గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్

పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం పట్టణంలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కొంత కాలం యానాం లో సాగింది. అనంతరం , కాకినాడ లో డిగ్రీ వరకు పూర్తి చేసి, హైదరాబాద్ లోని కార్ల్టన్ బిజినెస్ స్కూల్ లో బిజినెస్ మనేజ్మెంట్ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్(పి.జి.డి.బి.యం) ను పూర్తి చేశారు. అశోక్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త గా పలు వ్యాపారాలు నిర్వహించారు.

అశోక్ కుటుంబం తొలి నుంచి యానాం ప్రాంత రాజకీయాల్లో కీలకంగా ఉండేది , అశోక్ తండ్రి గాంగధర్ ప్రతాప్ గారు బీజేపీ పార్టీలో పనిచేస్తూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు యానాం ప్రజానీకంలో తెచుకున్నారు, బీజేపీ పార్టీకి కూడా యానాం జిల్లాలో బలోపేతానికి బలమైన పూనాదులు వేశారు 2000, 2001లో యానాం అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. యానాం పేద ప్రజానీకం తరుపున వారికి న్యాయం చేయడానికి చివరి శ్వాస వరకు పోరాడారు, భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తండ్రి మరణంతో కుటుంబం మొత్తం యానాం నుండి కాకినాడ పట్టణానికి వచ్చింది, అక్కడే శ్రీనివాస్ సుదీర్ఘ కాలం ఉన్నారు. వ్యాపార రంగంలో కి ప్రవేశించిన తరువాత మళ్ళీ యానాం లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తన తండ్రి పేరున పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తొలి నుంచి వీరి కుటుంబం బీజేపీ పార్టీ మద్దతుదారులు కావడంతో జిల్లా కు చెందిన బీజేపీ కార్యకర్తలు, వారి కుటుంబ అభిమానుల ఒత్తిడి తో పాటుగా రాజకీయాలు అంటే ఆసక్తి ఉండటం చేత అశోక్ క్రియాశీలక రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అరంగేట్రం చేసిన తరువాత” నమస్తే యానాం ” పేరుతో యానాం అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలను గురించి జిల్లావ్యాప్తంగా ఉన్న యువకులతో చర్చ కార్యక్రమాలు నిర్వహించారు.

2021లో జరగబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం అసెంబ్లీ నుంచి పోటీచేసేటందుకు బీజేపీ పార్టీ టిక్కెట్ ఆశించిన మిత్ర పక్షం ఏ.ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు లో భాగంగా అశోక్ గారికి సీటు కేటాయింపు జరగలేదు(మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణా రావు గారి ఒత్తిడి మేరకే టిక్కెట్ ఇవ్వలేదు అంటారు) , సొంత పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా నిరుత్సాహ పడకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం చేయడం ప్రారంభించారు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, కుటుంబ అభిమానులు ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తూ ఆయన విజయానికి బాటలు పరిచారు(కుల సమీకరణాలు కూడా ఎన్నికల సమయంలో బాగా పనిచేశాయని వినికిడి ).

స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన అశోక్ తన ప్రత్యర్థి రెండో స్థానంగా యానాం నుంచి బరిలోకి దిగిన ప్రస్తుత పుదుచ్చేరి నూతన ముఖ్యమంత్రి రంగ స్వామి గారిని ఓడించి పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ప్రత్యేక్ష ఓటమి రంగస్వామి గారిదే కానీ అసలు ఓటమి మాత్రం ఆయన్ని బలపరిచిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణా రావు గారిది.

%d bloggers like this: