విమానం రన్ వే పై ఎందుకు పరిగెడుతుంది?

రన్ వే పై పరుగెత్తడం వలననే విమానం గాల్లోకి ఎగురుతుంది. వేగం ఒక అవసరమే కానీ, కేవలం వేగంగా వెళ్ళడం వలన మాత్రమే విమానం ఎగరదు (రన్ వే పై విమానం వెళ్లే వేగాన్ని అందుకోగల కార్లు ఎన్నో ఉన్నాయి). పిల్లలు గాలిపటాన్ని ఎగరేయడానికి దారం పట్టుకొని పరుగెత్తడం వంటిదే ఇది. అలా వేగంగా వెళ్ళడం వలన రెక్కల పై భాగంలో గాలి యొక్క పీడనం తగ్గిపోయి క్రిందివైపున ఉన్న అధికపీడనం రెక్కలను పైకి నెట్టడం వలన విమానం గాల్లోకి లేస్తుంది. తరువాత జెట్ ఇంజన్లు దానిని గాలిలో ముందుకు నడిపిస్తాయి.

%d bloggers like this: