చదరంగం ఆట – ఎలా ఆడాలి

చదరంగం లో ఉన్న పావులు ఇవే.వీటిని వరుసగా కుడినుంచి ఎడమకు తెలుగు పేర్లు.. బంటు (pawn),ఏనుగు (ROOK) ,గుర్రం (knight/horse ),సైన్యాధిపతి (bishop),మంత్రి (queen),రాజు (king).ఇవి మక్కి మక్కి అనువాదం కాదు .ప్రాచుర్యం లో ఉన్న తెలుగు పదాలు.

చదరంగం పటం పై అరవై నాలుగు గడులు.తొలి ఎనిమిది గదుల్లో వరసగా ఎదో ఒకవైపు నుంచి ఏనుగు,గుర్రం, సైన్యాధిపతి,మంత్రి/రాజు ఇలా నిలబడి ఉంటారు.రెండో వరుసలో ఎనమిది మంది బంట్లు .వారికి ఎదురుగా ఇంకో రంగు( నల్ల-తెల్ల ) శత్రు సైన్యం ఇలానే నిలబడి ఉండాలి.ప్రాధమికంగా రెండు రాజ్యాల మధ్య యుద్ధం అనుకుంటే ఎవరి రాజు ముందు మరణిస్తాడో అప్పుడు ఆట అయినట్టే.ఆట మొదట్లో రెండు సైన్యాల మధ్య 4 వరుసల ఖాళీ జాగా ఉంటుంది కదా.శత్రు సైన్యం వైపు తొలి అడుగులు వేయాలి .ఒక్కో పావుకు ఒక్కో రకమైన నడక ఉంటుంది.

ఉదాహరణకు బంటు కేవలం ఒక అడుగు మాత్రమె ముందుకు వేయగలడు.కానీ తొలి అడుగు మాత్రం రెండు గడులు కూడా వేసే సౌలభ్యం ఉంది.అది ఇలా ఉహించ వచ్చు.

U7 Jewelry Special Offer Sale

ఇక ఏనుగు కేవలం ఖాళీగా ఉన్న అడ్డంగా లేదా నిలువుగా ఎన్ని గడుల వరకైనా పోవచ్చు.మూలాలు మాత్రం కాదు.

అలాగే సైన్యాధిపతి కేవలం ఖాళీ గా ఉన్న మూల గదుల్లో మాత్రమె కదల గలడు. క్రింద పటం లో లాగ.

ఇక గుర్రం ది ఒక విచిత్ర మైన నడక.అది గుర్రం లాగ అడ్డు ఉన్న ఎదురు పావులను దాటుకుని గెంతుతూ కదల గలదు.దీనికి సులభ సూత్రం రెండు అడుగులు ముందుకు ఒక అడుగు పక్కకు.అంటే ఒక తిరగేసిన “L’ఆకారం.అయితే వెళ్ళ దలచిన గది ఖాళీగా అయినా ఉండాలి లేదా శత్రువు పావు ఉంటే దాన్ని చంపనైనా చంపి వెళ్ళాలి.ఇది అన్ని పావులకు తప్పని సరి సూత్రం. ఈ క్రింద గుర్రం నడక చిత్రం.

మంత్రి నడక ,ఏనుగు,సైన్యాధిపతి రెంటిని కలగలిపి నట్టు ఉంటుంది.అంటే మూలలకి,నిలువు,అడ్డం ఇలా ఎటైన వెళ్ళే సౌలభ్యం అన్న మాట.అందుకే చదరంగం లో మంత్రి కి విలువ చాల ఎక్కువ.నేర్చుకునే తొలి దశల్లో ,మంత్రి చనిపోతే ఆట దాదాపు కష్టాల్లో పడుతుంది.

ఈ చదరంగం ఆటలో రాజు గారు అతి బలహీనుడు .కేవలం ఒక అడుగు మాత్రమె వేయగల ముసలివాడు.ఇలాగా…

ఇక కొన్ని ప్రత్యెక కదలికలు /ఎత్తులు మీకు తెలియాలి.అవేమిటంటే

ఒకటి రాజు గారు,పక్కన ఏనుగు పరస్పరం స్థాన మార్పిడి .దీన్ని కోట కట్టటం అని అనువాదం చేసారు.దీనికి కొన్ని పరిమితులున్నాయి.రెంటి మధ్య ఏ పావు లేకుండా ఉండాలి,అలా ఖాళీ గా ఉన్న ఏదేని శత్రువు పావు ఆ ఖాళీగడి ని ఆక్రమించగల అవకాశం ఉండకూడదు .రాజు తన స్థానాన్ని మార్చి ఉండకూడదు.

ఎన్ పాసె అంటే మాములుగా బంటు తన ఎదురు గా ఉన్న ,రెండు గదుల మొదటి అడుగు వాడుకున్దనుకుందాము. అప్పుడు ,అంతకు మునుపే పక్కన ఉన్న శత్రు సైన్యపు బంటు దాని దారిలో చంపే అవకాశము ఉండి ఉంటే మధ్య గడిలో దాన్ని చంపి అక్కడకి రావడం .ఇలా క్రింద చూపినట్టు.

మూడోది బంటు తన ప్రాణం కాపాడుకుని తన ఎదురు గా ఉన్న శత్రువు గదుల్లో చివరి గదిని చేరితే అక్కడ బంటు ,తన రూపాన్ని మార్చుకుని ఏనుగు,సైన్యాధిపతి,మంత్రి లలో ఎవరిగా నైన మారొచ్చు.

Themomsco [CPV] IN
%d bloggers like this: