NPS (జాతీయ ఫించను వ్యవస్థ)

NPS అంటే ఏమిటి?

ప్రభుత్వ విధివిధానాలతో Pension Fund Regulatory and Development Authority (PFRDA) ఆధ్వర్యంలో వివిధ ఫండ్ సంస్థలచే నడపబడుతున్న పెన్షన్ స్కీమ్. నెలనెలా కొంత మొత్తం ఈ స్కీంలో పెడుతూ రిటైర్ అయ్యాక పెన్షన్ రూపేణా క్రమంగా ఆ డబ్బును తీసుకునే వీలు ఉంటుంది. 18-60 ఏళ్ళ భారతీయులెవరైనా ఖాతా తెరవచ్చు.

దాని వల్ల ఉపయోగం ఏమిటి?

NPSలో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంతే కాక స్వచ్చందంగా 80సీ కింద ఉన్న 1.5లక్ష మినహాయింపు కాకుండా మరో 50,000 ఏటా మినహాయింపు పొందవచ్చు.

NPSలో ఖాతాలు రెండు రకాలు – Tier-I, Tier-II.

NPS కావాలనుకునే ప్రతి ఒక్కరూ Tier-I ఖాతా తెరవాలి. Tier-II ఖాతా పూర్తిగా ఐచ్చికం, Tier-I ఖాతా ఉన్నవారే Tier-II ఖాతా తెరవచ్చు. Tier-I ఖాతాలోని డబ్బు పూర్తిగా ఉపసంహరించుకోవటం కుదరదు. Tier-II ఖాతాలోని డబ్బు పూర్తిగా తీసేసుకోవచ్చు. NPS ఖాతాలోని డబ్బు ముఖ్యంగా క్రింది మార్గాల్లో పెట్టుబడి చెయ్యబడుతుంది:

  • Equity (స్టాక్ మార్కెట్లు)
  • Corporate Debt (సంస్థలకు ఇచ్చే అప్పులు)
  • Government Securities (ప్రభుత్వ బాండ్లు)

NPS ఖాతా తెరిచేప్పుడు ఆ ఖాతాకు రెండు ఎంపికలు ఉంటాయి:

  1. Active – పై నాలుగు మార్గాల్లో ఎందులో ఎంత శాతం పెట్టుబడి చెయ్యాలో మదుపరే ఎంచుకోవచ్చు.
  2. Auto – ఖాతాదారు వయసును బట్టి ఫండ్ నిర్వాహకులే పై నాలుగు మార్గాల్లో తగినట్టు కేటాయింపులు చేసి, కాలానుగుణంగా ఆ కేటాయింపుల్లో మార్పులు చేస్తారు.

మదుపరి Tier-I ఖాతాకు Auto, Tier-II ఖాతాకు Active దారి ఎంచుకోవచ్చు.

ఖాతా తెరిచేప్పుడే ఏ ఫండ్ నిర్వాహక సంస్థ కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులకు 3, మిగతా వారికి 7 రిజిస్టర్డ్ పెన్షన్ ఫండ్ సంస్థలు ఉన్నాయి:

  1. HDFC Pension Management Co. Ltd.
  2. ICICI Prudential Pension Fund Management Co. Ltd.
  3. Kotak Mahindra Pension Fund Ltd.
  4. LIC Pension Fund Ltd.
  5. SBI Pension Funds Pvt. Ltd.
  6. UTI Retirement Solutions Ltd.
  7. Aditya Birla Sunlife Pension Management Ltd

ఖాతాదారుకు 60ఏళ్ళు వచ్చాక Tier-I ఖాతాలో 60% ఏకమొత్తంగా ఇస్తారు. ఈ మొత్తం ఉపసంహరణపై ఎలాంటి పన్ను ఉండదు.

మిగతా 40% సొమ్మును ఒక ఆన్యుటీ స్కీంకు తరలించి నెలనెలా/మూడు నెలలకోసారి/సంవత్సరానికోసారి కొంత మొత్తం తీసుకునే వీలు కల్పిస్తారు. ఆ 40% సొమ్ము ఆన్యుటీ ప్లాన్‌లో పెట్టేందుకు ఎంచుకోగల సంస్థలు:

  1. LIC
  2. SBI Life Insurance
  3. ICICI Prudential Life Insurance
  4. Bajaj Allianz Life Insurance
  5. Star Union Dai-ichi Life Insurance
  6. Reliance Life Insurance
  7. HDFC Standard Life Insurance

ఈ ఆన్యుటీ ప్లాన్ల ద్వారా చేతికొచ్చే సొమ్మును వ్యక్తిగత ఆదాయానికి కలిపి అదాయపు పన్ను కట్టవలసి ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

మొట్టమొదట NPS ఖాతా తెరిచినప్పుడు ఒక Permanent Retirement Account Number (PRAN) కేటాయిస్తారు. ఉద్యోగం మారినా ఈ సంఖ్యతో ఖాతా కొనసాగించవచ్చు. ఒకవేళ ఖాతాలో డబ్బు జమ చెయ్యకపోతే (సంవత్సరానికి కనీసం 6,000 పెట్టాలి) ఆ ఖాతా ఫ్రీజ్ చెయ్యబడుతుంది. తిరిగి కనీస మొత్తం + పెనాల్టీ జమ చేస్తేనే ఖాతా ఆక్టివేట్ చెయ్యబడుతుంది. 60 ఏళ్ళ వయసుకు ముందే రిటైర్ అయితే ఖాతాలో 20% సొమ్ము మాత్రమే ఏకమొత్తంగా వాపసు వస్తుంది. మిగత సొమ్ముతో ఆన్యుటీ ప్లాన్ ఖరీదు చెయ్యాలి. 60 ఏళ్ళకు ముందే ఖాతాదారు మరణించటం జరిగితే మొత్తం సొమ్ము నామినీ లేదా చట్టబద్ధ వారసులకు ఇవ్వబడుతుంది.

%d bloggers like this: