పాములు venomous (విషం ఉన్నవి), non-venomous ( విషం లేనివి) అని రెండు రకాలు.
Venomous పాముల్లో రెండు రకాలు ఉంటాయి:
- Neurotoxic venom (నరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది): మనం సాధారణంగా భారత దేశంలో చూసే పాములు – కోబ్రా (గోధుమ వన్నె త్రాచు), kraits (red banded kraits, yellow banded kraits), నల్ల త్రాచు (కింగ్ కోబ్రా) ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి.
- Haemo toxic venom (రక్త నాళాల ద్వారా వ్యాప్తి చెందుతుంది) : Vipers (ఇవి ఎక్కువగా కొండలు, రాళ్ళు, రప్పలు దగ్గర ఉంటాయి), సముద్ర పాములు.
పాముని గుర్తించటం:
- ఏదైనా విషపు పాము “S” ఆకారంలో పాకుతుంది, చాలా వేగంగా వెళ్తుంది.
- ఒకవేళ ఖర్మ కాలి కాటు వేస్తే, ఆ కాటు లో రెండు రంధ్రాలు పడ్డాయి లేక గజిబిజి గా దెబ్బ లా తగిలిందా చూడండి. రెండు రంధ్రాలు పడితే చాలా ప్రమాదం. ఇది విషపు పాము కాటు. గజిబిజి గా కాటు వేస్తే అది విషం లేని పాము.
- విషపు పాము కాటు వేస్తే, వెంటనే అక్కడ నుంచి ఒక కొంచం పైకి గట్టిగా కట్టు కట్టాలి. రక్తం సరఫరా ఆగిపోయే అంత గట్టిగా కట్టాలి. దీని వల్ల విషం మిగతా శరీరానికి వ్యాపించకుండా, ప్రాణానికి ప్రమాదం జరగకుండా చేయచ్చు.
- కట్టు కట్టిన తర్వాత సబ్బుతో కాటు వేసిన చోట కడగాలి. నీళ్ళ ధార కాటు మీద పోయండి కనీసం ఒక 5 నిమిషాలు.
- పేషంట్ ని నిద్రపోనివ్వకుండా వీలైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి.
(గమనిక: మన సినిమాల్లో చూపించినట్టు బ్లేడ్ తో కోసి, మీరు నోటి తో విషం పైకి తీయాలని పిచ్చి ప్రయత్నాలు చేయకండి, పేషంట్ కంటే ముందు మీరు పోతారు).
You must log in to post a comment.