గాస్ స్టవ్ బర్నర్ , నాబ్ లు పట్టేసినట్లు అయితే మిషన్ ఆయిల్ కొన్నిచుక్కలు వెయ్యండి. గాస్ స్టవ్ మీద స్టాండ్ లు నూనె పట్టి పొక్కులు గా పెచ్చులు గా మారతాయి . అవి పోవాలంటే కొబ్బరి చిప్పలు , పీచు పోగుపెట్టి, మంట వెయ్యండి. ఆ మంటలో స్టాండ్ లు వెయ్యండి. ఇంట్లో కాకుండా ఆరుబయట మంట వెయ్యండి. వేడి చల్లారాక , తియ్యండి. తళ తళా మెరుస్తాయి. కొత్త వాటిలా.
ఏమైన, కూరలు,బిర్యాని వండి నప్పుడు, గిన్నెలు అడుగు మాడ కుండా కింద ఇలా పెనం పెట్టండి. దమ్ బిర్యాని కి గోధుమ పిండి తో ముయ్య కుండా ,ఇలా కూడా పైన బరువు పెట్టవచ్చు.
పాలు గిన్నెలో పోసే ముందు , కడిగి కొంచెం నీళ్ళు వుంచండి.ఒక స్పూను డు. అడుగు అంటు కోకుండా వుంటాయి.
పప్పు వుడికించేటప్పుడు ,ఒక గంట ముందు నానబెట్టి వుంచండి. కంద వుడికించే టప్పుడు ఒక స్పూను బియ్యం వెయ్యండి. మెత్తగా వుడుకుతుంది.
కూర లో ఉప్పు ఎక్కువయితే , బంగాళా దుంప ముక్కలు వేసి ,కొంచెం వుడక బెట్టండి. బంగాళా దుంప ఉప్పు ను పీల్చు కుంటుంది. అవి కూరలో వుండటం ఇష్టం లేక పోతే తీసెయ్య వచ్చు.
క్యారట్, బీట్ రూట్ కూరలు రుచి గా తినాలంటే, పచ్చి ఉల్లి ముక్కలు కలపండి తినేముందు. ఉల్లి పాయ కాక పోతే, పాంచ్ మసాలా కూడా వేసు కోవచ్చు.
బంగాళా దుంప చిప్స్ చేస్తే, పైన అవిశ గింజల పొడి వేస్తే ,పీచు పదార్థం కూడా లభిస్తుంది. బంగాళా దుంపలు తొక్క తీయకుండా చిప్స్ చేసు కోవచ్చు. కర కరలాడాలంటే కొంచెం బియ్యప్పిండి వేసి ,వేపించండి.
దోశ లు పెనానికి అంటకుండా చక్కగా రావాలంటే , ఉల్లి పాయ సగానికి కోసి , పెనానికి పామండి. దోశ లు అన్ని వేసుకున్నాకా, ఆ ఉల్లి పాయ తింటే చాలా బాగుంటుంది.
పప్పులు తొక్క తో సహా వాడడానికి ప్రయత్నించండి. కందులు,పెసలు రాత్రి నాన బెట్టి, కూరల్లో వాడండి. పీచు పదార్థాలు పోకుండా వుంటాయి.
క్యాబేజి వండి నప్పుడు, కొంచెం నిమ్మరసం వెయ్యండి. వెగటు వాసన పోతుంది.
డైనింగ్ టేబుల్ మీద వుప్పు లో జీలకర్ర పొడి,మిరియాల పొడి కలిపి పెట్టుకొండి.రుచికి రుచి మరియూ ఆరోగ్యం లభిస్తాయి.
యాలకులు గుప్పెడు మిక్సి లో వేసి సిద్ధం గ ఉంచుకోండి. తొందరలో వున్నప్పుడు హైరానా పడకుండా , వాడుకోవచ్చు.
మటన్ మెత్త గా వుడకాలి అంటే కొన్ని బొప్పాయి ముక్కలు వెయ్యండి.
చేపలు కొంచెం నూనె లో వేపాలి అంటే అరిటాకు పెనం మీద వేసి, వేపితే చక్కగా వేగుతాయి. చికెన్ అయినా సరే. మరి కొంచెం రుచిని పొందుతారు.
పచ్చి రొయ్యలు, చికెన్ ఒక గంట పెరుగు లో నాన బెట్టాలి. మృదువుగా వుండాలి అంటే.
చేపల వేపుడు ఆలివ్ ఆయిల్ లో వేపితే, బాగుంటుంది.
You must log in to post a comment.