బెల్లం

బెల్లం

చెరుకురసాన్ని ఆవిరిగా చేసి చల్లార్చి దానిని బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇది ఫిల్టర్ అయితే చక్కెర తయారవుతుంది. ఇలాగే, తాటి, ఖర్జూర రసాల నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ఇదే పదార్ధం కొలంబియా, కరీబియన్ దీవుల్లో పానెలా, జపాన్ లో కొకుటో , బ్రెజిల్ లో రపడురా అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. ఇలా గడ్డకట్టించిన చెరుకు రసాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర ఖనిజాలు శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థం కాకుండా అందులోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల దీనిని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ కూడా గుర్తించింది. అయితే, దీని నుంచి తయారు చేసే పంచదారను శుద్ధి చేసే ప్రక్రియలో అందులో ఉండే మైక్రో న్యూట్రియెంట్స్ కోల్పోతాయి.

కానీ, బెల్లంలో మాత్రం ఆవిరి పట్టిన తర్వాత కూడా ఖనిజాలు, మొలాసెస్ అందులోనే ఉంటాయి. ఇందులో ఉండే మొలాసెస్ వల్ల బెల్లానికి గోధుమ లేదా ఇసక రాతి రంగు వస్తుంది. దీనితో పాటు ఇందులో కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. చాలా మంది ఇళ్లల్లో తీపి పదార్ధమేదైనా తినాలని అనుకుంటే బెల్లం దగ్గు మందులానో, లేదా చాక్లెట్ లాగో తింటూ ఉంటారు. కొంత మంది టీతో పాటు బెల్లాన్ని కూడా పక్కన పెడతారు. ఇక్కడ పిల్లలకు చాక్లెట్లకు బదులు బెల్లం ముక్కలు ఇస్తూ ఉంటారు. దీనికుండే గాఢమైన రుచి వల్ల దీనిని అనేక సంప్రదాయ వంటకాల్లో వాడతారు. హల్వా లాంటి అనేక రకాల స్వీట్లు మాత్రమే కాకుండా బెల్లం వేసి నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, వేరుశనగ చెక్కలు కూడా తయారు చేస్తారు.

పర్షియాలో కూడా బెల్లాన్ని సంప్రదాయ వైద్య విధానాల్లో వాడతారు. బెల్లం శరీరంలో రక్తం ఉత్పత్తికి సహకరిస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదంలో చెప్పే శరీర దోషాల్లో ఒకటైన వాత దోషాన్ని సమతుల్యం చేసే లక్షణం వల్ల ఇది చాలా రకాల రుగ్మతలకు పని చేస్తుందని చెబుతారు. దీనిని ఇతర పదార్ధాలతో కలిపి కూడా వాడతారు. దీనిని ఆయుర్వేదంలో పంచకర్మ విధానంలో కూడా వాడతారు. ఈ విధానంలో శరీరంలో వివిధ భాగాలకు అయిదు విధానాల ద్వారా చికిత్స చేస్తారు. ఈ చికిత్స సమయంలో అన్నం, పప్పు, నేతితో చేసిన కిచిడీ మాత్రమే ఆహారంగా ఇస్తారు. అందులో అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా పెడతారు.

రోజు ఒక బెల్లం ముక్క తినడం వల్ల ఉపయోగాలు

ఈ రోజుల్లో మనమంతా తీపి కోసం చక్కెరనే వాడుతున్నాం. నిజానికి పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. అందుకు చాలా కారణాలున్నాయి. బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోకి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు. బెల్లం శ్వాసకోస సంబంధ సమస్యల్ని కూడా నయం చేస్తుంది.

బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా ఉంటుంది. కాలేయ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. కండరాల నిర్మాణం సరవుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం ఇది బ్లడ్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. దీన్ని తరచుగా కొద్ది మొత్తాల్లో తీసుకుంటూ ఉంటే, రక్తాన్నిశుద్ధి చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. రక్తం పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా రకాల వ్యాధులు శరీరానికి రావు.

బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా బ్లడ్ ప్రెష్షర్ కంట్రోల్‌లో ఉంటుంది. బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలుంటాయి. ఇవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని అరికడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచీ శరీరాన్ని కాపాడతాయి. కీళ్ల నొప్పులు, మంటలతో బాధపడేవాళ్లు బెల్లం తినాలి. ఇది ఎంతో ఎక్కువ రిలీఫ్ కలిగిస్తుంది. అల్లంతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. రోజూ పాలలో బెల్లం కలుపుకుని తాగితే, ఎముకలు పుష్టిగా అవుతాయి. తద్వారా కీళ్ల నొప్పుల సమస్య తీరుతుంది. బెల్లంలో ఎక్కువ పరమాణంలో ఉండే మెగ్నీషియం… పేగులకు బలాన్నిస్తుంది. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మన శరీరానికి రోజూ 4 గ్రాముల మెగ్నీషియం అవసరం.

%d bloggers like this:
Available for Amazon Prime