కొత్తపల్లి కొబ్బరి మామిడి

ఈ రోజు 26-05-2023, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ముగ్గ వేసినవి తిన్నాను. ఆహా ఏమి రుచి. రసం చాలా ఉంది లోపల. పీచు పదార్థం . పీచు ని చీకే కొలది చాలా రసం వచ్చింది. నా జీవితం లో మొదటి సారి తిన్నా అనుకుంట. అద్భుతం గా ఉంది. దీనికి కారణమైన మా ఆవిడ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

మా ఆవిడ చెప్పింది ఈ చెట్టు దరియాలతిప్ప లో ఉన్న వాళ్ళ తాత గారి ఇంటి ఆవరణ లో ఈ ఒక్క చెట్టు ఉంది అని, దీన్ని స్వర్గస్తులైన వాళ్ళ తాత గారు నాటారని , రెండు సంవత్సరాల కొక సారి కాపు వస్తుంది అని చెప్పింది. ఈ కాయలను ఆవకాయ పచ్చడికి వాడతారంది. మా ఆవిడ వారం రోజుల క్రితం అక్కడికి వెళ్లి ఒక 120 కాయలు తీయించింది (సుశీల పర్మిషన్ తో ). కాయలు కొద్దిగా రంగు రావడం తో మాగాయి పచ్చడికి ఉపక్రిమించింది. ఒక పది కాయలని గడ్డి లో వేసి ముగ్గ పెట్టి ఈ రోజు నాకు ఇచ్చింది.

%d bloggers like this: