గూగుల్ లో ఫోటో నిజమైనది కాదా అనేది తెలుసుకోవాలంటే?

How to Google reverse image search on Android devices - Sakshi

మనం ఇంటర్నెట్లో అనేక రకాలైన ఫోటోలను చూస్తుంటాం. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్ సాయంతో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలిబ్రిటీల విషయంలో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనది కదా అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

గూగుల్ ఇమేజెస్
ఆన్ లైన్ లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్. గూగుల్ లో మనకు కనిపించే ఫోటోలు నిజమా? కదా అనేది గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే? గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫొటో యూఆర్ఎల్ లేదా ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు చెప్పేస్తుంది.

గూగుల్ సెర్చ్
మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి మీరు రివర్స్ సెర్చ్ చేయాలనుకుంటున్న ఆసక్తికరమైన ఫోటోను ఎంపిక చేసి దానిమీద రైట్ క్లిక్ ఇవ్వండి అప్పుడు మీకు సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది.

%d bloggers like this:
Available for Amazon Prime