Yanam History ( యానాం చరిత్ర )

ఇది ఎప్పటి చరిత్రో. 16 వ శతాబ్దంలో తొలిసారిగా డచ్ పాలకులు తమ రాజ్యాన్ని విస్తరించే యోచనతో భారతదేశంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా కోరమండల్, మలబార్, బెంగాల్ తీర ప్రాంతాలు అందులో ప్రధానమైనవి. కోరమండల్ తీర ప్రాంతానికి పులికాట్ అధికార కేంద్రం. అలాగే తెలుగు నేలపై భీమునిపట్నం, కాకినాడ, పాలకొల్లు, మచిలీపట్నం మొదలైన ఊర్లు ముఖ్యమైనవి. ఈ ఊర్లకు దరీ దగ్గర ఎక్కడ తమకు ఎక్కువగా నీరు, వసతి, రవాణా సౌకర్యం లభిస్తుందో అలాంటి ప్రదేశాలను డచ్ వారు కాలనీల కోసం ఎంపిక చేసుకున్నారు. అక్కడే నిర్మాణాలు చేసుకోసాగారు.

తగ్గిపోయిన డచ్ వారి ప్రాబల్యం

అలా డచ్ వారు తెలుగు నేలపై ఏర్పాటు చేసుకున్న కాలనీలలో ఒక్కటే యానాయోన్. అదే కాలక్రమేణా యానాంగా మారింది. యానాంలో కార్యకలాపాలు చేస్తున్న డచ్ వారికి విజయనగర రాజుల సహకారం ఉండేది. యానాంకి దగ్గరలోని నీలపల్లిలోనే డచ్ దేశస్తులు నాణెలు ముద్రించే టంకశాల ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. రత్నాలు, ఇండిగో, సిల్క్ లాంటి ఉత్పత్తులను వీరు ఇక్కడ నుండి విదేశాలకు తరలించేవారు. అలాగే భారతదేశం నుండి ఎందరో బానిసలను ఇండోనేషియాకి, దక్షిణాఫ్రికాకి రవాణా చేస్తుండేవారు.

1720 సంవత్సరానికి ముందే డచ్ దేశస్తులు యానాంను విడిచివెళ్లిపోయారు. తమిళనాడు కేంద్రంగా అప్పటికే వీరికి విడిదిగా ఉన్న నాగపట్నంలో వీరి కార్యకలాపాలు కొనసాగించారు. అందుకు కారణం తమకు పోటీగా వస్తున్న ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని డచ్ వారు తట్టుకోలేకపోవడమే. పదే పదే ఈ ఇరుదేశాలకూ మధ్య యుద్ధాలు జరిగేవి.

యానాంపై ఫ్రెంచి దొర బుస్సీ కన్ను

డచ్ వారు వెళ్లిపోయాక, యానాం ప్రాంతం మళ్లీ విజయనగర సంస్థానం ఆధీనంలోకి వచ్చింది. అయితే విజయనగరం కూడా 1753 వరకు నిజాం పరిపాలనలోనే ఉంది. కనుక యానాంపై కన్నువేసిన ఫ్రెంచివారు మచిలీపట్నం నవాబు హాజీ హసన్ ఖాన్ నుండి ప్రత్యేకంగా ఫర్మానా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1753 తర్వాత ఫ్రెంచి పాలకులు అప్పటి నైజాం పాలకులపై దాడి చేసి ఓడించారు. కొన్ని ప్రాంతాలను చేజిక్కించుకున్నారు. దీంతో మళ్లీ యానాం కథ మొదటికి వచ్చింది. నైజాం ఓడిపోయాక సాంకేతికంగా యానాం మళ్లీ విజయనగర సంస్థానంలోనే చేరింది.

అందుకే విజయనగర రాజులు తమకు బొబ్బిలి యుద్ధంలో సహాయం చేసినందులకు కానుకగా ఫ్రెంచి దొర బుస్సీకి ఏం కావాలో కోరుకోమనగా.. ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా యానాం కావాలన్నాడు. దీంతో యానాం ఫ్రెంచి వారి హస్తగతమైంది. కానీ ఫ్రెంచి వారికి ఇది కూడా మాణాళ్ల ముచ్చటగానే మిగిలింది. యానాంపై బ్రిటీష్ వాడి కన్ను పడింది. 1758 లో బ్రీటీష్ వాళ్లు, ఫ్రెంచి వారి స్థావరాలపై దండెత్తి అనేక ప్రాంతాలను చేజిక్కించుకున్నారు. అందులో యానాం కూడా ఒకటి. దీంతో బ్రిటీష్ వారు 1758 నుండి 1765 వరకు యానాంను పరిపాలించారు.

ఫ్రెంచ్, బ్రిటీష్ వారి పేచీలు

ఇక్కడ నుండి అసలు కథ మొదలైంది. అప్పట్లో పాండిచ్చేరి, యానాం లాంటి ప్రాంతాలు ఫ్రెంచి గవర్నర్ జీన్ లాడీ లారిస్టన్ చేతితో ఉండేవి. ఈయన బ్రిటీష్ ప్రతినిధి వైట్ హిల్‌తో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. తమ ప్రాంతాలలో కొన్నింటిలో బ్రిటీష్ వారు వ్యాపారం చేసుకొనేటట్లు, అలాగే వారి ప్రాంతాలలోని కొన్నింటిలో ఫ్రెంచి వారు వ్యాపారం చేసుకొనేటట్లు ఈ అగ్రిమెంట్ తెలుపుతోంది.

ఈ అగ్రిమెంట్ వల్ల మళ్లీ యానాం బ్రిటీష్ వారి చేతి నుండి, ఫ్రెంచి వారి చేతికి వచ్చింది. అయితే ఫ్రెంచి వారికి ఇక్కడ పూర్తి అధికారాలు లేవు. వారు బ్రిటీష్ వారికి పన్ను కట్టాల్సిందే. యానాం ఒక్క విషయంలోనే కాదు, ఇతర సంస్థానాల విషయంలో కూడా బ్రిటీష్ వారు ఇదే పంథా కొనసాగించేవారు. దీంతో ఫ్రెంచి వారికి, బ్రిటీష్ పాలకులతో ఎప్పటికప్పుడు పేచీలు వస్తూనే ఉండేవి. తర్వాత బ్రీటీష్ వారు మొత్తానికి మొండిచేయి చూపించి, యానాం నుండి ఫ్రెంచి వారిని తరిమేశారు. 1785 వరకు హాయిగా పాలించారు. 

నెపోలియన్ బోనపార్టీ చేసుకున్న ఒప్పందం

1785 తర్వాత గొప్ప చారిత్రక ఘటన జరిగింది. ఇతర దేశాలలోని ఫ్రెంచి కాలనీ పాలకులకు సంపూర్ణ సహకారం ఇస్తూ, ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ రంగంలోకి దిగాడు. అంతకు ముందే తమకు వ్యతిరేకంగా వున్న ఇంగ్లాండు, ఆస్ట్రియా దేశాలతో సంధి కుదుర్చుకొని యుద్ధాల నుండి ఫ్రాన్స్‌ను కాపాడి శాంతి ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ ఒప్పందాలలోనే యానాం ప్రస్తావన కూడా ఉంది. బ్రీటిష్ ఇండియాలో యానాంతో పాటు పలు ఫ్రెంచి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను పూర్తిగా ఇంగ్లాండ్ పాలకులు ఫ్రాన్స్ వారి హస్తగతం చేయాలని ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒప్పందం కాబట్టి.. ఇక బ్రిటీష్ పాలకులు యానాం జోలికి పోలేదు. దీంతో ఇక యానాం విషయంలో ఫ్రెంచి వారికి తిరుగులేకుండా పోయింది. ఎన్నో ఏళ్లు ఇక్కడ వీరు తిరుగులేని పాగా వేశారు.

చిత్రం : నెపోలియన్ బోనపార్టీ (వికీమీడియా కామన్స్)

తొలి మేయర్ బెజవాడ బాపయ్య నాయుడు

1840 లో ఫ్రాన్సులో లూయిస్ ఫిలిప్పీ అధికారం చేపట్టాక చాలా మార్పులు జరిగాయి. ఇతర దేశాలలోని ఫ్రెంచి కాలనీలకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. 1871 లో యానాం నుండి ఒక ప్రతినిధిని ఫ్రెంచి పార్లమెంటులో తమ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తూ పంపడానికి రంగం సిద్ధమైంది. 1876 లో ఫ్రెంచి ప్రభుత్వం యానాంలో ఎన్నికలు కూడా నిర్వహించింది. యానాంలో ఫ్రెంచి వారి కరెన్సీయే చెలామణీలో ఉండేది. అయితే ఫ్రెంచి వారు తమ ప్రభుత్వమే అయినప్పటికీ, తెలుగు వారికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేవారు. ఎందరో ఫ్రెంచి దొరలు తెలుగు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎందరో తెలుగు జమీందార్లు, ఫ్రెంచి మగువలనూ పెళ్లి చేసుకున్నారు. ఫ్రెంచి ఇండియాలో యానాంకు తొలి మేయరుగా బెజవాడ బాపయ్య నాయుడు ఎన్నికయ్యాడు. అలాగే ఆఖరి మేయర్ సమతం కిష్టయ్య తెలుగు కవి, ఆయుర్వేద వైద్యుడు. ఈ ఇద్దరూ నాయకులూ రాజకీయ హత్యలకు గురయ్యారు. యానాం ఫ్రెంచి వారి పాలనలోనే ఉన్నా.. ఈ ప్రాంతం అంతా కూడా మరో ఫ్రెంచి ప్రాబల్య అధికార కేంద్రమైన పాండిచ్చేరి గవర్నర్ జనరల్ కనుసన్నలలోనే నడిచేది.

భారత స్వాతంత్ర్యం వచ్చాక

1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, యానాం భారతదేశంలో విలీనం కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. 1954 లో భారత సైన్యం యానాంలోకి వచ్చింది. అప్పుడే యానాం సాంకేతికంగా భారత్ హస్తగతమైంది. 28 మే 1956 సంవత్సరంలో ఫ్రెంచ్ మరియు భారతదేశ ప్రభుత్వాల మధ్య Trety of cession జరిగినప్పటికీ అల్జీరియా యుద్ధం వల్ల అధికార మార్పిడి ఆలస్యం అయ్యి పాండిచ్చేరి, మాహే, కారైకల్ మరియు యానాం లు 16 ఆగస్ట్ 1962(De Jure Day) వ సంవత్సరం పూర్తి స్వాతంత్రం పొంది కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబడ్డాయి.ఆ తర్వాత భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రుపాండిచ్చేరి తొలి మేయర్ ఎడ్వర్డ్ గోబర్ట్ భేటీ అయ్యారు. అప్పటికే గోబర్ట్ ఫ్రెంచి ఇండియన్ సోషలిస్టు పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించియున్నారు.

కానీ నెహ్రుని కలిశాక, భారత ప్రభుత్వాన్నే గోబర్ట్ సమర్థించారు. భారతప్రభుత్వానికి, ఫ్రెంచి ప్రభుత్వానికి మధ్య 1962 లో యానాం విషయంలో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇతర ఫ్రెంచి పరిపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, మహే, కరికల్‌లతో యానాంని కలపాలని నిర్ణయించారు. ఇవి పాండిచ్చేరి పరిపాలన కేంద్రం కిందకు వస్తాయి. ఈ ప్రాంతాలకు భారత ప్రభుత్వం ప్రత్యేక పరిపాలన హాోదాను, ప్రత్యేక రాయితీలను అందివ్వాలన్నది అగ్రిమెంట్‌లోని కీలకాంశం. ఈ అగ్రిమెంట్‌లో భాగంగానే భారత ప్రభుత్వం యానాంను తనలో ఇముడ్చుకున్న పాండిచ్చేరికి కేంద్రపాలిక ప్రాంత హోదాను ఇచ్చింది. అలాగే ఈ ఒప్పందంలో హోదాకి సంబంధించి ఒక కాల వ్యవధిని కూడా ఏర్పాటు చేసుకుంది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ కాల వ్యవధి ముగిసింది.

అలాగే ఆనాటి ఒప్పందం ప్రకారం అప్పటి వరకూ యానాంలో ఉన్న ఫ్రెంచి దేశస్తులు లేదా దేశాంతర వివాహలు చేసుకున్న ఫ్రెంచి ఇండియన్స్, వారి పిల్లలు ఇండియాలోనైనా ఉండవచ్చు. లేదా ఫ్రాన్స్‌కైనా వెళ్లిపోవచ్చు. ఇండియాలో ఉండిపోయిన వారికి మాత్రం ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతీ నెల కొంత పెన్షన్ పంపిస్తుంది. అలాగే వారు ఫ్రాన్స్‌కు వెళ్లాలంటే, వీసా షరతులు మనకున్నంత కఠినంగా ఉండవు. అలాగే భారత్, ఫ్రాన్స్ ఒప్పందం ప్రకారం యానాం, పాండిచ్చేరి లాంటివి ప్రత్యేక పరిపాలన హోదా క్రిందకు వస్తాయి కాబట్టి, ఇక్కడ కొన్ని వస్తువుల పై రేట్లు ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువగా ఉంటాయి. 

యానాం ఆంధప్రదేశ్‌లో విలీనమవుతుందా?

యానాం ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా హద్దుగా 30 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్నా, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే యానాం భారత ప్రభుత్వంలో భాగమైనా, కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అలాగే పాండిచ్చేరి అజమాయిషీలో ఉంది. అలాగే యానాంలో భారతీయులతో పాటు ఫ్రెంచి వారు, ఫ్రెంచి వారిని పెళ్లాడిన వారు కూడా అనేకమంది ఉన్నారు. వారికి భారతదేశంతో పాటు ఫ్రెంచి పౌరసత్వం కూడా ఉంది. వారు ఇండియాతో పాటు ఫ్రాన్స్ ఎన్నికలలో కూడా ఓటు వేస్తుంటారు. 

యానాంలో ఎక్కువ శాతం మంది మాట్లాడే భాష తెలుగు. అలాగే ఫ్రెంచి మాట్లాడేవారు కూడా ఉన్నారు. పాండిచ్చేరి నుండి నిత్యం అధికారుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, తమిళం కూడా మాట్లాడతారు. యానాం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావాలంటే, భారతదేశం ఫ్రాన్స్ దేశం నుండి ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తిస్థాయిలో అన్ని సంబంధాలు తెంపుకోవాలి. అలా అగ్రిమెంట్ రాసుకోవాలి. దానికి ఇరుదేశాలూ ఒప్పుకోవాలి. అయితే అది అయ్యే పని కాదు. అలాగే పాండిచ్చేరి ప్రభుత్వం దీనికి ఏమంటుందో కూడా చూడాలి. అన్నింటికంటే ముఖ్యంగా యానాం ప్రజలు ఒప్పుకోవాలి. ఎక్కడైనా ప్రజల అభీష్టం బట్టే కదా ఒప్పందాలు జరగాలి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా మరి.

తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటకవి యానాంలోనే నివసించేవారు. అలాగే మరో ప్రముఖ రచయిత దాట్ల దేవదానంరాజు గారు యానాం చరిత్ర పేరుతో ఒక గ్రంథమే రాశారు.

The French occupied Yanam in 1723. It ranks third in the antiquity of the Five former French Settlements Chandernagor – Year 1673
Pondichery – Year 1674
Yanam – Year 1723
Mahe – Year 1725
Karaikal – Year 1739 The tiny town’s history therefore dates back to 1723 when the Compagnie des indes of France established here a trading post of theirs. It was vacated after four years because their commercial operations did not produce the desired results. It was seized again in 1731 during the time of Dupleix. A PARWANA from Haji Hassan Khan authorised the French Representative Fouquet, then Chief of the Company at Machilipatnam (325 kms. away from Yanam) to set up a ‘loge’ at Yanam in the year 1731. Musafar Jung, the Nizam of Hyderabad in 1750, confirmed the sovereignty of the French over the territory. The place was formally ceded to them only two years later. Like all other settlements, Yanam too fell thrice into the hands of the British. After the Napoleanic War, Yanam along with the factory at Machilipatnam was finally returned to the French early in 1817.

A HISTORICAL PERSPECTIVE OF YANAM

It is mentioned in the book, the botanic garden of Yanam by Colonel A. Bigot that at first, the French establishment a warehouse here in 1723 A.D. Since the business became slack, it was given up in 1727 A.D. and was re-occupied in 1742 A.D. A `Fireman’ was issued by the Mughal emperor, confirming all the concessions made to the French by Salabathjung, the Subadar of Deccan. These concessions were in the shape of the donations and the name `Inam’ was changed into Yanam(Yanaon) by the French in the course of time. People say that this region was presented to Mr. Bussy, the French General by a Vijayanagara King as a token of gratitude for the help rendered by Mr. Bussy in the fight against the rulers of Bobbili. We can se his street named after `Bussy’ here. It s believed that Bussy had stayed in a certain building in this street. In the west of Yanam, we can find `Neelikundilu'(Indiog wells) people say that the Dutch constructed a front here in which they used to keep their currency, minted in the mint at Neelapalli, a near by village. Yanam is situated on the East Coast, in the district of East Godavary, Andhra Pradesh. It was occupied by the French in 1723. It ranks the third in the antiquity of the Five former French settlements i.e. Chandernagar 1673, 2. Pondicherry 1674, 3. Yanam 1723, 4. Mahe 1725 and Karaikal 1739. Yanam was under the French rule for more than two centuries. It was liberated in 1954. It is now one of the component parts of the Pondicherry State. It is a small area of 8 square miles in exent, situated on the left bank of the eastern branch of the Godavary River in Andhra Pradesh. Its location is 16o43o northern longitude and 80o5 eastern longitude. It is built on a place where the river Coringa and the Godavary meet and is bounded on the East and the South by these rivers. The Godavary discharges itself into the sea 9 miles south of Yanam town. Thr coringa river divides the town into two parts. There are 8 villages under the Municipal jurisdiction of Yanam namely Kanakalapeta, Jambavanpeta, Agraharam, Mettakur, Kursampeta, farampeta Darialtippa and Guerempeta. The cobbler community lives in Jambavanpeta. The fishermen Community lives mainly in Agraharam, Mettakur, Kuraampeta and Guerempeta. Wate for irrigation comes from Andhra Pradesh through an age-old small canal called “French Kalva”. The soil is fertile for cultivation but the irrigation facilities are scanty . The main crop is paddy beside the seasonal crops of pulses, chillies and ground nuts. This tiny town’s history goes back to 1723 when the Compagnie des Indes of France established here a trading post of theirs. It was vacated after four years because their commercial operations had not produced the desired results. It was seized again in 1731 during the time of Duplex. Nabab Roustoumkhan granted a Paravana dated 1735 for French Commerce in Yanam. It was re-established completely in 1742 and administered by DE Choisis who died here on 27th October 1747. He was succeeded by Sinfray. The annual rent was waived off by a document in 1743 for Yanam. Mir Mohamed Alikhan granted all the rights on the lands situated before the quarters at Yanam in 1747. Unfortunately necessary details are not available for this period i.e. from 1723 to 1750. The sovereignty of this territory was confirmed in 1750 to the French by Musaffar Yung, Nizam of Hyderabad. In 1753, a Paravana of Salbat Singh, Subedar of Deccan conceded to Bussy the paragaanas of Chicacole, Ellore, Rajahmundry etc. with an annual revenue RS.2,00,000 for the maintenance of the French troops in the suba in recognition of the help of these circars amounted upto 10 lakhs of Ruppes per year. Bussy helped Salbat Singh to be the Subedar of Deccan. The agreement made between the French and Salbat Singh in Aurangabad bears the signature of Said Loukshur, Minister of Salabat Singh, Yanam acquired considerable importance during the occupation of the Northern Circors by the French. There is again a dearth of information regarding this place from 1753 to 1765. It was under the control of the English during this period. A document dated 15th May, 1765 showed that the villages of Yanam and Kapuapalem with other lands were handed over by Jean white hill and George Dolben, the English men deputed by Jean Pybus, the head of the English settlement in Musulipatnam to Yoan Yacques Panon, French Commissioner deputed by Jean Law de Lauriston for taking them over. This document mentions that France entered into possession of Yanam and its dependent territories with exemption from all export and import duties. Soon after taking possession of this settlement, Panon obtained a paravana from the ruler of Rajahmundry granting the French full liberty of trade at Yanam and another one from the Nabab Nizam Ali calling upon the Samindars of the Circar Mustafanagar not to hinder the commerce of the French.   Yanam was situated in the province of Peddapur in the jurisdiction of Timma Raja. The French had a modest building here situated a league from the sea, on the river Coringa into which small vessels could enter. The documents of 1765 throw light on a dispute of a weekly market or fair in Yanam. A weekly market used to be held here on every Tuesday. People used to come to it for purchasing all their essential commodities once for a week.   Neelapalli, a neighboring village of Yanam was under the British at that time. It is nearly 3 KM. Away from Yanam. The people in this village also used to hold a fair on Tuesday. Thus there was a clash of interests between Yanam and Neelapalli.   After prolonged correspondence with the English authorities at Madras, the French authorities in Yanam succeeded in changing the fair of Neelapalli to another day of the week, Saturday. In this way, Yanam triumphed over its neighboring village Neelapalli.   This is again lack of information because of its subsequent English Occupation. Yanam was restored again to the French in 1785. Mallhendre took possession of it and he was succeeded by Bluter. It was recommended to them to favor the business of the French Company and to protect the interest of some specified merchants. After Bluter, Sonnerat became the chief in 1790 in Yanam. He was a scholar. He had a profound interest in Natural Sciences. He wrote a book “VOYAGE AUX INDES ORIENTALES ET En CHINE.” In 3 volumes. He appreciated very much the sonority and the music of the Telugu language. He administered Yanam during the time of the French Revolution. The French revolution had its effects in different ways in all the former french settlements. Let us study now there action of Yanam during this period . The french trade at Yanam was considerable at that time. Lew stated in his “Memoire of 1767”. It is from Yanam that we get out best “guiness” (fine cloth). It is possible to have a commerce here worth more than a million lives per year under circumstances more favourable than thoses in which we are placed now, but always by giving advances much earlir, which we have never been in a position to do. From this place we also procured teak-wood, oils rice and other grains both for men as well as for animals”. A port from commerce, Yanam enjoyed another kind of importance “the advantages which may be derived in a time of war from the alliances that we the French may conclude with several Rajas who sooner or later cannot fail to be dissatisfied with the English”. Although the English gained an effective control over the circars, Yanam enabled the French to enter into secret relations with the local chieftains. Yanam had some commercial importance. It was a center for the manufacture of salt and this salt constituted thje major part of the quantity imported by the French into Bengal,region. It was also an important centre of cotton goods and supplied a large part of the return cargo of the french ships visiting India. A few French citizens in Yanam were fully occupied by these two kinds of profitable business and they had no interest in political and administrative matters which were left entirely to the chief or commandant. Indian residents wanted nothing better than to be left in peace to carry on their trading activities. Mr.Sommerat,Chief of Yanam, was involved in this business along with other traders. His commercial involvement brought serious consequences to his administrative post. The petitions were made against him in this connection, to the De Fresns the them French Governor in Pondicherry. On 5.6.1790 a French man Mr. Demars complined against him for the Ist time. He had 40 vessels loaded with salt for Bengal representing the fortune of 10 individuals, he alleged that Mr.Sommerat had been troubling him in caring out his business and requested the Governor and the Ist Committee to rsecall him. By that time, Pondicherry under the influence of the French Revolution, had already formed the Ist representative committee. But no action was taken in favor of Demars either by the Governor or by this Ist committee. Naturally, the French citizens in Yanam were disinterested in the affairs of Pondicherry owing to his failure.  

%d bloggers like this:
Available for Amazon Prime