“ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాలగుండా ప్రయాణం”

మాస్టరు గార్కి నమస్కారములు

1-12-2004 సం || లో సహజ మార్గం లో మొదటి సిట్టింగ్ తీసుకున్నాను. సిట్టింగ్ లో ఉండగా మైకం కమ్మి కళ్ళు మూతలు పడ్డాయి. 2. వ. సిట్టింగ్ లో గుండెలో చల్లని గాలి వీచింది.  3. వ. సిట్టింగ్ లో శ్వాస ఉక్కిరిబిక్కిరి అయ్యింది. 06-12-04 న ధ్యానం లో కళ్ళ వెంబడి నీళ్లు కారడం మొదలు అయ్యింది. గురువు గారి దివ్య ధార వస్తున్నట్లు అనుభూతి కలిగింది.  08-12-2004 న గుండె కు కుడి వైపున ఏదో కదిలినట్లు కొద్దిగా నొప్పి అనిపించి, తర్వాత మాములు స్థితి కలిగింది. 10-12-2004 న ధ్యానం లో ఛాతి లో మంట వచ్చి, తర్వాత ఐస్ లా మారింది. 11-12-2004 న సత్సంగం లో శరీరం తేలికగా మారింది. 14-12-2004 న ధ్యానం లో ఆ జప వినబడింది. 17-12-2004 తెల్లవారుఝామున పాము బుస కొడుతూ మంచం చుట్ట్టు తిరిగినట్లు అనుభూతి కలిగింది.

అదే రోజు సిట్టింగ్ లో కారు హెడ్ లైట్ కాంతి ఎడమ కంటి మీద పడింది. కళ్ళు మూసినా వెలుగు కన్పించింది.  19-12-2004 న, శరీరం ఊగడం మొదలైంది. 27-12-2004 పళ్లెం లో పువ్వులు, తమలపాకు, చెక్క ఇస్తున్నట్లు అనుభూతి కలిగింది. 31-12-2002 కడుపు లో కదలిక, తల లో కదలిక వచ్చింది. 01-01-2005 సత్సంగం లో పళ్లెం లో ఆహారం ఇస్తున్నట్లు అనుభూతి. 02-01-2005 కొండా మీద ఆశ్రమం కనిపించి నట్లు అనుభూతి. 05-01-2005 కళ్ళకు వెలుగు కనిపించింది. 11-01-2005 ధ్యానం లో శరీరం పైకి లేగిచి గది అంత తిరిగి నట్లు అనుభూతి కలిగింది. 14-01-2005 వెన్ను పాము పాకినట్లు అనుభూతి కల్గింది. వెన్నుపాము లో కదలికలు వచ్చాయి. 21-01-2005 శరీరం లో కరెంటు ప్రవహిస్తున్నట్లు అనుభూతి కల్గింది. తల లోను, గుండె లోను క్లీనింగ్ జరిగింది.  02-02-2005 లాలాజీ గారి పుట్టిన రోజు. సత్సంగ్ లో లాలాజీ గారి ఫోటో లో చేతులు లేని కోటు తో కన్పించారు. 18-03-2005 న తల వెంట్రుకలు చుట్ట బెట్టి నట్లు అనుభూతి. 25-06-2005 గుండె లో చేప పిల్ల ఈదినట్లు అన్పించింది. 26-06-2005 “లక్కీ పర్సన్ అని చారీజీ కంఠ స్వరం విన్పించింది. 20-07-2005 గురు పూర్ణిమ బంగారు రంగు లో బిట్స్ ఆకారాలు రోల్ అవుతున్నట్లు అనుభూతి. గణ గణ గంట నాథం, శంఖా నాదం, లీనా నాదం చెవుల నుండి 5 ని ,, లు వచ్చాయి. కొంత సేపు చాల హడావిడి అన్పించింది. ఆత్మ లేచినట్లు అనుభూతి కల్గింది. అప్పుడు రాత్రి ౯ గంటల నుండి 10 గంటల లోపు. 24-07-2005 చారీజీ గారి పుట్టిన రోజున సత్సంగ్ లో ఎవరో హారతి వెలిగించి నట్లు, నే కళ్ళకు అడ్డుకున్నట్లు అనుభూతి.

          ఆత్మ ప్రయాణం 1 . వ. బిందువు నుండి మొదలు మర పడవ ప్రయాణం చేస్తుంటే వచ్చే శబ్దం వినపడింది. 1 . వ, బిందువు దాటినట్లు అనుభూతి. 25-07-2005 2. వ బిందువు దాటింది. 26-07-2005 న 3 . వ బిందువు అగ్ని పెద్ద మంటలా కన్పించింది. 3 . వ బిందువు దాటింది. 4 వ బిందువు దాటింది.5 వ బిందువు చేరాక దారి ఏర్పాటు చేసుకుంది. ఎడమ దవడ నుండి ఎడమ కణతి వరకు మార్గం ఏర్పాటు చేసుకుంది. ఆత్మ ఎడమ కణతి చేరినప్పుడు గిలిగింతలు వచ్చాయి. 6 . వ గ్రంధి సమీపం లో ఆయాపాయాన్ని తెలిపే సంగీతం వినపడింది. ఆత్మ 6 . వ. బిందువు దగ్గరకు వెళ్ళలేదు. 7 వ బిందువును చేరింది. తల లో ఆత్మ 8 . వ గ్రంధి వద్ద నుండి ప్రదక్షిణం చేసింది. 9 వ బిందువు వద్ద చేరింది. ఆత్మ 10 వ బిందువు వద్ద చేరింది. 13-11-2005 ఆత్మ సహస్ర దళ కమలం లో ఉంది. ఆత్మ మనో మండలం లోని 11 , 12 , 13 బిందువు దాటింది. ఆత్మ కేంద్ర మండలం చేరింది. ఆనంద సాగరం లో ఈత కొట్టడం మొదలుపెట్టింది.

12-02-2006 ఆదివారం ఉదయం ఆ రోజు పౌర్ణమి ఉదయం 7.30 to 8.30 సత్సంగ్ లో సంధ్య సమయం లో కనిపించే దొండ పండు రంగు ఆకాశం అంత వ్యాపించి ఉన్నట్లు కన్పించింది. ఎర్రటి వెలుగు లో చక్రం కన్పించింది. ఆత్మ సాక్షాత్కార అనుభూతి కలిగింది. 11-03-2006 ఆదివారం సత్సంగ్ లో పాల భాగం లో జ్ఞాన నేత్రం తెరవబడింది. మొదటి దశ లో ఇసుక, 2 వ దశ లో నీలి ఊదారంగు, 3 వ దశ లో ఎరుపు రంగు కన్పించాయి. మాయ మండలం దాటినట్లు అనుభూతి. 16-05-2006 న ఆత్మ చక్రం పసుపు రంగు లాలాజీ వలయం లో విలీనం అయ్యింది. 02-02-2007 న ఆనంద సాగరం లో అలల మీద తేజో వలయాల గుండా ఆత్మ ప్రయాణం మొదలు అయ్యింది. తేజో వలయాలు గుండ్రని తెల్లని ఆకారం తో ఉన్నాయి. మధ్యలో నాభి స్థానం ఉంది. దానిలో ఒక తలుపు ఉంది. గురు దేవులు సాయం తో ప్రయాణం నాభి స్థానం గుండా జరిగింది. 16-04-2007 విష్ణు చక్రం లో తిరిగినట్లు అనుభూతి. 31-05-2007 కృష్ణుడు, రాధాజీ తెల్లని విగ్రహాలు కన్పించాయి. 08-01-2008 బొద్దు క్రింది భాగం లో కదలికలు వచ్చాయి. మీద వెనుక భాగం లో పెద్ద చక్రం తిరుగుతున్నట్లు అనుభూతి. తర్వాత ఎడమ కణతి లో కదలికలు మొదలు అయ్యాయి. తర్వాత మెడ వెనక చక్రం తిరగడం ఆగింది. 22-01-2008 విముక్తాత్మలు ఆత్మని అనేక మండల గుండా తీసికొని వెళ్లాయి. 02-02-2008 న ఆత్మ చక్రం కృష్ణ తేజం లో కలిసింది. కృషుణ్ణి వలయం తో అనుసంధానం అయ్యింది. 21-02-2008 శరీరం పైకి ప్రయాణం. 03-03-2008 వెలుగు లో చారీజీ కన్పించారు. 28-05-2008 న కాల చక్రం కన్పించింది. గాండీవ మండలం చేరుకున్నాను. గాండీవ మండలం ఇంద్ర ధనుస్సులోని రంగులతో ఉంది. బాణాలు కూడా రంగులతో ఉన్నాయి. తర్వాత వశిష్ఠుని కాల దండం చూసాను. 18-06-2008 గాండీవ మండలం దాటాను. 29-06-2008 న గాండీవం, బాణాలు ఆత్మ చక్రం లో కలిసాయి. 23-07-2008 కుల్ కుతుబ్ మండలం లో కి వెళ్ళాను. 26-07-2008 న కుల్ కుతుబ్ మండలం లో ఆత్మ చక్రం విలీనం అయ్యింది. అది గ్లోబు ఆకారం లో ఉంది. 01-08-2008 తురీయాతీత స్థితి . పూర్తి లయ వస్ధ. 24-09-2008 తారా చక్రాలు కాంతి వంతంగా చాల పెద్ద ఆకులతో కన్పించాయి. 07-07-2009 ధ్యానం లో ముక్కు నుండి ఎదో శక్తి పైకి పాకీ నుదురు చేరి తల లో బ్రహ్మ రంద్రం చేరి, రంద్రం ఓపెన్ చేసింది. 15-08-2009 ధ్యానం లో 5 రేకుల తో నక్షత్రం కన్పించింది. 30-11-2010 నీల రంగు మాయ మండలం చూసాను. మాయ  మండలం దాటాను. కృష్ణుని కాంతి పుంజం ఆత్మ లో విలీనం అయ్యింది. 13-08-2011 శరీరం లో కరెంటు ప్రవహించింది. 30-10-2011 శరీరం ధ్యాన స్థితి లో ఉంది. 16-01-2012 విముక్తాత్మల మండలం చూసాను. 02-02-2012 లాలాజీ మహారాజ్ పుట్టిన రోజు ధ్యానం లో గాడి లాంటి ఆకారం కన్పించింది. అందులో వలయాలు కన్పించాయి. నీల రంగు వలయం, పసుపు రంగు వలయం ఆ వలయం లో కలిసాయి. తారా చక్రం బాగా చిన్న ఆకులా కన్పించింది. 01-04-2012 కృష్ణుని ఆత్మ నా ఆత్మ లో కలిసింది. 14-04-2012 ధ్యానం లో కృష్ణుని వలయం  సూక్ష్మ రూపం లో ఆత్మ లో కలిసింది. 11-05-2012 కాపలా ఎముక కుడి వైపు ప్రాంతం నుండి పని మొదలు అయ్యింది. 11-04-2013 ధ్యానం లో వలయాలు చక్ర కారం లో సూడు తిరుగుతూ ఎడమ కంటి లోకి కొన్ని, నోటి లోనికి కొన్ని వెళ్లాయి. సర్పా కారపు పడగలు ౩ సార్లు దీవించాయి. 02-05-2013 ఆత్మ రాధా కృష్ణుని వలయం లో విలీనం అయ్యింది. 17-05-2013 సత్కోల్ ల్లో మధ్యాహ్నం 1 గం. 15 ని . ల నుండి 2  గంటల వరకు విముక్తాత్మలు సిట్టింగ్ ఇచ్చాయి. 01-07-2013 ధ్యానం లో ఆత్మ చక్రం లాలాజీ వలయం, కృష్ణుని వలయం, రాధాజీ వలయం ఉన్న వలయం లో విలీనం అయ్యింది. 07-07-2013 ఆదివారం సత్సంగ్ లో అజపజపం లా గుండె నుండి వినపడింది. 18-08-2013 ఆదివారం సత్సంగ్ లో పొగాకు వాసన వచ్చింది. 04-01-2014 శనివారం రాత్రి 7 గం. 10 ని ,, ల నుండి 7 గం. 35ని ,, వరకు శ్రీ కృష్ణుని వలయం నుండి స్పెషల్ సిట్టింగ్. శ్రీ కృష్ణుని వలయం గ్లోబు ఆకారం లో కన్పించింది. ముఖం మీదికి వచ్చి 5 సార్లు దీవించింది. లాలాజీ వలయం నదీ ప్రవాహం ల మారి నోట్లోకి ప్రవహించింది. ఇలా 5 సార్లు జరిగింది. పాము పడగ ఆకారం 5 సార్లు దీవించింది. మాస్టారు నుండి శక్తీ ఆగకుండా వస్తుంది. నిర్మిలీకరణ దాని కాదే జరిగి పోతూ ఉంది. 12-01-2014 వివేకానందుని పుట్టిన రోజు. ఎరుపు రంగు వలయం దానిలో ఆత్మ చక్రం కన్పించాయి. 09-02-2014 వివేకానందుని ఆత్మ చక్రం లాలాజీ ఆత్మ చక్రం లో విలీనం అయ్యింది.

02-11-2014 సత్సంగ్ లో పొగాకు వాసన. వివేకానందుని ఆత్మ చక్రం లో శ్రీ కృష్ణుని విలయం విలీనం అయ్యింది. 22-12-2014 భగవంతుని సాక్షాత్కారం అయ్యింది. 10-12-2015 న తేజోవాలయాలు దాటడం అయ్యింది. తేజోవాలయాలు దాటడానికి 8 సంవత్సరాల 1 నెల 20 రోజులు పట్టింది. 09-04-2015 న దాజీ గారు యానాం వచ్చారు. 4 గం.ల 45 ని ,, ల నుండి 5 గం.ల 15 ని ,, ల వరకు సత్సంగ్ జరిగింది. సత్సంగ్ లో నా స్థితి పురోగతిని పొందింది. 10-04-2015 నా ప్రేరణా కోశాన్ని డాటాను. 13-04-2015 ఏవో సన్నని పొడవైన ఆకుల ఆకారం లో లాలాజీ వలయం విలీనం అయ్యింది. 14-04-2015 వెలుగుల తో నిండిన వలయం లో లాలాజీ వలయం  విలీనం అయ్యింది. 12-02-2016 న 6 -30 ఉదయం సత్సంగ్ ఉదయం 7 గం. 15 ని .. ల వరకు కన్హా లో మాస్టర్ సత్సంగ్ లో భూమా స్థితి కలిగింది. 03-03-2016 తల లో పడమటి స్థానం బ్రహ్మ రంధ్రం దగ్గర పని జరుగుతున్నట్లు వీణా నాథం వినిపించింది. 16-03-2016 కాంతి పుంజాలు శక్తీ జనకాలు నక్షత్త్రల్లా కన్పించాయి. చిన్న సైజు లో విముక్తాత్మలు తిరుగుతూ కన్పించాయి. దివ్య దృష్టి తెరుచు కున్నాక కన్పిస్తుందని దివ్య దృష్టి నేత్రం ఆజ్ఞ చక్రం దగ్గరి లో ఉంటుందని కళ్ళు మూసుకుంటే తెరుచుకుంటుందని అనుభూతి చెందాను. 20-04-2016 యానాం ఆశ్రమం చోటు లో ఉదయం 8 గం ,, ల కు  మాస్టర్ కన్హా ఆశ్రమం నుండి సత్సంగ్ జరుపుతు ఉన్నారని అబ్యాసులను ఆ చోటు కు పిలిపించి సత్సంగ్ జరిపారు. సత్సంగ్ 40  ని ,, లు పట్టింది. నా శరీరం లో నాభి స్థానం దగ్గర చక్రం తిరుగుతు ఉంది. బ్రహ్మం లో లయా వస్థ మొదలైనప్పుడు ఆలా తిరుగుతుందని “శ్రీ రామ చంద్రుని సంపూర్ణ రచనలు – సంపుటి 5 . భగవంతుని లో లయం పేజీ నెం. 7  లో చదివాను. సాయం కాలం 6 గం. నుండి 6 .30 నిర్మిలీకరణ లో మాములుగా అయ్యింది. “శక్తీ క్రింది నుండి పైకి కపాలం లో పడమటి భాగం లోనికి వెళ్లి అక్కడ పని చేస్తుందని బాబూజీ రచించిన భగవంతుని లో లయం” అనే భాగం లో వ్రాసి ఉంది. దాని ప్రకారం గా అనుభూతి చెందాను.

          నా అభిప్రాయాన్ని పంచుకుందామని అనుకుంటున్నాను. ఈ లోకం లో గురువును మించిన దైవం లేడు. గురువే సాక్షాత్ పర బ్రహ్మ. గురువు అడుగు జాడ లో నడుచుకుంటే విజయం తథ్యం. శరణా గతి, భక్తి, విశ్వాసం, శ్రద్ధ, పట్టుదల, అకుంఠిత దీక్ష, ఓర్పు, సహనం, ప్రాపంచికం, ఆధ్యాత్మికం సమానం గా తక్కెడ మాదిరిగా బాలన్స్ చేస్తూ జన్మ ఎత్తిన న నాకు సత్యాన్ని చూపించిన గురు పరంపరకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ

                                                                                                  వి. ఆదెమ్మ , యానాం.

                                                                                                   ID No. INAVAE050

%d bloggers like this:
Available for Amazon Prime