Kantara Telugu Movie: My Review

నేను ఈ రోజు 29 – 10 – 2022 (శని వారం) నాగుల చవితి న కాంతారా సినిమాను నీలపల్లి సత్య థియేటర్ లో భార్య తో కలసి వెళ్లి చూసాను. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. 

నటీనటులు: రిషబ్‌ శెట్టి, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, సప్తమి గౌడ తదితరులు

రచన : దర్శకత్వం: రిషబ్‌ శెట్టి

సంగీతం: బి.అజనీష్‌ లోకేష్‌

1847లో ఓ రాజుకు మనశ్శాంతి కరవవుతుంది. వెతుక్కుంటూ ఒంటరిగా అడవులబాట పడతాడు. ఓ ప్రాంతంలో ఓ రాయిని చూడగానే అతనికి తల్లి, మేనమామ ఆదరణ దొరికినట్టు అనిపిస్తుంది. ఆ రాయిని తనతో తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే స్థానికులు అందుకు ఒప్పుకోరు. వాళ్లు నమ్మే దేవుడు వాళ్లల్లో ఒకరిపై పూని తన కేక వినిపించనంత దూరం ఉన్న ప్రాంతాన్ని వారికి ఇచ్చి, ఆ రాయిని తీసుకెళ్లమంటాడు. మాటతప్పితే విపత్తు తప్పదని హెచ్చరిస్తాడు. సరేనని రాజు యథాప్రకారం చేస్తాడు. అయితే, అతని వారసుల్లో ఒకడు 1970లో అటవీజనాల నుంచి ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం కక్కుకుంటూ కోర్టు మెట్ల మీద పడి చనిపోతాడు.

అప్పటి నుంచి వారసులు ఆ పనులు మానుకుంటారు. అలా కథ 1990కి చేరుతుంది. రాజ కుటుంబం వారసుడు దొర (అచ్యుత్‌) ఆ ఊళ్లో మంచి చెడులన్నీ చూసుకుంటుంటాడు. ఇటు కోలం (మనిషి మీద దేవుడు పూనే ఉత్సవం) ఆడేవాళ్లలోనూ కొత్త జనరేషన్‌ వాళ్లు తయారై ఉంటారు. ఎప్పుడూ కోలం ఆడే అతని కుమారుడు కాకుండా, అతని సోదరుడి కుమారుడు కోలం ఆడుతాడు.

సొంత కొడుకు శివ బలాదూర్‌గా తిరుగుతుంటాడు. శివకు ఎప్పుడూ ఎవో కలలు వచ్చి ఉలిక్కిపడుతుంటాడు. ఈ క్రమంలోనే ఆ అడవీ ప్రాంతానికి మురళీధర్‌ (కిశోర్‌) ఫారెస్ట్ ఆఫీసర్‌గా వస్తాడు. ఆ ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ చేయాలన్నది అతని సంకల్పం. కానీ చాపకింద నీరులా దొర కుయుక్తులతో అక్కడి ప్రజల నుంచి ఆ ప్రాంతాన్ని రాయించుకుంటుంటాడు. ఇన్నిటి మధ్య లోకల్‌ అమ్మాయి లీల కూడా ఫారెస్ట్ ట్రయినింగ్‌ పాస్‌ అయి ఉద్యోగంలో చేరుతుంది. శివకు, లీలకు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంటుంది.

ఎప్పుడూ కోలం ఆడే శివ తమ్ముడు చనిపోతాడు. ఆ సమయంలో శివ జైలులో ఉంటాడు. శివ జైలుకు ఎందుకెళ్లాడు? అతని సోదరుడు ఎలా చనిపోయాడు? ఆ హత్యలకు కారణం ఎవరు? మురళీనా? లేకుంటే దొరా? ఇంతకీ చివరికి ఏమైంది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

ఉడుపి ప్రాంతంలో వినిపించే జానపద కథతో సినిమా చేశారు రిషబ్‌. శివ కేరక్టర్‌లో బెస్ట్ వేరియేషన్‌ చూపించారు. కోలం ఆడేటప్పుడు అతని హావభావాలు హైలైట్‌. అలాగే బలాదూర్‌గా తిరిగేటప్పుడు కూడా పాత్రలో జీవించేశారు. సినిమాలో మిగిలిన వాళ్లు కూడా ఆయా కేరక్టర్లకు పర్ఫెక్ట్ గా సెట్‌ అయ్యారు. డైలాగులు బావున్నాయి. నవ్విస్తున్నాయి. రాత్రిపూట అడవుల్లో టీమ్‌ పడ్డ కష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. కెమెరా పనితనం కూడా హైలైట్‌. క్లైమాక్స్ ముందు పావు గంట మాత్రం మరో రేంజ్‌లో ఉంటుంది. సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రాణం పోసింది. రిషబ్‌ నటుడిగా సెంట్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. .

ప్లస్ పాయింట్
కథ, కథనాలు
రిషబ్ శెట్టి ఫెర్ఫార్మెన్స్, డైరెక్షన్
సప్తమీ గౌడ యాక్టింగ్
మ్యూజిక్, సినిమాటోగ్రఫి

అందుకే … ఆద్యంతం కొత్త ఎక్స్ పీరియన్స్ కలిగించే కాంతారా! మరియు మధ్య మధ్య లో నాకైతే గూస్ బంప్స్ ని తెప్పించిన సినిమా ఇది. కాంతారా నోటి నుంచి వచ్చే సౌండ్ ఈ మూవీ కే హైలైట్. ఇదొక ట్రెండ్ సెట్టర్ మూవీ.

My rating: 4.0/5

Today I saw a Kantara movie. What a treat to watch. All the life lessons were present in the movie. We are supposedly hanging around with our desires, and running behind our selfish desires to get even more without any boundaries at the cost of others lives. Nature has given enough for us to lead our lives peacefully. But we never listen to it and we often think everything is for us. We obviously create chaos in the eco system and let our desires burn out other living things mercilessly. The end of it is we will perish without leaving any symptoms in this world. Another beautiful lesson is the existence of God. The concept behind the God is simple and it means to purify our inner thoughts. It doesn’t matter whether you believe it or not, it is always good to be a disciple of God of any religion which you would like to follow. It may fail to give you the kind of fortunes like lottery but it will never let you go on the wrong path. A hearty kudos to the director for making a wonderful movie. A must watch movie and a rare breed in Indian cinema (forbid the adult contents which come then and there to make us laugh) . Believe me, something still occupies even after completion of the visual treat and can’t even come out of its influence. The climax scene will certainly create goosebumps in you as it would touch your heart and the roots of the cultural residues which your ancestors left within you. Please watch the movie if you find time.

%d bloggers like this:
Available for Amazon Prime