త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ – డైలాగ్స్ 

బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం…బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం

కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

విడిపోవడం తప్పదు అన్నప్పుడు …అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది .

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు

జీవితం ఎలాంటి అంటే.. ఇంట్రస్ట్‌ ఉన్నవాడికి ఆప్షన్‌ ఉండదు.. ఆప్షన్‌ ఉన్నవాడికి ఇంట్రస్ట్‌ ఉండదు.

నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది. చెప్పక పోతే ఎప్పుడు భయం వేస్తుంది.

నిజం చెప్పక పోవడం అబద్దం…అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం

యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు…ఓడించడం

గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే.

మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి…కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు

అద్బుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు…జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు

తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు

కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం… బాధ్యత లేని యవ్వనం…జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా…ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.

మోస పోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

యుద్ధం చేసే స‌త్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు

పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పొడు.

ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు.

దేవుడు దుర్మార్గుడు..కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు.

%d bloggers like this: