిదిద్దాలి, లే అవుట్‌, కంప్యూటర్‌, మొబైల్‌ మొదలైన అన్ని డివైజ్‌ల్లో సులభంగా ఉపయోగించేలా ఎలా రూపొందించొచ్చో నేర్చుకోవచ్చు. కెరియర్‌ కోసమే కాకుండా దీనిలో నేర్పు సాధిస్తే సొంతంగా వ్యాపారం చేయవచ్చు. సృజనాత్మక ఆలోచనలు, కొత్తగా ఆలోచించగల మనస్తత్వమున్నవారికి ఇది మంచి ఎంపిక.నేర్చుకోవలసిన అంశాలు* హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, జేక్వెరీ, జావా స్క్రిప్ట్‌* బూట్‌స్ట్రాప్‌, రెస్పాన్సివ్‌, ఫొటోషాప్‌* ఇలస్ట్రేటివ్‌, కోరెల్‌డ్రా, హెచ్‌టీఎంఎల్‌ స్లైసింగ్‌ప్రారంభ వేతనం కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.ఈ కోర్సులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. చదువుకు ఇబ్బంది కలుగకుండా ఇంట్లో ఉండే కోర్సులను చేయాలనుకునేవారు కింది వెబ్‌సైట్లను అనుసరించొచ్చు.https://in.udacity.com/course/intro-to-html-and-css–ud001-indiahttps://www.udemy.com/html-css-javascript/https://www.coursera.org/learn/html-css-javascript-forweb-developersనేరుగా తరగతులకు హాజరై నేర్చుకోవాలనుకుంటే ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ లేదా ఇతర ప్రైవేటు సంస్థల్లో…

Read More

వెబ్ డిజైనింగ్..

ఇటీవల కాలంలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో వెబ్ డిజైనింగ్ ముందు వరుసలో నిలుస్తోంది. విలక్షణత, వినూత్న ఆలోచనా దృక్పథం కలిగిన విద్యార్థులకు ఈ కోర్సు చక్కగా సరిపోతుంది. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ కోర్సులు వెబ్సైట్ల రూపకల్పన, నిర్వహణా నైపుణ్యాలను అందిస్తాయి. దీంతోపాటు ఇంటర్ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ గ్రాఫిక్ డిజైన్, యూజర్ ఎక్స్పీరియెన్స్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆపరేషన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ తదితర నైపుణ్యాలను పెంపొందిస్తాయి. ఆయా నైపుణ్యాలున్న అభ్యర్థులకు గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ » డిజైన్ ఆర్కిటెక్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వార్షిక వేతనంతో కొలువులు దక్కుతున్నాయి.

Read More