జుట్టు తెలుపు రంగు ఎలా వస్తుంది, హెన్నా, బ్లాక్ (black) హెన్నా, హెయిర్ కలర్ లు తిరిగి వాటిని నలుపుగా ఎలా మారుస్తాయో తెలుసుకుంటే ఏది మంచిదో తెలుస్తుంది.
ప్రతి వెంట్రుకలో మూడు పొరలు ఉంటాయి (కుడివైపు చిత్రం చుడండి).
మొదటి పోర (cuticle) జుట్టుకి రక్షక కవచం వంటిది. రెండవ పొరలో, మెలనిన్ అనే రంగు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ నలుపుగా వున్నపుడు, జుట్టు నలుపుగా కనిపిస్తుంది; ఒకవేళ ఎరుపుగా వున్నపుడు, జుట్టు ఎరుపుగా కనిపిస్తుంది; సరిగా ఉత్పత్తి కానపుడు, జుట్టు తెల్లగా కనిపిస్తుంది.
హెయిర్ కలర్ ఎలా పనిచేస్తుంది?
హెయిర్ కలర్లు, జుట్టు రెండవ పొరలో వున్న రంగు ప్రోటీన్ ని బ్లీచింగ్ ద్వారా తొలగించి, దాని స్థానంలో కృత్రిమ రంగును నింపుతుంది. కానీ రంగు రెండవ పొరకి చేరాలంటే, ముందుగా రక్షక కవచంలా వున్న మొదటి పొరకు చిన్న చిన్న రంద్రాలు చేస్తుంది. ఈ రంద్రాల వలన, జుట్టు రఫ్ (rough) గా, బలహీనం గా తయారవుతుంది.
మెలనిన్ రంగు ప్రోటీన్ 99.9% UV కిరణాలనుండి మనల్ని కాపాడుతుంది. కానీ హెయిర్ కలర్ ప్రతి నలుపు, తెలుపు వెంట్రుకనుండి దీనిని తీసివెయ్యటం వలన, శరీరం UV కిరణాలకు expose అయ్యి కాన్సర్ కి దారి తీసే అవకాశం వుంది. చర్మానికి ఎలర్జీ, రాషెస్ రావటానికి కారణం కృత్రిమ రంగులో వాడే PPD అనే కెమికల్. ఇంకా అమోనియా, బ్లీచింగ్ కూడా వాడుతారు.
కొన్ని కంపెనీలు PPD, అమోనియా, బ్లీచింగ్ లేకుండా హెయిర్ కలర్ చేస్తామని చెపుతాయి కానీ వీటికి బదులు సర్రిగా అలానే పనిచేసే వేరే కెమికల్స్ వాడుతారు.నష్టం మాత్రం అదే. పైకి మాత్రం సంబంధం లేని బాదం, అలోవెరా వంటివి చూపిస్తారు.
బ్లాక్ (black) హెన్నాఅంటే ఏమిటి?
చాలామంది బ్లాక్ హెన్నా ప్రక్రుతి ప్రసాదం అనుకోని వాడుతారు. బ్లాక్ హెన్నా అనేది పెద్ద మార్కెటింగ్ మోసం. ఇది కూడా కెమికల్ కలర్ మాత్రమే. PPD అనే కృత్రిమ రంగు ఇందులో కూడా వాడుతారు. అందుకే హెయిర్ కలర్ ఎలర్జీ వున్న వాళ్ళు ఇది వాడిన కూడా ఎలర్జీ వస్తూనే ఉంటుంది.
original హెన్నా ఎలా పనిచేస్తుంది?
హిందీ లో హెన్నా, తెలుగులో గోరింటాకు. ఇది జుట్టుకి రక్షక కవచం లా వున్న మొదటి పొరకి గట్టిగ అతుక్కు పోతుంది. రెండవ పొరలో వున్న మెలనిన్ రంగు ప్రోటీన్ ని తొలగించదు. రెండవ పొరలోకి వెళ్ళవలసిన అవసరా లేదు కావున మొదటి పొరకి రంద్రాలు చెయ్యవలసిన అవసరం లేదు. జుట్టుకి నష్టం కలిగించదు. గోరింటాకు చెట్లు ఎక్కువగా వర్షపు నీటికి, ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా పెరుగుతాయి. ఆకులు ఎండపెట్టి, పొడిచేస్తే ఎటువంటి కెమికల్స్ లేకుండా సంవత్సరం అయినా చెడిపోకుండా ఉంటుంది. కృత్రిమ రంగులు లేని కారణంగా చర్మ సమస్యలు కూడా రావు.
అయితే తెల్ల జుట్టు ఎరుపు రంగులోకి వస్తుంది. నలుపు రంగులోకి కావాలంటే, ఇండిగో ఆకు పొడి, గోరింటాకు తరువాతా లేదా గోరింటాకు పొడితో కలిపి కానీ వాడాలి. ఇండిగో మొక్కలు ఎక్కువగా తమిళనాడు లో పెరుగుతాయి.
You must log in to post a comment.