డేటా సెంటర్స్ (data centres)

ఎందుకు డేటా సెంటర్స్ ఉన్నాయి అంటే, దీనికి ఒక కథ ఉంది, 9/11 అటాక్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కుప్ప కూలిపోవడంతో, అందులో ఉన్న ఆర్ధిక సంబంధమైన సర్వర్ లు అగ్నికి ఆహూతయి పోయాయి. ఎన్నో కోట్ల నష్టం చూసారు. ఆర్ధిక మాంద్యం చూసారు ఎందుకంటే ఈ సర్వర్ లకు redundancy లేదా బాకప్ (backup ) లేవు. ప్రతి కంపెనీ కి సంబందించిన వివరాలు గల సర్వర్ లు ఇందులో ఉండేవి. ఎప్పుడయితే ఇటు వంటి దాడులు జరిగాయో అప్పుడే కొత్త ఆలోచన డేటా సెంటర్ లు ఉంచుకోవాలి అంటే ఇంకో కాపీ అనమాట.

ఈ గూగుల్, ఫేస్బుక్ డేటాసెంటర్ లు ఊరికి దూరంగా కొన్ని వేల ఎకరాల స్థలంలో కడతారు. ఇందులో కొన్ని లక్షల సర్వర్ లు నిరంతరాయంగా 24*7*365 పని చేస్తాయి. వీటికి విద్యుత్తు సరఫరా సోలార్ లేదా విండ్ ఎనర్జీ తో ఉంటుంది. ఇవి పని చేయని సందర్భంలో జనరేటర్ లు ఉంటాయి,

సర్వర్ ల నుంచి విలువడే వేడిని పెద్ద పెద్ద ఫ్యాన్ ల ద్వారా బయిటికి వెళ్లగొట్టడం, ఎయిర్ కండిషనర్ లు ఉండడం. వీటికి ఉన్న సెక్యూరిటీ ప్రపంచంలో ఇంకెక్కడ కనబడదు చాలా చాలా కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటుంది. సర్వర్ లు రాక్ లో ఉంటాయి, ఇలా కొన్ని లక్షల రాక్ లు ఉంటాయి. ఈ సర్వర్ల స్టోరేజ్ కెపాసిటీ పెటాబైట్స్ లలో ఉంటాయి.

ఒక వేళ ఏదయినా సర్వర్ పని చేయక పోయిన ఇంకో సర్వర్ లో అదే కాపీ ఉంటుంది. ఈ సర్వర్ లలో ఎప్పటికప్పుడు up to second కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జాప్యం అనేది 0.0001 మిల్లి సెకండ్స్ ఉంటుంది. ఒక సెకను జాప్యం ఉన్న, కొన్ని కోట్లు నష్ట పోతారు. పని చేయని సర్వర్ను తీసివేసి కొత్త సర్వర్ పెట్టి పునరుద్దరించడం వంటివి 24*7*365 అక్కడ టెక్నీషియన్స్ చేసే పని.

అసలు వీళ్ల లక్ష్యం 24*7*365 అందుబాటులో ఉండాలి అని. వారి వ్యాపారానికి నష్టం కలగకూడదు అని. వీరి డేటాసెంటర్ లు ప్రపంచం నలు మూలల ఉన్నాయి. ప్రమాదశావత్తు షార్ట్ సర్క్యూట్ అయిన పర్వాలేదు, ఇంకో డేటా సెంటర్ నుంచి మనం ఉపయోగించుకోవచ్చు, అలాగే డేటా సెంటర్ సర్వర్ మైంటెనెన్సు చేయాలన్న కూడా భయపడాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ వారు సముద్రం లోపల పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అంటున్నారు మరి భవిష్యతులో ఇక నేల పైన డేటా సెంటర్ లు చూడము కావచ్చు.

ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను :

Seagate హార్డ్ డిస్క్ కంపెనీ జపాన్ వారిది. జపాన్లో ఎప్పటికప్పుడు భూకంపాలు, సునామీలు జరుగుతానే ఉంటాయి, మరి ఎలా వారి వ్యాపారాన్ని తిరిగి పొందుకోగలుగు తున్నారు, వీరికి ఎక్కడయితే ఇటువంటి విపత్తులు జరగకుండా ఉంటాయో అక్కడ ఇంకో డేటా సెంటర్ ఉంటుంది. అక్కడ ఇంకో కాపీ ఉంటుంది కాబట్టి, మళ్ళీ వాళ్లు డేటాను తీసుకొని తిరిగి మామూలుగా వారి లావాదేవీలు జరిపిస్తూ ఉంటారు. ప్రతి డేటా ఉంటుంది కాబట్టి నష్టం చూడరు.

కింద నున్నవి గూగుల్ డేటా సెంటర్లవి.

పిక్ క్రెడిట్స్ : గూగుల్

%d bloggers like this: