యువతీ యువకులకు -పెళ్ళి సంబంధాలు – సలహాలు మరియు సూచనలు

“Compromise with color but not with character” రంగుతో రాజీ పడండి కానీ గుణంతో కాదు. పై వాక్యం ఇద్దరికీ అటు అమ్మాయికి అబ్బాయికి వర్తిస్తుంది.

చేసుకునే అమ్మాయి ఐశ్వర్యారాయ్ లాగా అని అనుకోవద్దు, చేసుకునే అబ్బాయి మహేష్ బాబు, టామ్ క్రూజ్ లాగా ఉండాలి అని అనుకోకండి, మనకి తగ్గట్టుగా ఉందా లేదా అని ఆలోచించడం మంచిది . అట్లాగే చేసుకునే అమ్మాయి బిల్ గేట్స్ కూతురు కాదు, కట్న కానుకలు ఆశించడానికి ఎక్కువ మొత్తంలో, చేసుకునే అబ్బాయి అనిల్ అంబానీ కొడుకు కాదు, ఆస్తి డబ్బు సంపాదన ఆశించడానికీ.

అబ్బాయి అయిన అమ్మాయి అయిన మంచి చదువు ఉద్యోగం ఉండి,కలిసి బ్రతకడానికి సరిపోతుందా అని ఆలోచిస్తే నయం. అలా కాకుండా డబ్బు కట్నం వగైరా వగైరా అన్నీ పెట్టుకొని ఉంటే సంబంధాలు దొరకడం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి స్థాయికి వాళ్ళకి తగ్గట్టు ఉంటే మంచిది, హెచ్చులు మెచ్చులు కోసం ప్రాకులాడితే అన్నీ ఫిల్టర్ ఔట్ అయ్యి చివరికి ఎవరో ఒకరు లే అనే స్థాయి వస్తుంది. అమ్మాయి లేదా అబ్బాయి దొరికితే చాలు అనుకుంటారు చివరికి. ఇదే జరుగుతుంది కూడా ఈ రోజుల్లో.

సంబంధం చూసాము కదా ఇక పెళ్లి చేసుకుందాం అని అప్పుడే తొందర పడొద్దు. వాళ్ల గురుంచి, అబ్బాయి/అమ్మాయి గురుంచి తెలుసుకోండి. పెళ్లికి కొంత సమయం ఇవ్వండి. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకరికొకరు తెలుసుకుంటే బాగుంటుంది, ఒకేసారి ఏమి తెల్వ కుండా చేస్తే తరువాత బెడిసి కొదితే ఎవరు ఏమి చేయలేరు.

పెళ్లి ఇష్టంగా చేసుకోండి అంతే కానీ బలవంతంగా , తిట్టుకుంటూ తుమ్ముకుంటు మాత్రం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు తోడు అనే ఆలోచన ఎప్పుడు ఉండాలి. అన్నీ విషయాలలో తనకి నేను ఉంటాను అనే ఆలోచన పెంచుకోండి.

ఇటువంటి అంశాలు పెద్దలు కుదిర్చే వివాహాలకు వర్తిస్తాయి, ప్రేమ వివాహాలకు వర్తించవు.

చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక అపోహ ఉంటుంది, పెళ్లి అయ్యాక ఇలా వుంటారు అలా ఉంటారు భలే ఉండొచ్చు అని లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంత సినిమా ఉండదు అండి, కొన్ని రోజులు బాగుంటుంది తరువాత రొటీన్ ఉంటుంది,

పెళ్లి మీద అత్యాశలు, అత్యానందం, అత్యుత్సాహం పెట్టుకోకుండా, నార్మల్ గా ఒక వ్యక్తితో జీవితాంతం ఉండాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే చాలు. మిగతావి అన్నీ లైన్ లోకి వస్తాయి.

%d bloggers like this: