మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు?

దీనిని ఏ.హెచ్.ఓ అంటారు (ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్). పలు దేశాలలో ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. మన దేశంలో 2016 / 2017 లోనో ఇది అమలులోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తికి మన వాహనం క్లియర్ గా కనిపిస్తుంది. మబ్బులు పట్టి ఉన్నా, మంచు కురుస్తున్నా, వాన పడుతున్నా మన వాహనం క్లియర్ గా కనబడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి అని. వాహన పనితీరుకి ఏమీ డోకా వుండదు. బ్యాటరీల మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాని ఇప్పుడు వచ్చే బ్యాటరీలు ఈ అదనపు లోడ్ ని మానేజ్ చెయ్యగలవు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు.

%d bloggers like this: