వీటినే ‘ ఒయ్యారి భామ ‘, పిచ్చి మాసుపత్రి ‘, కాంగ్రెస్ గడ్డి ‘ అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఇవి మొండి జాతి మొక్కలు. నీటి ఎద్దడి ప్రాంతాలలో సైతం ఇవి ఏపుగా పెరుగుతాయి. ఒక మొక్క గరిష్టంగా లక్ష మొక్కలను ఉత్పత్తి చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మొండి మొక్క.
దీని గాలి పీల్చితే జలుబు, దగ్గు, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. ఈ మొక్కల్ని తాకితే దురదలు, దద్దుర్లు కలుగుతాయి.
ఈ మొక్కలు అమెరికా నుంచి మన దేశానికి విస్తరించాయి. ఆ దేశం నుంచి దిగుమతి అయిన గోధుమల ద్వారా మన దేశంలో ప్రవేశించాయి. ఇవి కాలువ గట్టు, చెరువు కట్ట, ఖాళీ ప్రదేశాలు, రహదారుల పక్కన.. ఇలా ఎక్కడబడితే అక్కడ విస్తరించాయి. ఇవి ఆహారంగా భావించి పశువులు తిని, రోగాల బారిన పడుతున్నాయి.
ఓ సామాజిక కార్యక్రమంలా వీటి నిర్మూలన జరగాలి.
You must log in to post a comment.