ఇయర్ ఫోన్స్, హెడ్‌ ఫోన్స్ – చెవులు దెబ్బతింటాయా? ఇవి ఎంతమేరకు వాడవచ్చు?

శబ్ద తరంగాలు మన చెవిని చేరినప్పుడు అవి మన కర్ణభేరిని (eardrum/tympanic membrane) ని కదుపుతాయి. ఆ ప్రకంపనలు లోపలికి ప్రయాణించి cochlea లో ఉన్న hair cells కదిలేలా చేస్తాయి. ఆ కణాల కదలిక వల్ల ఆ శబ్దం విద్యుత్ స్పందనగా మారి మెదడుకి చేరుతుంది.

బాగా గట్టిగా ఉన్న శబ్దాలు విన్నప్పుడు ఆ hair cells వాటి సామర్ధ్యాన్ని కోల్పోయి తాత్కాలిక వినికిడి లోపం కలుగుతుంది. అదే కనుక దీర్ఘకాలికంగా కొనసాగితే శాశ్వతంగా వినికిడిలోపం కలుగుతుంది.

ఈ రోజుల్లో earphones వాడని వారు చాలా అరుదు. కాలక్షేపం కోసం అయినా, ఉద్యోగ నిమిత్తం అయినా earphones, headphones వాడకం మనకి సర్వసాధారణం అయిపోయింది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వినికిడి శక్తి కాపాడుకోవచ్చు.

మీకు వీలు ఉంటే earphones/headphones వాడే సమయాన్ని బాగా తగ్గించండి. స్పీకర్ల సాయంతోనే వినండి. అన్ని సార్లు స్పీకర్లో వినడం కుదరకపోవచ్చు. కొంతమందికి నచ్చదు కూడా. అలాంటప్పుడు చెవిలో పెట్టుకునే earphones లాంటివి కాకుండా వీలైతే తల మీదుగా పెట్టుకునే headphones వాడండి. వాటివల్ల శబ్దం నేరుగా కర్ణభేరిని తాకదు. ఒకవేళ మీకు నాలాగా డొప్ప చెవులు (protruding ears) అయితే తల మీదుగా ధరించే headphones వాడడం కష్టం అవ్వచ్చు. అవి చెవుల మీద ఒత్తిడిని కలుగజేసి తలనొప్పి వచ్చేలా చేస్తాయి.

headphones అయినా earphones అయినా కూడా మీరు వాల్యూమ్‌కి ఒక పరిమితి పెట్టుకోండి. నేనైతే maximum volume లో 40% వద్ద మాత్రమే వింటా. ఇది మీరు వాడే device ని బట్టి మారవచ్చు కాబట్టి మీరే విని నిర్ణయించుకోవాలి.

earphones లో ఇప్పుడు చాలా వరకు in-ear వస్తున్నాయి. మీరు earphones మరీ ఒత్తిడి కలిగించేలా పెట్టుకుంటే చెవి నొప్పి మొదలవుతుంది. కాబట్టి earphone fit చూసుకోవడం చాలా ముఖ్యం. మీ earphones తో పాటుగా ఇచ్చిన eartips రకరకాల సైజులు ఉండి ఉంటాయి. వాటిలో మరీ tightగా, మరీ loose గా కాకుండా ఉన్నవి ఎంచుకోండి. అవి సరిపోనప్పుడు మీరు విడిగా కొనుగోలు చెయ్యచ్చు. కొద్దిగా ధర ఎక్కువ అయినా సౌకర్యంగా వినడానికి comply లాంటి కొన్ని కంపెనీలు eartips తయారు చేస్తున్నాయి. eartips కి అంత పెట్టాలా అని మీరు అనుకోవచ్చు. కానీ అవి మీ చెవులకి మంచివి. కాబట్టి పెట్టినా తప్పు లేదు.

మాములుగా చెవిలో తయారయ్యే ear wax దానంతట అదే బయటకి వచ్చేస్తుంది. మనం buds పెట్టి బయటకి తీయాల్సిన అవసరం లేదు. earphones మరీ టైట్‌గా పెట్టుకుంటే wax ఇంకా లోపలికి నెట్టబడే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా వినికిడి శక్తి తగ్గవచ్చు.

సాధారణంగా కొద్దిగా చవకరకం earphones లో bass ఎక్కువ ఉంటుంది. నాసిరకం earphones లో అన్ని వాయిద్యాలు సరిగా వినిపించవు. కాబట్టి ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవలసి వస్తుంది. మీరు bass ఎక్కువ వినడానికి ఇష్టపడిన వారు అయినా కూడా కొంచం ఖరీదు పెట్టి మంచి earphones వాడితే అన్ని వాయిద్యాలు స్పష్టంగా వినిపిస్తాయి. ఎక్కువ వాల్యూమ్ అవసరం లేదు.

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా శబ్దకాలుష్యం ఎక్కువ ఉన్న స్థలంలో మీరు earphones వాడుతున్నట్టు అయితే మీరు వినేది స్పష్టంగా వినిపించాలి అంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాలి. అది కూడా వినికిడి శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని మీరు అలాంటి background noise ఎక్కువగా ఉన్న చోట్ల వీలైతే earphones వాడడం మానండి. లేదా active noise cancellation ఉన్న earphones వాడండి. వాటివల్ల వెనుక ఉన్న శబ్దాలు ఏమీ వినిపించవు కాబట్టి ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ మీరు రోడ్డు మీద నడిచేడప్పుడు లేక వాహనం నడిపేడప్పుడు మీకు చుట్టూ ఉన్న శబ్దాలు మీకు వినిపించాలి. అలాంటి చోట్ల పూర్తిగా వెనుక శబ్దాలని block చేసే noise cancelling earphones వాడడం ప్రమాదకరం.

మీరు జాగర్తగా గమనిస్తే earphones వాడుతున్నప్పుడు మీకు కలిగే అసౌకర్యం మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మీరు మీ వాడకంలో మార్పులు చేసుకోవచ్చు. వినికిడి ఏమైనా తేడా వచ్చినట్టుగా మీకు అనిపిస్తే ఆలస్యం చెయ్యకుండా వైద్యులని సంప్రదించండి.

వీటితో పాటు మీరు పాటలు వినే source కూడా మంచిది అయ్యి ఉండాలి. మీరు gaana లాంటి apps లో వినేవారు అయితే వీలైనంత ఎక్కువ Quality setting పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకుని వినేవారైతే mp3 కి కనీసం 320 kbps bitrate, లేదా itunes m4a ఫార్మాట్ ఫైళ్ళని ఉపయోగించండి. దీని వల్ల శబ్దం స్పష్టత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ వాల్యూమ్ అవసరం ఉండదు. మీరు వీడియో స్ట్రీమ్ చేసేడప్పుడు కూడా best quality settings పెట్టుకోవచ్చు.

%d bloggers like this: