ఆంధ్రా బిర్యానీ:
బిర్యానీ అనే కన్నా పులావ్ అంటే సబబుగా ఉంటుంది, కట్ట అనీ సాంబార్ లాంటి సొరకాయ తో చేసిన షేర్వా ఇస్తారు ఇది హైలెట్ ఈ ఆంధ్ర బిర్యానీ కి అలాగే ఒక విధంగా అందరి ఇళ్లల్లో చేసే బిర్యాని చాలా శాతం ఇలాంటి పులావ్ నే అయి ఉంటుంది… ఇంకా ఆంధ్ర లో, సుభాని బిర్యానీ, మద్రాస్ బిలాల్(గుంటూరు) పండలపాక బిర్యానీ (రాజమండ్రి), విజయవాడ లో అయితే స్వీట్ మేజిక్, గోల్డెన్ పెవిలియన్ వంటి వాటిల్లో మీకు ఆంధ్ర బిర్యాని దొరుకుతుంది
హైదరాబాద్ బిర్యానీ:
నా ఫేవరేట్, హైద్రాబాద్ వెళ్తే తప్పకుండా నా ప్లేట్ లో ఉండవలసిన పదార్ధము… షాదాబ్, మే ఫిల్స్, షా గౌస్, పిస్తా హౌస్, గ్రీన్ బావార్చి, కేఫ్ బాహార్ లాంటి వాటిని తప్పకుండా వదిలి పెట్టకుండా తినేసాను…హైద్రాబాద్ బిర్యానీ లో మసాలా పార్ట్ హైలైట్ సమానంగా ఉండే వైట్ రైస్ మసాలా రైస్ చాలా అద్భుతంగా ఉంటుంది
దిండుగల్ తలపా కట్టి బిర్యానీ:
ఆ బిర్యానికి కి కూడా ఆ పేరు చాలా గమ్మత్తుగా వచ్చింది, 1957 లో ఆ బిర్యానీ తయారు చేసే ఆయన తల పాగా కొట్టుకొని వండే వారు అంట అందుకే ఆ పేరు తలపా కట్టి బిర్యానీ అనీ వచ్చింది, చిట్టి ముత్యాల రైస్ తో చాలా అద్భుతమైన రుచి తో పాటు మసాలా పాళ్లు చాలా తక్కువ ఉంటూ పప్పు తో కూడిన ఒక షేర్వా ఇస్తారు రెండిటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది
దొన్నె బిర్యాని:
ఆకులతో తయారు చేసిన ఒక కప్పు లో బిర్యానీ పెట్టి ఇస్తారు, ఇవి కూడా చిట్టి ముత్యాలు తో తయారు చేస్తారు…మసాలా చాలా తక్కువ ఉండి మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ లా ఉంటుంది
లక్నోవి బిర్యానీ:
ఆవద్ బిర్యానీ అనీ కూడా ఇంకో పేరు, నవాబుల కాలం నుండి బాగా ప్రాచుర్యం పొందిన బిర్యానీ, ఎన్నో మసాలా దినుసులు, కుంకుమ పువ్వు తో చేసే ఈ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది
కాశ్మీరి బిర్యానీ:
మా సీనియర్ కాశ్మీర్ అవ్వడం వల్ల ఆవిడ ద్వారా ఈ బిర్యానీ తినడం జరిగింది, కాశ్మీర్ వాళ్ళ కారం తో అద్భుతంగా ఉంది ఇంకో విషయం ఏమిటంటే ఇందులో ఇంగువ వేసి చేస్తారు, ముందుగా ఇంగువ బిర్యానీ లో ఏమిటో అనుకుంటూ తిన్న చాలా బాగుంది అనిపించింది (నేను మన బిర్యాని పెట్టాను లెండి)
కలకత్తా బిర్యానీ/ బెంగాలీ బిర్యానీ:
ఆలు వేసిన బిర్యానీ ఇది, చికెన్ లేదా మటన్ తో పాటు ఒక బంగాళా దుంప కూడా కల్పి ఇస్తారు ఇందుకు కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో మాంసం ఉత్పత్తులు చాలా ఎక్కువ రేటు ఉండటం వల్ల బంగాళా దుంపలు కలిపే వారు, కొంచం తియ్యగా కూడా ఉంటుంది అలాగే చాలా తక్కువ నూనె, మసాలా వాడతారు మన హైదరాబాద్ బిర్యానిలా కాకుండా ఉంటుంది…ఇది ఆవద్ రాజు వల్ల కలకత్తా చేరింది అందుకే లక్నోవి బిర్యానీ కు చాలా దగ్గర పోలికలు ఉంటాయి
పైన చెప్పిన ఏ బిర్యానీ రుచి కి ఇంకో బిర్యానీ రుచి సాటి రాదు, ఒక్కో ప్రాంతం లో ఒక్క రుచి తో తయారు చేసే వాళ్ళు, ఇంకా పైన చూపించిన బిర్యానీ కాకుండా…మలబర్ బిర్యానీ (కేరళ), వయంబడి బిర్యానీ(తమిళ్ నాడు), తలసేరి బిర్యానీ (కేరళ) ఇంకా చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి
You must log in to post a comment.