ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఖరారు – 2022

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖారాదైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది.

పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 27 – తెలుగు

ఏప్రిల్ 28 – సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 29 – ఇంగ్లిష్

మే 2 – గణితం

మే 4 – సైన్స్ పేపర్ -1

మే 5 – సైన్స్ పేపర్ – 2

మే 6 – సాంఘిక శాస్త్రం

%d bloggers like this: