క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన షాట్లు ఏవి? ఎందుకు?
క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన షాట్ అంటే హుక్ షాటనే చెప్పుకోవాలి.
అసలీ ఈ హుక్ షాట్ ఎప్పుడు ఆడతారు ?
సాధారణంగా పేస్ బౌలింగ్ లో బంతి పిచ్ కి మధ్యన పడి బ్యాట్స్ స్టంప్స్ వైపుగా దూసుకు వస్తే అదీ బ్యాట్స్ మెన్ స్టాన్స్ ను ఆధారం చేసుకుని బౌలర్ బ్యాట్స్ మెన తలపైన నుండి బంతిని విసిరే(బౌన్సర్) ప్రయత్నం చేస్తే , బ్యాట్స్ మెన్ కు రెండే రెండు అవకాశాలు
- వేగంగా వస్తున్న బంతినుండి తప్పించుకోవడం కోసం వంగడం (డక్) చేయడం.
- వేగాన్నీ బంతి ఎత్తునూ సరిగ్గా అంచనా వేయగలిగి పూర్తిగా భుజాల-చెవుల ఎత్తులో బ్యాట్ ని ఝుళిపించి లెగ్ సైడ్ వైపు బంతిని కొట్టడం .
ముఖ్యంగా బౌన్సీ పిచ్చుల పై ఇవి విపరీతం ఈ షాట్లను చూసే అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియాలో అన్నమాట.
ప్రమాదకరం ఎందుకంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాగే ఫిలిప్స్ హ్యూగ్స్ అనే ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్(దేశవాళీ) ఆటగాడికి హేమరేజ్ అయ్యి చనిపోయాడు
You must log in to post a comment.