వీడియో ఎడిటింగ్

ఈ కోర్సులకూ సృజనాత్మకత ఉండాలి. దేన్నైనా వినూత్నంగా రూపొందించడానికి ఆలోచనలు, కొత్తదనం కోసం తపన.. ఈ లక్షణాలు ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రత్యేకంగా మలచడం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. డిగ్రీ పూర్తయ్యేలోపు ఈ రంగంలో బేసిక్‌ కోర్సులను నేర్చుకుని, ఆపైన కొంచెం అనుభవం సంపాదించుకోగలిగితే భవిష్యత్తు ఉద్యోగానికి మీకు మీరే హామీ ఇచ్చుకున్నట్లవుతుంది. ఒక పేజీ నుంచి సినిమా వరకు గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో సినిమా రంగంలో ప్రముఖ పాత్ర గ్రాఫిక్స్‌దే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోకి కనీసం 20-30 మంది నిపుణుల అవసరం ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థి నైపుణ్యాన్ని బట్టి నెలకు సుమారుగా రూ.6000 నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో…

Read More