Teachers day Celebration at Dr.B.R.Ambedkar Polytechnic College, Yanam

On 05-09-2022, Teachers day Celebrated First year students. This is the first time that our first year students have done separately. This programme was done in the evening. Department students of II year and III year ECE, CE and Civil have done combinely with principal as chief guest in LRUC in the morning.

My speech

Good Evening to every one.

ముందుగా అందరికి ఉపాధ్యాయ దినోత్సోవ శుభాకాంక్షలు. మీ అందరికి తెలుసు. ఈ రోజు సెప్టెంబర్ 5 . ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటాం. ఈ రోజు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన రోజు. అయన మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. తర్వాత 1962 వ సంవత్సరం లో రాష్ట్రపతి అయ్యారు. ఆయనకు ఉపాధ్యాయ వృత్హి అయినా, ఉపాధ్యాయులు అయినా అపార గౌరవం. ఒక సారి అయన స్నేహితులు వచ్చి మీ పుట్టిన రోజు సందర్భం గా పార్టీ ఇస్తాం, అంటే అయన నిర్మొహమాటం గా వద్దని చెప్పి, ఆ డబ్బులు తో మీకు తెలిసిన ఉపాధ్యాయులనుసత్కరించమని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అయన దేశానికీ చేసిన సేవల గుర్తుగా అయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవం గా మార్చింది. మీ అందరికి తెలుసు మీ మొదటి టీచర్ ఎవరు. మీ అమ్మ. అందుకే మాతృ దేవోభవ అయ్యింది. తర్వాత టీచర్ మీకు నడవడిక నేర్పిన మీ నాన్న. అందుకే పితృ దేవోభవ అయ్యారు. తర్వాత మీ లైఫ్ లో మీలో ఉన్న అజ్ఞాన్నాన్ని పారద్రోలి జ్ఞానాన్ని నింపే మీ టీచర్. అందుకే గురు దేవోభవ. టీచర్ బయట రోడ్ పై వెళ్తున్నప్పుడు , తన దగ్గర చదువుకున్న విద్యార్థ్దులు విష్ చేస్తున్నప్పుడు అదొక ఆనందం. బహుశా ఆ ఆనందం ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా కలగదు. అందుకే ఈ టీచింగ్ ప్రొఫెషన్ ని నోబెల్ ప్రొఫెషన్ అని అన్నారు. మీరు కూడా మీ టీచర్ చెప్పేటువంటి సూచనలను తప్పకుండా పాటించి మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆశిస్తాను. నా ఉపన్యాసాన్ని ముగించే ముందు అందరూ ఒక సారి నాతో పాటు అనండి. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే పరభ్రమ్మ, తస్మై శ్రీ గురువే నమ :.

%d bloggers like this:
Available for Amazon Prime