Samantha Ruth Prabhu గత కొంతకాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. అలానే ఇంటర్వ్యూల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఆమె అమెరికాకి వెళ్లి మరీ చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

సమంతకు వచ్చిన మయోసైటిస్ అనే వ్యాధి చాలా అరుదుగానే వస్తుంది. ఈ వయసు వారికైనా సరే వచ్చే చాన్స్ ఉంటుందట. కండరాల్లోని అసమతుల్యత వల్లే ఇది జరుగుతుందట. దీని వల్ల వాపు వంటివి ఏర్పడుతాయట. దీని వల్ల ఎక్కువగా తొడలు, నడుము, భుజాలు దెబ్బ తింటాయట. అదే ఒక వేళ ఈ వ్యాధి మరింత తీవ్రంగా మారితే.. చర్మం, ఊపిరితిత్తులు, హృదయం మీద ప్రభావం చూపిస్తుందట. కండరాలు బలహీన పడటం, తీవ్రంగా నొప్పి రావడం, అలసిపోవడం వంటివి జరుగుతుంటాయట.
అయితే మయోసిటిస్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయట. పాలిమయోసిటిస్, డెర్మటో మయోసిటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసిటిస్ ఇలా పలు రకాలుగా ఈ వ్యాధి సోకుతుందని, దీని లక్షణాలు తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది.

డెర్మటో మయోసిటిస్ వ్యాధిని పడిన వారికైతే కండరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందట. చర్మంపై దద్దుర్లు వస్తాయట. ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళల్లో ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంక్లూజన్ బాడీ మయోసిటిస్ వ్యాధిలో అయితే తొడ, మోచేతి భాగాల్లో భరించలేని కండరాల నొప్పి వస్తుందట. ఇది ఎక్కువగా 50 ఏళ్ళు పైబడిన వారికి వస్తుందట.
ఈ వ్యాధి నయం కావడానికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఏదీ లేదని.. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
You must log in to post a comment.