మాగసానితిప్ప – విహార యాత్ర – ఒక మధురానుభూతి !

ది 01 -03 -2022 న మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నేను భార్యతో కలసి నా జీవితం లో మొదటి సారి మాగసానితిప్ప కి వెళ్లి అక్కడ ఉన్న శివ భైరవుడుని దర్శించుకొందామని బయలుదేరాము. నేను నా భార్యను పల్సర్ బండి పై ఎక్కించుకొని దరియాలతిప్ప లో ఉన్న జెట్టి కి బయలుదేరాము. దారిలో టిఫిన్ చేసాము. మేము జెట్టి దగ్గరకు వెళ్ళగానే డిజిల్ బోటు రెడీ గ ఉన్నది. భార్య తరపు బంధువు అయ్యిన మల్లాడి విజయ్ పురమాయించాడు. ఆ బోటు ఖరీదు సుమారు లక్ష ఏభై వేళా రూపాయలు ఉంటుందని చెప్పింది. ఉదయం 10 .30 గంటలకు దరియాలతిప్ప జెట్టి నుండి మా బోటు ప్రయాణం స్టార్ట్ చేసాము. బోటులో మాతో పాటు 10 మంది ఉంటారు. ఈ ప్రయాణం పెద్ద గోదావరిని దాటి కాలువుల గుండా సాగింది.

https://www.youtube.com/shorts/hhgsBkjomvI

ఇరువైపులా మడ చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంది. నా కెందుకో ఈ దృశ్యం చూస్తే కేరళ బ్యాక్ వాటర్స్ ని తలపించింది.. ఆంధ్ర టూరిజం శాఖ వారు దీనిని అభివృద్ధిని చేస్తే సూపర్ గా ఉంటుంది అనిపించింది. ప్రయాణం సుమారు గంటన్నర సాగింది. దారిలో మల్లాడి సత్తిబాబు కుటుంబం తో దర్శనం ముగించుకొని అతను తిరుగు ప్రయాణం లో మాకు ఎదురయ్యారు. అత్త గారు, వంశీ, వాళ్ళ ఆవిడా ఆ బోటులోనే ఉన్నారు. దారిలో మురమళ్ళ రేవుకు, మూలపొలం, పల్లం కి దారులు చూసాను. 12 గంటలకు మాగసాని తిప్పకు చేరుకున్నాము. ఆ ఊరు ఒక కాలువ చివరిన ఉన్నది. బోటు నుంచి దిగడానికి చాల ఇబ్బంది పడ్డాము. అక్కడ సరిఅయ్యిన జెట్టి లేదు. ఒక జెట్టి ని కర్రలతో కట్టారు. బోటు పై నుంచి గట్టు మీదకు, గట్టు నుంచి బోటు మీదకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది.

అక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ మట్టి రోడ్డు మీద గుడి దగ్గరకు నడక ప్రయాణం. దారిలో నా క్లాసుమేట్/ సిఘల్స్ లో పనిచేస్తన్న ఒకతను నన్ను ఆపి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. ముందు అతనివెరో గుర్తుపట్టలేకో పోయాను. ఆ తర్వాత గుర్తొచ్చింది. గుడి దగ్గర ఒక కొబ్బరికాయ 25 రూపాయలది తీసుకొని గుడి లోపలికి వెళ్ళాము. లోపల చాల జనం . క్యూ కూడా పెద్ద గా ఉంది. ముందుగా కొబ్బరికాయను నంది విగ్రహం ముందున్న ధ్వజ స్థంభం దగ్గర కొట్టాము. మేము దైవ దర్శనానికి గుడి ద్వారం దగ్గర క్యూ లో కి దూరి శివ భైరవుడుని దర్శనం చేసుకొన్నాను. ఇక్కడ దగ్గరలో సముద్రం ఉందని భార్య అంటే సరే అని భార్యతో కలసి సూపరు 2 కిలోమీటర్లు కొబ్బరి తోటల గుండా ఇసుక తిన్నెల పై నడుచుకొంటూ వెళ్ళితే అక్కడ ఒక చిన్న కాలువ పాయ కనిపించింది. అక్కడ వారిని అడిగేతే కాలువ ను పడవ పై దాటి కొంత దూరం వెళ్ళితే సముద్రం కనిపిస్తుంది అని చెప్పారు. చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యాము. అక్కడ నాకు పీతలు కనిపించాయి. గుడి దగ్గర భక్తులు ఇచ్చిన చందాలతో భోజనాలు పెడుతున్నారు. నేను కూడా 100 రూపాయలు చందా ఇచ్చాను. భోజనం చేయలేక పోయాను.

అక్కడనుండి బోటు దగ్గరకు 2 గంటల ప్రాంతం లో వెళ్ళాము. ఈ సమయం కరెక్టుగా సముద్రపు పాటు సమయం. మాగసానితిప్ప కాలువ లో నీరు మోకాళ్ళ లోతు మాత్రేమే ఉంది. సాయంత్రం 4 .40 గంటలకు గాని నీరు పూర్తిగా రాదట. కానీ ఆ సమయానికే చాల బోట్ల నుంచి జనం వస్తూనే ఉన్నారు. వారంతా రాత్రికి ఉండిపోయి జాగరణ చేస్తారట. ఏదో రోడ్డు మీద బస్సులు ఆగి ట్రాఫిక్ ఎలాగా స్తంభిస్తుందో అలాగా బోటులకు కూడా దారి లేకుండా పోయింది. మా బోటు కొద్దిగా మట్టిలో కూరికిపోయింది. విజయ్ మరియు అతని మిత్రులు బోటు లోంచి నీటిలోకి దిగి మొత్తం మీద శ్రమ పడి నీరు ఎక్కువ ఉన్న ప్రాంతానికి తీసుకొని వచ్చారు. వెంటనే బోటువాడు మోటార్ ఆన్ చేసి పోనిచ్చాడు.

అంత సవ్యంగా వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో పెద్ద గోదావరి లో ఒక కటింగ్ దగ్గర పాటువల్లన ఒక పెద్ద ఇసుక తిప్ప ఏర్పడింది. బోటు మళ్లీ మట్టిలోకి కూరుకుంది. వెంటనే అతను మోటార్ ను నిలిపేసాడు. ఈసారి నేను బోటు లోనుంచి నీటిలోకి దిగాను. నాకు మోకాలు పై భాగం వరకు వచ్చింది. నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా దిగారు. అప్పటికి సమయం 3 .15 అవుతుంది. మొత్తం మీద అందరం కలసి బోటును లోతు ఎక్కువఉన్న్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళాము. బోటువాడు ఇంజిన్ స్టార్ట్ చేసాడు. నేను మొత్తం మీద కాస్త కష్ట పడి నీటిలోంచి బోటులోకి ఒకతని సహాయంతో ఎక్కగలిగాను. బహుశా నా వయస్సు మరియు శరీరపు బరువు అనుకుంటా.

దారిలో అనేక చేపలు ఎగురుతుండటం చూసాను. దూరం నుంచి గిరియంపేటలో ఉన్న ఈఫిల్ టవర్, దరియాలతిప్ప దగ్గర ఉన్న రిలయన్స్ జెట్టిని చూసాను.

బోటువాడు మమ్మల్ని క్షేమంగా దరియాలతిప్ప జెట్టి వద్దకు తీసుకొని వచ్చాడు. సమయం 4 .30 అయ్యింది. బోటు కిరాయి 1500 రూపాయలు తీసుకొన్నారు. తెలిసిన వాళ్ళ వల్ల అనుకుంటా. నా కాంట్రిబ్యూషన్ 500 రూపాయిలు. మొత్తం మీద నా ఈ తొలి మాగసానితిప్ప యాత్ర అద్భుతం గాను, అడ్వెంచర్ గాను సాగింది.

%d bloggers like this: