నాకు నాలుగు రోజుల క్రితం కుడి భుజం లో నొప్పి స్టార్ట్ అయ్యింది. నేను డైలీ ప్రొద్దున్నే బాడ్మింటన్ ఆడతాను. బవుసా ఆట లో తప్పుడు షాట్ ఆడటం వల్ల వచ్చింది అనుకున్నా. తర్వాత రోజు నుంచి ఆటకు వెళ్లడం మానుకున్న. అయినా సరే నొప్పి తీవ్రత కొంచెం పెరిగింది. ఇంటి కాడా ఎవరు లేరని చెప్పి హోటల్ కి వెళ్లి బిరియాని తీసికొని మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలు తిన్నాను. నొప్పి ఇంకొంచెం పెరిగింది. అప్పుడు అన్పించింది అది గ్యాస్ పెయిన్ అని. తగ్గిపోతుంది అనుకున్నా. మర్నాడు మా కాలేజీ స్టాఫ్ ఒకరి ఫంక్షన్. మొదట్లో మానేద్దామనుకున్న మళ్ళీ మనస్సు మార్చుకొని అటెండ్ అయ్యా. ఇక్కడే ఇంకో తప్పు జరిగింది. అక్కడ ఉన్న నాన్-వెజ్ ఐటమ్స్ చూసి నోరూరి తినేసా. అంతే నా కుడి భుజం లో నొప్పి భీభత్సం అయ్యి, అది నెమ్మది గా ఎడమ భుజం కి పాకింది. అంతే ఆ రాత్రి నాకు కాల రాత్రి అయ్యింది. నిద్ర పట్ట లేదు. ఒక పక్కకు తిరిగి పడుకోలేని పరిస్థితి. ఇంకో గంట లో ప్రొద్దు పోతుంది అని, మళ్ళీ కాలేజీ కి వెళ్లి డ్యూటీ చేయాలి కదా అని చెప్పి, ఒక నిద్ర మాత్ర వేసుకొని ఒక గంట సేపు పడుకొన్నాను. కాలేజీ లో క్లాస్ కి వెళ్ళగానే అర్థం అయ్యింది, నా కుడి చెయ్యి అస్సల కొంచెం కూడా పైకి లేగ లేకుండా అయ్యింది. అదృష్టం కొద్దీ స్టూడెంట్స్ కి స్లిప్ టెస్టులు పెట్టాను. ప్రశ్నల ను ఒక స్టూడెంట్ సహాయం తీసుకొని బోర్డు వ్రాయించాను. ఇలాగ రెండు రోజులు చేయించాను. కొంతమంది ఫీజియోథెరపీ చేయించుకోమని సలహా ఇచ్చారు. తర్వాత రోజు వినాయక చవితి. సెలవు. తగ్గిపోతుంది అనుకొన్న. రాత్రికి నొప్పి తీవ్రత ఎక్కువై ఫీవర్ కూడా వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఆసుపత్రి కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఇంకా నాకు కూడా అర్థం అయ్యింది. కుడి భుజం అనేది ఒక లెక్చరర్ కి చాల ఇంపార్టెంట్ అని. ఇంకా అశ్రద్ధ చేయకుండా రాత్రి భార్య బంధువుల సహాయం తో యానాం గవర్నమెంట్ ఆసుపత్రి కి వెళ్ళాను.
నాకు ఈ ఆసుపత్రి పై పెద్దగా మంచి అభిప్రాయం లేదు. కానీ అక్కడ క్యాజువాలిటీ లో ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఈ కరోనా పరిస్థితులు వల్ల డాక్టర్స్ పేషెంట్స్ ని దూరం నుంచే చూస్తున్నారు. ఈ లేడీ డాక్టర్ కూడా దూరం నుంచే చూసి, తర్వాత నేను చెప్పిన లక్షణాలు బట్టి నన్ను షర్ట్ పై బటన్స్ విప్పమని చెప్పి, నా భుజం ని పరిశీలించింది. వెంటనే జి. ఎం. ర్ చేయుంచుకొమ్మంది. నా షుగర్ లెవెల్ 127mg , బి.పి 130 /90 . ఆ తర్వాత నర్స్ నాకు పాంటోప్ ఇంజక్షన్ నా ఎడమ చేతి నరానికి ఇచ్చింది (ఇది కడుపు లో ఫార్మ్ అయ్యిన అసిసిడిటీ ని తగ్గించడానికి). ఇంజెక్షన్స్ అంటే భయం నాకు. కానీ ఈ నర్స్ చాల నెమ్మదిగ చేయడం వల్ల ఇంజక్షన్ చేసినట్టే తెలియ లేదు. జాయింట్స్ దగ్గర ఇంకా నొప్పి తగ్గ లేదని ఆ డాక్టర్ కి చెప్తే Diclo ఇంజక్షన్ వ్రాసింది. ఈ ఇంజక్షన్ నా మక్కి కి చేసారు. ఈ సారి మాత్రం నాకు దేవుడు దిగి వచ్చాడు. నర్స్ మీద ముందు ఉన్న మంచి అభిప్రాయం కాస్త పోయింది. లేడీ డాక్టర్ క్రింది మూడు 3 రోజులకు మందులు వేసుకోమని వ్రాసింది.
Zerkodol – Sp 1-0-1
Rabe – D. OD 1-0-0
Thiocholchoxid 4mg 1-0-1
డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్స్, మందులు వాడడం వళ్ళ ఈ నాలుగైదు రోజులు భరించిన నొప్పి నెమ్మదిగా తగ్గి, వినాయక చవితి తర్వాత రోజు కాలేజీ క్లాస్ లో నేనే సొంతం గా నా కుడి చేతి ని పైకి ఎత్తి బోర్డు పై వ్రాయగలిగాను.నాకు ఒకటే అన్పించింది, ఈ యానాం గవర్నమెంట్ ఆసుపత్రి లో మంచి వైద్యం ఇచ్చే డాక్టర్స్ ఇంకా కొంతమంది ఉన్నారని.
You must log in to post a comment.