మండువా ఇళ్ళు

మండువా లోగిలి నిర్మాణం కనీసం 600 గజాల స్థలం అవసరం. దీని నిర్మాణానికి కనీసం 25 లక్షల రూపాయలు అవసరం.

పురాతన లోగిలి

సాధారణంగా మండువా లోగిలి చుట్టూ 8–10 గదులు ఉండి, మధ్యలో వాలుగా కిందికి చూరు దిగేలా చేస్తారు. మధ్యలో నలు చతురస్రంగా మూడడుగుల లోతుగా కట్టడం ఉంటుంది. నలువైపులా కిందికి పడే వర్షపు నీరు దీంట్లో పడుతుంది. అక్కడి నుంచి నీరు బయటకు వెళ్ళేలా డ్రైనేజీ ఏర్పాటు ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల లోపలి గదులకు వెలుతురు, కొద్ది గాలి లభిస్తుంది. ముందు వైపు వరండాగానీ, అరుగులు గానీ నిర్మించుకోవచ్చు.

ఆధునికంగా అభివృద్ధి చేసిన మధ్య భాగం.

సమస్య

ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో మండువా లోగిళ్ళు విరివిగా ఉండేవి. పెంకులు నేసేవారు లభించక, పైకప్పు చెదలు పట్టడం వంటి సమస్యల వల్ల వాటిని తొలగించి, డాబాలు, మేడలు నిర్మించటంప్రారంభించారు. ప్రస్తుతం పెంకుల తయారీ నిలిచింది. ఎక్కడైనా మరమ్మతులు చేయించాలంటే, పెంకులు లభించక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మండువా లోగిళ్ళు నిర్మించే ముందు ఆలోచించుకోవాలి.

%d bloggers like this:
Available for Amazon Prime