
సాంప్రదాయ కుటుంబం లో పుట్టి …. గాంధీ బాట లో అడుగు పుట్టి ……… అసంతృప్తి తో తుపాకీ పుట్టి ….. భగత్ సింగ్ తో కలసి భారత్ లో విప్లవ పోరాటానికి ఊపునిచ్చిన అరుదైన వీరుడు చంద్ర శేఖర్ సీతారాం తివారీ. తన పేరుకే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని…. తుపాకీకే తాళికట్టి ……. ఆంగ్లేయులకు చిక్కబోననే ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న అమరుడు చంద్రశేఖర్!
15 ఏళ్ళ కుర్రాడు.. ధైర్యంగా సమాధానం చెబుతుంటే న్యాయమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. 23 వరాల జైలు ……… రోజు 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. ఆ క్షణమే మళ్ళీ జీవితం లో ఆంగ్లేయులకు దొరక బోనని ప్రతిన బూనిన ఆ కుర్రాడు చంద్ర శేఖర్ ఆజాద్ గా పేరొందాడు. అలిరాజపూర్ సంస్థానం (ప్రస్తుత మధ్యప్రదేశ్ లోనిది) లో 1906 జులై 23 న జన్మించిన చంద్రశేఖర్ ఆజాద్ ఆదివాసీ బిల్లులొతో కలసి పెరిగాడు. మంచి విలుకాడు. తల్లి కోరిక మేరకు ఉన్నత చదువు కోసం వారణాసి సంస్కృత పాఠశాల లో చేరాడు. అక్కడ ఉండగానే జలియన్ వాలాబాగ్ ఊచకోత చోటు చేసుకుంది. ఆగ్రహంతో కదిలిపోయిన ఆజాద్ జాతీయోద్యమంలో దూకాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అరెస్టైనపూడే…. న్యాయమూర్తికే ధైర్యంగా సమాధానాలిచ్చి జైలుపాలయ్యాడు. అప్పుడే జైలు కి రానని ….. స్వేచ్ఛగా మరణిస్తాన్నని ప్రతిజ్ఞ చేసాడు. ఇంతలో ….. చోరీచౌరా సంఘటనానంతరం గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయటంతో ఆజాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా భారత్ కు బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలని విప్లవ మార్గం వైపు మళ్లాడు.
రామ్ ప్రసాద్ బిస్మిల్. అష్రాఫుల్లాఖాన్ల ప్రభావంతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరాడు. కకోరి రైలు దోపిడీ తర్వాత బిస్మిల్ తదితరులను ఆంగ్లేయ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉరితీసింది. ఈ కేసులో పట్టుబడకుండా తప్పించుకున్న ఆజాద్ ……… జూన్సీ సమీపంలో పండిట్ హరిశంకర్ బ్రహ్మచారి పేరుతో సన్యాసి అవతరమెత్తి స్థానిక గ్రామస్థులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ సమయంలోనే భగత్ సింగ్, రాజగురు, సుఖఃదేవ్ తదితరులతో కలసి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ గా పునర్వ్యవస్థీకరించాడు. జూన్సీ సమీపంలోని అడవుల్లో సహచరులకు తుపాకీ కాల్చటం లో శిక్షణ ఇచ్చాడు. మూడేళ్లపాటు ఈ బృందం ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. 1926లో ఏకంగా వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలునే పేల్చేయటానికి ప్రయత్నించింది. లాహోర్ లో భగత్ సింగ్ తో కలసి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ను కాల్చి చంపింది. ఆ ఘటనలో కూడా ఆజాద్ తుపాకీకి పని చెప్పాడు.
కుటుంబ నేపద్యాలు భిన్నమైనా ఆజాద్, భగత్ లకు మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ సమాజంలో సమానత్వం, ఆంగ్లేయుల నుంచి విముక్తిని బలంగా కోరుకున్నారు. లాహోర్ దాడికి ముందు ఎవర్ని పెళ్లాడతావ్ అని భగత్ సింగ్ సరదాగా అడిగితే….. భంతుల్ బుఖారా (తన పిస్తోలును అలా పిలుచుకొనేవాడు)తో పెళ్లి ఎప్పుడో అయిపొయింది అని బదులిచ్చాడు ఆజాద్. తన నిర్వహణ సామర్ధ్యంతో అనేకసార్లు సహచరులను ఇబ్బందుల్లోంచి భయటపడేసిన ఆజాద్ …… ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లో బాంబు పెట్టేందుకు భగత్ సింగ్ వెళ్ళతానేంటే వారించాడు. ఇంత చిన్నదానికి వెళ్లి ఇర్రుక్కోవటం సరికాదన్నాడు. కానీ భగత్ సింగ్ పట్టు వీడకపోవటం తో ఏమి చేయలేకపోయాడు. చివరకు ఆజాద్ ఊహించినట్లే జరిగింది. భగత్ ను అరెస్ట్ చేసి …… పాత లాహోర్ కేసు కూడా కలిపి ఉరివేసింది బ్రిటిష్ సర్కారు.
You must log in to post a comment.