T1 Holdings అంటే ఏమిటి ?

డీమ్యాట్ ఖాతాలో షేర్లు కొంటే ఆ షేర్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి మన ఖాతాకు చేరటానికి రెండు పనిదినాలు పడుతుంది. దీన్ని T+2 సెటిల్‌మెంట్ అంటారు. ఉదాహరణకు మీ ఖాతాలో సోమవారం HDFC షేర్లు కొన్నారు. ఇక్కడ T=సోమవారం. ఆపై ఆ షేర్లు T+2= బుధవారం సాయంత్రానికి మీ ఖాతాకు చేరతాయి. సోమవారం మీరు కొన్నప్పటి నుండి బుధవారం మీ ఖాతాకు చేరేంతవరకు T1 అని చూపబడతాయి. అంటే మీ కొనుగోలు జరిగింది, షేర్లు ఖాతాలోకి చేరే ప్రక్రియలో ఉన్నాయనుకోవచ్చు.

%d bloggers like this: