Digital Marketing

అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను ప్రాథమికంగా ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడగలిగి కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా ఈ కెరియర్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులూ, స్వయం ఉపాధి పొందుతున్నవారూ, గృహిణులూ, ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఈ రంగంలో ప్రవేశించి, అద్భుతంగా రాణించవచ్చు!
ప్రపంచవ్యాప్తంగానే కాదు, మనదేశంలోనూ డిజిటల్ మార్కెటింగ్కు ఆదరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్, సోషల్ మీడియా, మొబైల్ మార్కెటింగ్ ఆక్టివిటీస్ వంటివన్నీ డిజిటల్ మార్కెటింగ్లో భాగమే. ఈ ప్రోగ్రామ్లు కస్టమర్లను ఆకర్షించడంలో, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీల ఉత్పత్తులపై అవగాహన కల్పించడంలో, వస్తుసేవల విలువను పెంచడం లేదా సేకరించడంలో తోడ్పడతాయి. మొబైల్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్లో కొత్త పంథా. రానున్న కాలంలో మనదేశంలో దాదాపుగా 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలు డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ఏర్పడనున్నాయని అంచనా. ఆన్లైన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్లో వెబ్సైట్లు, సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్లాగులు, వైరల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ వంటివి ముఖ్య విభాగాలు. కస్టమర్ల ప్రత్యేక అభిరుచులు, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉన్నవాటిని వారికి పంపుతూ ఎల్లప్పుడూ వారిని కంపెనీ ఉత్పత్తులను గమనిస్తుండేలా చేయొచ్చు.
సంస్థలు సోషల్ మీడియా ద్వారా వినియోగదారుల వయసులవారీ వర్గీకరణ, ప్రదేశం, లింగం, ఆసక్తుల ఆధారంగా తమ టార్గెట్ కస్టమర్లను ఆకర్షించేలా ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. అంతేకాకుండా కస్టమర్ల తాజా సెర్చ్ ఆధారంగా వాటికి సంబంధించిన ఇతర బ్రాండ్ల వస్తుసేవలను ప్రకటనల రూపంలో కనిపించేలా చేస్తున్నాయి.
రిటైలింగ్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టూరిజం, టెలికమ్యూనికేషన్, ఏర్లైన్స్ మొదలైన అన్నింటిలో డిజిటలైజేషన్ ఉనికిని మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 43% ప్రజలు డిజిటల్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య జనాభాలో 30%పైగానే. 2018 చివరకు అదింకా పెరుగుతుందని అంచనా. వీరిలో 80% మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 10 మిలియన్ నుంచి 100 మిలియన్లకు చేరడానికి మనదేశంలో పదేళ్ల సమయం పట్టిందిడిజిటల్ మార్కెటింగ్ ఎన్నో ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు: సంప్రదాయ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు కూడా నేడు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ మొదలైన సేవలను అందించే చిన్న, మధ్యతరహా, పెద్ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలున్నాయి.
బ్రాండ్ లివరేజింగ్ డిజిటల్ మార్కెటింగ్: డిజిటల్ మార్కెటింగ్లో క్రియాశీలంగా పనిచేసే వెబ్ డిజైనర్లు, బ్లాగర్లు, ఈమెయిల్ మార్కెటింగ్ వంటి వారు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ లేదా సంస్థ కోసం పనిచేయాలనుకుంటే వారికీ ఉద్యోగావకాశాలున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ టూల్/ ప్లాట్ఫాం కంపెనీ: గూగుల్, లింక్డిన్, ఫేస్బుక్, అడోబ్, ట్విటర్, యూట్యూబ్ మొదలైన టూల్/ ప్లాట్ఫాం. సంస్థల్లో చేయాలనుకునేవారికీ ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. ఏజెన్సీ, బ్రాండ్ల్లో చేయడం కంటే ఈ సంస్థల్లో చేయడం ద్వారా పనిలో వైవిధ్యాన్ని పొందొచ్చు. ఈ పరిశ్రమలో ఉన్న సౌలభ్యం.. ఫుల్టైం ఉద్యోగాలతోపాటు ఫ్రీలాన్సింగ్/ పార్ట్టైం, ఇంటినుంచే పనిచేసే సౌకర్యాలూ ఉంటాయి. ఏ స్పెషలైజేషన్లు?
డిజిటల్ మార్కెటింగ్ పరిశ్రమకు సంబంధించి ఏడు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. అభ్యర్థుల అనుభవం, కమ్యూనికేషన్, సృజన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, టెక్నికల్, నాన్ టెక్నికల్ నైపుణ్యాల ఆధారంగా వివిధ జాబ్ ప్రొఫైళ్లు స్పెషలైజేషన్లను బట్టి అందుబాటులో ఉన్నాయి.
సెర్చింజన్ మార్కెటింగ్: గూగుల్, బింగ్లాంటి సెర్చింజన్ల ద్వారా అడ్వర్టైజింగ్ దీనిలో ఉంటుంది. దీనిలో వివిధ రకాలుంటాయి. 1. సెర్చ్ అడ్వర్టైజింగ్ 2. డిస్ ప్లే అడ్వర్టైజింగ్ 3. వీడియో అడ్వర్టైజింగ్ 4. షాపింగ్ అడ్వర్టైజింగ్ 5. మొబైల్ అడ్వర్టైజింగ్ 6. మొబైల్ యాప్ ప్రమోషన్.
సెర్చింజన్ ఆప్టిమైజేషన్: సెర్చ్ ఫలితాల్లో పైభాగాన మనం ఉద్దేశించిన సైట్ వివరాలు వచ్చేలా చేయటం ద్వారా ఆ వెబ్పేజీల ర్యాంకింగ్నూ, వాటి విజిబిలిటీనీ మెరుగుపరిచే మెలకువలు దీనిలో ఉంటాయి. సోషల్ మీడియా మార్కెటింగ్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ లాంటి సైట్లలో అడ్వర్టైజింగ్కు సంబంధించినది.
సోషల్ మీడియా ఆప్టిమైజేషన్: ఆన్లైన్ ప్రెజెన్స్ను పెంచటం, బ్రాండ్ బిల్డింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్ను వృద్ధి చేయటం దీనిలో భాగంగా ఉంటాయి.
ఈమెయిల్ మార్కెటింగ్: ఈమెయిల్స్ బలమైన ప్రచార సాధనం అవ్వటం వల్ల సంస్థలు న్యూస్లెటర్స్ను వినియోగదారులకు నియమిత కాలంలో పంపుతూ వారితో అనుసంధానమవుతుంటాయి. ఉత్పత్తుల, సేవల ప్రచారం ప్రభావశీలంగా చేయటం ఈ స్పెషలైజేషన్ ప్రధానాంశం. కంటెంట్ మార్కెటింగ్: బ్లాగ్స్, ఆన్లైన్ ప్రెస్ రిలీజులు, న్యూస్ లెటర్ల ద్వారా వినియోగదారులతో అనుసంధానమవుతూ వ్యాపారాభివృద్ధికి తోడ్పడటం దీనిలో ఉంటుంది.
వెబ్సైట్ అనలిటిక్స్: వీక్షకుల ట్రాఫిక్ విశ్లేషణ, మార్కెట్ పరిశోధనల ఆధారంగా వెబ్సైట్ వీక్షకుల సంఖ్యను పెంచటం ఈ స్పెషలైజేషన్లో ముఖ్యాంశం. ఉదాహరణకు గూగుల్ అనలిటిక్స్ ద్వారా ఒక వెబ్సైట్ తీరుతెన్నులను వివరంగా తెలుసుకోవచ్చు. ఈ అనలిటిక్స్ ఫలితాల ఆధారంగా తగిన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు.
వీటితోపాటు వెబ్సైట్ డిజైన్ (కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్- ఉదా: వర్డ్ప్రెస్), మొబైల్ యాప్ క్రియేషన్ (ఆండ్రాయిడ్, ఐఫోన్, హెచ్టీఎంఎల్5) కూడా డిజిటల్ మార్కెటింగ్తో సంబంధమున్నవే. ఎక్కడ నేర్చుకోవచ్చు?
ఈ పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నప్పటికీ మనదేశంలో ఇది ప్రవేశించింది 4-5 సంవత్సరాల స్వల్పకాలం క్రితమే. అందుకే ఏ విశ్వవిద్యాలయం కూడా డిజిటల్ మార్కెటింగ్కు సంబంధించి పూర్తిస్థాయి కోర్సులు గానీ, ప్రోగ్రాములు గానీ ఇప్పటివరకూ ప్రవేశపెట్టలేదు. కొన్ని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ తాము అందించే ఎంబీఏలో డిజిటల్ మార్కెటింగ్ని ఒక సబ్జెక్టుగా/ పేపర్గా ప్రవేశపెట్టాయి.
చాలా ప్రైవేటు సంస్థలూ, కంపెనీలూ, కోచింగ్ కేంద్రాలూ 3-6 నెలల వ్యవధితో దీర్ఘకాల కోర్సులనూ, 2-6 రోజుల వ్యవధి ఉండే స్వల్పకాలిక కోర్సులనూ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అందిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పట్టు సాధించాలంటే 20-30 గంటల శిక్షణ, దీనికి అనుబంధంగా మరో 40-60 గంటల అధ్యయనం తప్పనిసరి.
రికగ్నయిజ్డ్ సర్టిఫికేషన్లు
మూడు సుప్రసిద్ధ సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ రంగానికి సంబంధించిన రికగ్నయిజ్డ్ సర్టిఫికేషన్లు అందిస్తున్నాయి. పరీక్ష రాసేముందు సంబంధిత వీడియోలను చూసి, అవగాహన పెంచుకుంటే సరిపోతుంది.
గూగుల్ సంస్థ
ఎ) గూగుల్ యాడ్వర్డ్స్ సర్టిఫికేషన్స్: 1. యాడ్వర్డ్స్ ఫండమెంటల్స్ సర్టిఫికేషన్ 2. సెర్చ్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 3. డిస్ప్లే అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 5. వీడియో అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 6. మొబైల్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 6. షాపింగ్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్. బి) గూగుల్ మొబైల్ సైట్స్ సర్టిఫికేషన్
సి) గూగుల్ డిజిటల్ సేల్స్ సర్టిఫికేషన్
డి) గూగుల్ అనలిటిక్స్ ఇండివిడ్యువల్ సర్టిఫికేషన్ https://goo.gl/Fju3Gk
మైక్రోసాఫ్ట్ సంస్థ: అక్రిడిటెడ్ బింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పరీక్షలో అర్హత పొందిన వ్యక్తులకు ఈ సంస్థ బింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ను అందిస్తోంది. https://goo.gl/B5PN5F
ఫేస్బుక్ సంస్థ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అడ్వర్టైజింగ్కు సంబంధించి ఈ సంస్థ మూడు విభిన్న సర్టిఫికేషన్లను అందిస్తోంది. దీనికో పరీక్ష ఉంటుంది. ఫీజు 350 డాలర్లు. https://goo.gl/yopBnr
ఏడాదే చెల్లుబాటు: ఈ సర్టిఫికేషన్లన్నీ సంబంధిత ఆన్లైన్ పరీక్ష రాస్తే లభిస్తాయి. ఇవి సంవత్సరం పాటే చెల్లుబాటవుతాయి. ఏటా పరీక్షలు పాసవుతూ సర్టిఫికేషన్లను రెన్యువల్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఈ పరీక్షలకు ఎగ్జామ్ తేదీ గానీ, కేంద్రంగానీ ఉండవు. మనం ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ఇంటి నుంచే పరీక్ష ఆన్లైన్లో రాసెయ్యవచ్చు.
వీటికి వయసు, విద్య మొదలైన అర్హతలంటూ ఏమీ ఉండవు. ఎవరైనా రాసెయ్యవచ్చు. పరీక్షలను ఎన్నిసార్లయినా మళ్ళీ మళ్ళీ రాయవచ్చు. ఇన్నిసార్లే రాయాలనే నిబంధన ఏమీ ఉండదు. సర్టిఫికేషన్ పరీక్షల్లో ఫేస్బుక్ ఒక్కదానికే ఫీజు ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్లు అందించే సర్టిఫికేషన్లకు ఫీజు ఉండదు.
పాస్మార్కు సాధారణంగా 80 శాతం ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్ట్లిపుల్ చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి.నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఇంటర్నెట్లో సమాచారం వెతికిగానీ, యూట్యూబ్లో సంబంధిత వీడియోలు చూసి గానీ ఈ పరీక్షలకు సిద్ధం కావొచ్చు

Programming Courses …ప్రోగ్రామింగ్

సైన్స్‌ విభాగాన్ని అవకాశాల వెల్లువగా అభివర్ణిస్తుంటారు. ఎంచుకునే వారి సంఖ్య, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నతవిద్య అవకాశాలూ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లకు ఇది మరింత వర్తిస్తుంది. కానీ బీఎస్‌సీ విషయానికి వచ్చినపుడు.. ఐటీ, కంప్యూటర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌లో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉన్నవారికి అవకాశాలు ఒకప్పుడు ఎక్కువ.
అయితే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధిస్తే సబ్జెక్టుతో సంబంధం లేకుండా సంస్థలు తీసుకుంటున్నాయి.
ప్రోగ్రామర్ల అవసరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉంది. బహుళ జాతి సంస్థలు కూడా బీఎస్‌సీతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలున్నవారిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
బీఎస్‌సీ కంప్యూటర్స్‌ (మేథమేటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) విద్యార్థులు ప్రోగ్రామింగ్‌పై దృష్టిపెడితే ప్రోగ్రామర్‌గా కెరియర్‌ ప్రారంభించవచ్చు. వీరు సి, సి++, జావా, పైథాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను ఎంచుకోవచ్చు
. https://cppinstitute.org
https://www.udemy.com/c-cplus-plus-java-programming-megaprimer-for-beginners/
https://www.udemy.com/c-c-python-ruby-javahtml5-php-programming-for-beginners
https://www.edx.org/learn/c
https://www.edx.org/learn/java
బీఎస్‌సీ- మేథమేటిక్స్‌ విద్యార్థులు మేథమేటికా అనే సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలున్నాయి. మేథమేటికా అనేది మేథ్స్‌కు సంబంధించిన గణన ప్రోగ్రామింగ్‌. కొన్నిసార్లు బీజగణిత ప్రోగ్రామింగ్‌ అనీ పిలుస్తారు. దీన్ని అనేక శాస్త్రీయ, ఇంజినీరింగ్‌, మేథమేటికల్‌, కంప్యూటర్‌ రంగాల్లో వినియోగిస్తున్నారు. ఈ ప్రోగ్రామింగ్‌ను కూడా వూల్‌ఫ్రామ్‌, జావాలోనే రూపొందించారు. సి, సి++, జావా ఇప్పుడు పైథాన్‌ లాంగ్వేజ్‌లు చాలా పేరున్నవి. ప్రోగ్రామింగ్‌ కెరియర్‌లో పునాది వీటిలో ప్రావీణ్యం సాధించడంతోనే మొదలవుతుంది. ఈ కోర్సులు ఆన్‌లైన్‌తోపాటు దగ్గర్లోని ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ లేదా ఏదైనా ప్రైవేటు సంస్థల్లోకానీ నేర్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటే కింది వెబ్ సైట్లను చూడండి.
https://www.wolfram.com/mathematica/resources/
https://www.wolfram.com/wolfram-u/
https://www.lynda.com/Mathematica-training-tutorials/2011-0.html
https://www.onlinefreecourse.net>Academics
https://www.udemy.com/mathematica/
ఈ మేథమేటికా.. సరికొత్త సాంకేతికతలైన డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లాంగ్వేజ్‌ వంటి వాటికి ఎంతో ఉపయోగకరం. అందుకే ఈ కోర్సు •మెరుగైన కెరియర్‌ను నిర్మించుకోవడానికీ సాయపడుతుంది. వీటితోపాటు సృజనాత్మకంగా ఆలోచించేవారైతే పైన తెలిపిన వెబ్‌, మల్టీమీడియా, గ్రాఫిక్‌ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
ఈ కోర్సులన్నీ కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ వారికే కాకుండా బయాలజీ, ఇతర స్ట్రీములవారూ నేర్చుకోవచ్చు. వారి రంగాల్లో నిష్ణాతులు కావటానికి ఉపయోగకరంగా ఉంటాయి. తమ సబ్జెక్టుల పరిధిలో డేటా సైన్స్‌, ఏఐ కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది.

Software Testing…..సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నేర్చుకున్నవారు సాఫ్ట్‌వేర్‌లో తలెత్తే లోపాలను కనుక్కుంటారు. వీటిని మాన్యువల్‌, ఆటోమేషన్‌ టెస్టింగ్‌ టూల్స్‌తో రెండు రకాలుగా తెలుసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వీరికి ఎక్కువ గిరాకీ ఉంది. నైపుణ్యాన్ని పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కాస్త ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. నేర్చుకోవలసిన అంశాలు * సెలెనియమ్‌, క్యూటీపీ, బగ్‌జిల్లా, మ్యాంటిస్‌ వంటి మాన్యువల్‌ టెస్టింగ్‌ అండ్‌ ఆటోమేషన్‌ టూల్స్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి https://www.udemy.com/courses/development/softwaretesting/ https://alison.com/courses/software-testing https://www.guru99.com/software-testing.html వీరికి నెలకు రూ.10,000-రూ.15,000 వరకు ప్రారంభజీతం ఉంటుంది.

SEO సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌/ సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ)

వెబ్‌సైట్లన్నీ గూగుల్‌, యాహూ, ఎంఎస్‌ఎన్‌ మొదలైన సెర్చ్‌ ఇంజిన్‌లపైనే ఆధారపడతాయి. ప్రత్యేకమైన కీవర్డ్స్‌, మెటా పదాలు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ద్వారా గరిష్ఠ వినియోగదారులను చేరుకోవడానికి వెబ్‌ పోర్టళ్లకు దారిచూపడంలో సెర్చ్‌ ఇంజిన్‌ సాయపడుతుంది. కాబట్టి ఈ సెర్చ్‌ ఇంజిన్లు, వాటిపైన పని చేయడానికి ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఉంటుంది. తమ తమ వెబ్‌సైట్లను సెర్చ్‌ పేజీలో ముందు స్థానంలో ఉండేలా చేయడమే వీరి ముఖ్య విధి. వీరు వినియోగదారులు ఎలాంటి కీవర్డ్స్‌ను ఉపయోగిస్తారో అంచనావేసి, వాటి ఆధారంగా వెబ్‌సైట్‌ వచ్చేలా చేస్తుంటారు. సృజనాత్మక నైపుణ్యాలతోపాటు ఆంగ్లభాషపై పట్టు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా వీరికి అవసరమవుతాయి. ఫ్రెషర్లు… ముఖ్యంగా ఇంటర్నెట్‌పై, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌+ వంటి సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. నేర్చుకోవలసిన అంశాలు…
* సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, పీపీసీ
* సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌/ నెట్‌వర్కింగ్‌
* ఎస్‌ఈఓ ఆన్‌పేజ్‌, ఎస్‌ఈఓ ఆఫ్‌పేజ్‌, బ్యాక్‌ లింక్స్‌ మొదలైనవి
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి..
https://www.emarketinginstitute.org/free-courses/seo-certification-course/
https://www.udemy.com/courses/marketing/searchengine-optimization/
https://www.simplilearn.com/digitalmarketing/search-engine-optimization-seo-certification-training
సుమారు రూ.8000-రూ.12,000 వరకు ప్రారంభవేతనాన్ని సంపాదించే అవకాశముంది. అనుభవంతో సంపాదనా పెరుగుతుంది. ఇంటర్నెట్‌ వినియోగం, యాడ్‌ బిజినెస్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌ విభాగాల్లో కెరియర్‌ నిర్మించుకోవచ్చు. సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు

వీడియో ఎడిటింగ్

ఈ కోర్సులకూ సృజనాత్మకత ఉండాలి. దేన్నైనా వినూత్నంగా రూపొందించడానికి ఆలోచనలు, కొత్తదనం కోసం తపన.. ఈ లక్షణాలు ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రత్యేకంగా మలచడం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. డిగ్రీ పూర్తయ్యేలోపు ఈ రంగంలో బేసిక్‌ కోర్సులను నేర్చుకుని, ఆపైన కొంచెం అనుభవం సంపాదించుకోగలిగితే భవిష్యత్తు ఉద్యోగానికి మీకు మీరే హామీ ఇచ్చుకున్నట్లవుతుంది. ఒక పేజీ నుంచి సినిమా వరకు గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో సినిమా రంగంలో ప్రముఖ పాత్ర గ్రాఫిక్స్‌దే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోకి కనీసం 20-30 మంది నిపుణుల అవసరం ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థి నైపుణ్యాన్ని బట్టి నెలకు సుమారుగా రూ.6000 నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు https://alison.com/tag/digital-creative-design https://www.udemy.com/topic/graphic-design/ https://www.format.com/magazine/resources/design/freeonline-graphic-design-courses ఈ కోర్సులకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ లైసెన్సులు కొంచెం ఖరీదైనవి. కాబట్టి, ఆన్‌లైన్‌ కోర్సులతోపాటు దగ్గర్లో ఉన్న మల్టీమీడియా సంస్థలకు వెళ్లి నేరుగా నేర్చుకుంటే మంచిది.

వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు

వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు గ్రాఫిక్స్‌ను ఉపయోగించి నిర్వహణ యోగ్యమైన వెబ్‌సైట్‌ను తయారు చేయడం నేర్చుకోవచ్చ. సమాచారాన్ని అందంగా ఎలా కంటికి నచ్చే తీరులో తీర్చిదిద్దాలి, లే అవుట్‌, కంప్యూటర్‌, మొబైల్‌ మొదలైన అన్ని డివైజ్‌ల్లో సులభంగా ఉపయోగించేలా ఎలా రూపొందించొచ్చో నేర్చుకోవచ్చు. కెరియర్‌ కోసమే కాకుండా దీనిలో నేర్పు సాధిస్తే సొంతంగా వ్యాపారం చేయవచ్చు. సృజనాత్మక ఆలోచనలు, కొత్తగా ఆలోచించగల మనస్తత్వమున్నవారికి ఇది మంచి ఎంపిక.
నేర్చుకోవలసిన అంశాలు
* హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, జేక్వెరీ, జావా స్క్రిప్ట్‌
* బూట్‌స్ట్రాప్‌, రెస్పాన్సివ్‌, ఫొటోషాప్‌
* ఇలస్ట్రేటివ్‌, కోరెల్‌డ్రా, హెచ్‌టీఎంఎల్‌ స్లైసింగ్‌
ప్రారంభ వేతనం కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.
ఈ కోర్సులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. చదువుకు ఇబ్బంది కలుగకుండా ఇంట్లో ఉండే కోర్సులను చేయాలనుకునేవారు కింది వెబ్‌సైట్లను అనుసరించొచ్చు.
https://in.udacity.com/course/intro-to-html-and-css–ud001-india
https://www.udemy.com/html-css-javascript/
https://www.coursera.org/learn/html-css-javascript-forweb-developers
నేరుగా తరగతులకు హాజరై నేర్చుకోవాలనుకుంటే ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ లేదా ఇతర ప్రైవేటు సంస్థల్లో చేరొచ్చు. ఎన్‌ఐఈఎల్‌ఐటీ- తిరుపతి, సీ-డాక్‌- హైదరాబాద్‌ వంటి ప్రభుత్వ సంస్థలూ అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ మార్కెటింగ్‌

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే… డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ కామర్స్, స్టాటిస్టిక్స్, డేటాతోపాటు సృజనాత్మకత కూడా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులు, సేవలకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పించగలిగే చాకచక్యం తప్పనిసరి. డిగ్రీ పూర్తయ్యాక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి అందించే డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ విధానాల గురించి అవగాహన పొందొచ్చు. మూక్స్ విధానంలో ఆన్‌లైన్ కోర్సులు పూర్తిచేసుకునే వీలుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్‌లో రాణించాలంటే.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఈ కామర్స్ సొల్యూషన్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్ తదితర అంశాలపై పట్టు అవ సరం.

సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వాలంటే?

డిజిటల్  మార్కెటింగ్  లో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్న రంగం ఏదైనా ఉందా అంటే అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. SEM ని సెర్చ్ ఇంజిన్ advertising అని, PPC అని కూడా అంటారు. PPC అంటే Pay Per Click. PPC expert అవ్వాలంటే ఏం చేయాలో యీ ఆర్టికల్ లో చూద్దాం.

డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్

PPC నేర్చుకునే ముందు డిజిటల్ మార్కెటింగ్ పై ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక వేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడి తెలుగు లో అందిస్తున్న ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి.

గూగుల్ యాడ్స్ నేర్చుకోవడం

గూగుల్ ఒక్కటే సెర్చ్ ఇంజిన్ కాదు, గూగుల్ తో పాటు చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అంటే 96.63% గూగుల్ నే మన దేశంలో వాడతారు కాబట్టి మనం గూగుల్ యాడ్స్ ని నేర్చుకోవడానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే చాలు ప్రారంభంలో. తరువాత అవసరాన్ని బట్టి బింగ్ యాడ్స్ ని కూడా నేర్చుకోవొచ్చు.
  • Google Adwords ని Google Ads గ పేరు మార్చారు
  • Bing Ads ని Microsoft Advertising గ పేరు మార్చారు
గూగుల్ యాడ్స్ ని ప్రాక్టికల్ గ నేర్చుకోవాలంటే యాడ్స్ రన్ చేస్తూ నేర్చుకోవాలి.

మెట్రిక్స్ నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ లో ఉండే మెట్రిక్స్ కొన్ని
  1. Click-through rate
  2. Cost Per Click
  3. Quality Score
  4. Return on Ad Spend (ROAS)
  5. Cost Per Conversion
గూగుల్ యాడ్స్ ని ప్రాక్టికల్ గ నేర్చుకోవాలంటే యాడ్స్ రన్ చేస్తూ నేర్చుకోవాలి.

Best Resources

గూగుల్ యాడ్స్ ని మరింత మెరుగ్గా నేర్చుకోవాలంటే అవసరమైన వనరులు ఇవి.
మీరు బిగినర్స్ అయితే ఇందులో readiness series వీడియోస్ ని చూడండి

Landing Pages

లాండింగ్ పేజెస్ గురించి కూడా నేర్చుకోవాల్సిందే. లాండింగ్ పేజెస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి కన్వర్షన్స్ విషయంలో. లాండింగ్ పేజీ ని ఎలా క్రియేట్ చేయాలి, ad copy ఎలా ఉండాలి, visitor ని ఒప్పించగలిగేలా రాయటం ఎలా, ఇటువంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. లాండింగ్ పేజెస్ గురించి పూర్తి అవగాహన కోసం నేను మీకు Ultimate Landing Page Guide ఇస్తున్నాను. ఇది పూర్తిగా చదివితే మీకు అర్థము అవుతుంది.

Excel నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ కి మాత్రమే కాదు, Microsoft Excel ని ప్రతి డిజిటల్ మార్కెటర్ నేర్చుకోవాలి. Excel యొక్క అవసరత SEO లో మరియు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చాలా ఉంటుంది. యాడ్ copies ని సిద్ధం చేసుకోవడంలో కావొచ్చు , ad copy variations ఒకే place లో రాసుకొని ఇంప్రూవ్ చేయడం కోసం కావొచ్చు, బడ్జెట్ forecasting , campaign అనలిస్ లాంటి చాలా పనులకు excel చాలా అవసరం అవుతుంది. ఉదాహారణకు యీ ఆర్టికల్ చుడండి మీకు అర్థము అవ్వడానికి https://www.hanapinmarketing.com/ppc-library/guide/the-complete-guide-to-using-excel-for-ppc/
మీరు excel లో beginners అయితే PPC templates ని వాడండి

సాఫ్ట్ వేర్ కోర్సులు

హెచ్‌టీఎంఎల్:
నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.
వెబ్‌సైట్https://www.w3schools.com/html

సీఎస్‌ఎస్:హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్ (సీఎస్‌ఎస్) ఉపయోగిస్తారు. వెబ్‌పేజీలో కలర్స్, ఫాంట్, టెక్ట్స్, ఇమేజ్, లింక్స్, టేబుల్స్, బార్డర్స్, మార్జిన్స్, ఔట్‌లైన్స్, డెమైన్షన్స్, స్క్రోల్‌బార్, పొజిషినింగ్, యానిమేషన్స్.. మొదలైన ఎన్నో ఫీచర్లు సీఎస్‌ఎస్ సొంతం. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లను డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించే ఇతర సాఫ్ట్‌వేర్‌లలోనూ ఉపయోగిస్తారు. యాంగులర్ జేఎస్, పీహెచ్‌పీ టెక్నాలజీలపై పనిచేసే క్రమంలో హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కోర్సులను అన్ని మూక్స్ ప్రొవైడర్లు ఆఫర్ చేస్తున్నారు. యూట్యూబ్‌లోనూ ఎంతో సమాచారం అందుబాటులో ఉంది.
వెబ్‌సైట్: https://www.w3schools.com/html

డెవాప్స్ (Devops):
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, ప్రొడక్ట్ రిలీజ్, డిప్లాయ్, ఆపరేషన్, మానిటర్… ఇలా వివిధ దశలు ఉంటాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు కొన్ని ‘మోడల్స్’ ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తాయి. దీనికోసం వాటర్‌ఫాల్ మోడల్, ఏజైల్ మోడల్స్ లాంటి వాటిని సంస్థలు అనుసరిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఆయా ‘మోడల్స్’లోని కొన్ని ప్రతికూలతలు సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు డెవలప్ మెంట్ చేసిన కోడ్‌ను డిప్లాయ్ చేయడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆపరేషన్స్ కూడా సంతృప్తిగాకరం లేకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్స్ సమర్థంగా లేకపోవడం తదితర కారణాలతో సరికొత్త మోడల్ ఆవశక్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘డెవాప్స్(Devops)’ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో డెవలపర్స్, ఆపరేషన్స్ విభాగాల సభ్యులు కలిసి ‘ఉత్పాదకత’ పెంచేందుకు కృషిచేస్తారు. అంటే.. ఏ ఒక్క ఉద్యోగి పని ఒకదశలోనే ఆగిపోకుండా ఒక జట్టుగా సాఫ్ట్‌వేర్ డెలివరీ, మెయింటెన్స్ వరకు కలిసి పనిచేస్తారు. డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్స్, టెస్టర్స్.. మొదలైన వారందరూ డెవాప్స్ ఇంజనీర్లుగా కలిసి పనిచేస్తారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్, టెస్టింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, మానిటరింగ్, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వరకూ… ఎండ్ టు ఎండ్ బాధ్యత అందరిపైనా ఉంటుంది. ఇదొక సైక్లింగ్ ప్రక్రియ.

  • గత సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్‌లో ఉన్న సవాళ్లను అధిగమించడానికి డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. వీటిద్వారా కంటిన్యూయస్ డెవలప్‌మెంట్, కంటిన్యూయస్ టెస్టింగ్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్, కంటిన్యూయస్ మానిటరింగ్ చేయడానికి వీలుంటుంది. డెవాప్స్‌కు జాబ్ మార్కెట్ సానుకూలంగా ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఆటోమేషన్‌వైపు వెళుతుంటే.. డెవాప్స్‌పై అవకాశాలు మెరుగవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెవాప్స్‌లో పలు దశల్లో ఉపయోగించే టూల్స్‌లో GIT, JENKINS, SELENIUM, DOCKER, PUPPET, CHEF, ANSIBLE, NAGIOS, ELK STACK, SPLUNK మొదలైన డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్, డిప్లాయ్‌మెంట్, మానిటరింగ్ టూల్స్‌కు డిమాండ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
  • డెవాప్స్‌పై వెళ్లాలంటే గతంలో ఐటీ రంగంలో పనిచేసిన అనుభవం ఉంటే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాజెక్టుల్లో పనిచేసిన వారైతేనే రియల్ టైం పని అనుభవంతో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోడింగ్, నెట్‌వర్కింగ్ తెలిసిన వారికి ఇది నప్పుతుంది. టూల్స్‌లో ఒక్కొక్కటి వేర్వేరు స్టేజీల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ఉదాహరణకు స్ల్పంక్ టూల్ డేటా క్రోడీకరణకు సంబంధించిన టూల్‌గా చెప్పొచ్చు. ఆయా టూల్స్ నేర్చుకోవడానికి వాటి పేరు మీదనే వెబ్‌సైట్లు ఉన్నాయి.

వెబ్‌సైట్: https://www.edureka.co

వెబ్ డిజైనింగ్..

ఇటీవల కాలంలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో వెబ్ డిజైనింగ్ ముందు వరుసలో నిలుస్తోంది. విలక్షణత, వినూత్న ఆలోచనా దృక్పథం కలిగిన విద్యార్థులకు ఈ కోర్సు చక్కగా సరిపోతుంది. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ కోర్సులు వెబ్సైట్ల రూపకల్పన, నిర్వహణా నైపుణ్యాలను అందిస్తాయి. దీంతోపాటు ఇంటర్ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ గ్రాఫిక్ డిజైన్, యూజర్ ఎక్స్పీరియెన్స్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆపరేషన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ తదితర నైపుణ్యాలను పెంపొందిస్తాయి. ఆయా నైపుణ్యాలున్న అభ్యర్థులకు గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ » డిజైన్ ఆర్కిటెక్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వార్షిక వేతనంతో కొలువులు దక్కుతున్నాయి.

హ్యాకింగ్

ఎథికల్ హ్యాకర్
ఎవరికీ తెలియకుండా అక్రమంగా కంప్యూటర్లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే.. యజమాని అనుమతితోనే కంప్యూటర్లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం! కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్ నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
భారీ డిమాండ్: భారత ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డిమాండ్కు సరిపడా నిపుణులు అందుబాటులో లేరు. ప్రధానంగా బీపీఓ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఎథికల్ హ్యాకర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎథికల్ హ్యాకర్లకు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది.
రాణించాలంటే: ఎథికల్ హ్యాకర్గా పేరు తెచ్చుకోవాలంటే.. హ్యాకర్లు ఉపయోగించే విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ సంపూర్ణంగా ఉండాలి. జావా, సీ++ వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు అవసరం. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘యూనిక్స్’పై పరిజ్ఞానం సంపాదించాలి. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక వైఖరి ఉండాలి.