పులస చేప

ఇలిషా అనే జాతికి చెందిన వలస రకం చేపలు ( సముద్రం లో ఉండేటపుడు పేరు ) ఆస్ట్రేలియా, టాంజానియా, న్యూజిలాండ్, దేశాల నుండి సంతాన ఉత్పత్తి కోసం ఖండాలు దాటి ఈదుకుంటూ, సముద్రం నుండి గోదావరి బ్యాక్ వాటర్ లోకి వచ్చి పిల్లలు పెడుతుంది. అది కూడా వర్షాకాలం సమయంలో. ఈ సమయం లో దొరకే చేపలను పులస అంటారు. పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అని మన గోదావరి బ్రదర్స్ ఒక సామెత కూడా చెబుతుంటారు. ఎందుకంటే అంత రేర్ క్వాలిటీ చేప కనుక. ఒక చేపలు పట్టే వ్యక్తి కి ఈ పులస ఒకటి దొరికితే చాలు ఆ రోజు ధర వేలం పాటే తప్ప ఇంత అని లెక్క ఏమి లేదు. పైన చెప్పినట్లు అన్నీ ఖండాలు దాటి బాక్ వాటర్ నుండి వచ్చి గోదావరి లో దొరుకుతుంది కనుక ఈ పులస రుచి మరి దేనికి రాదు ( వంట చేసే వారిని బట్టి ). మామూలుగా కాకుండా ఆవకాయ నూనె, బెండకాయ పులుసు తో కలిపి ఈ పులస మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వండితే ఉంటది నా సామి రంగా. స్వర్గం ప్లేట్ లోకి వచ్చినట్లే ఉంటది.

ఈ పులస చేప సరిగా తెలియకపోతే జరిగే మోసాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ధవళేశ్వరం బారెజ్ నుండి సముద్రం కలిసే చోట ఇవి ఎక్కువగా దొరుకుతాయి. సముద్రంలో ఉప్పు నీరు, గోదావరి తీపి నీరు కలిసి ఉండటం వలన ఈ చేపకు ఆ రుచి వస్తుంది. ఎవరయినా మీకు బంగారం ఎరుపు రంగు లో పులస ఇస్తే కొనకండి, ఎందుకంటే అది ఇలస. సముద్రం లో ఉనపుడు ఆ రంగులో ఉంటుంది. కేవలం గోదావరి లోకి వచ్చినపుడే అది వెండి రంగులోకి వస్తుంది. అందులో కూడా సముద్రం నుండి నదిలోకి వచ్చే చేపలకన్నా, నది నుండి సముద్రం లోకి వెలినపుడు దొరికే చేప ఇంకా మంచి రకం. రుచి బాగుంటుంది. ఇది వల లోకి పడిన వెంటనే చనిపోతుంది. బ్రతికుండగా ఈ చేపను చూసిన జాలరి లేరు. పొద్దున్నే ఒక వల వేసి ఉంచితే సాయంత్రానికి ఒకటో రెండో దొరికితే వాడు ఆ పూటకి రాజా. మూములు చేపల వేట పులసకి పనికిరాదు. ఈ పులస ఐస్ లో ఫ్రీజ్ చేసి ఉంచినా రుచి మారుతుంది. అందుకే చాలా మంది వంట వండేసి ఆ కూరని ఇతర ప్రాంతాలకు పార్సెల్ చేస్తారు. ఇంత డిమాండ్ ఉంది కనుకనే నకిలీ వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది ఇందులో.

%d bloggers like this: