అజిత్ కుమార్ సుబ్రమణ్యం

అజిత్ గారి కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం, సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కుటుంబం. అజిత్ చిన్న తనంలో చదువు మీద కన్న క్రీడలు ,బైక్స్ మీద ఆసక్తి ఉండటంతో 10వ తరగతి తరువాత చదువుకు స్వస్తి పలికి ఆటోమొబైల్స్ రంగంలో అడుగుపెట్టారు, కానీ తన సోదరుల ఉన్నత విద్య కోసం ఆర్థికంగా అండగా నిలిచారు. ఆటోమొబైల్స్ రంగంలో ఉంటూనే వస్త్ర పరిశ్రమలో చిన్న తరహా వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించారు, కానీ తనకు కావల్సిన వారే వ్యాపారం లో మోసం చేయడంతో వ్యాపారంలో దివాళా తీశారు ,ఇది ఆయన మొదటి జీవిత పాఠంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చడానికి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు, మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు మరియు ఆదాయం రావడంతో అప్పులు తీర్చేశారు. మోడల్ గా ఉంటూనే బైక్ రేసింగ్ మీద దృష్టి సారించి కొన్ని రేసుల్లో విజయం కూడా సాధించారు. 1990లో తమిళ చిత్రం లో బాలనటుడిగా చిన్న పాత్ర పోషించారు ఆ పాత్ర కోసం అజిత్ ను ప్రఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం గారు సిఫార్సు చేశారు. అజిత్ ను టివి యాడ్స్ లో చూసిన దర్శకుడు శ్రీనివాస్ గారు అజిత్ ను తన మొదటి సినిమాలో కథానాయకుడిగా ఎంచుకున్నారు, దురదృష్టవశాత్తు సినిమా మధ్యలో శ్రీనివాస్ మరణం అజిత్ ను బాగా కదిలించింది, ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం . అజిత్ తొలి మరియు చివరి తెలుగు చిత్రం.

ప్రేమ పుస్తకం సమయంలో నే తమిళ చిత్ర దర్శకుడు సెల్వ తాను తీస్తున్న అమరావతి చిత్రంలో అజిత్ ను కథానాయకుడిగా తీసుకోవడంతో అజిత్ తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించారు, ఆ చిత్రం విడుదలకు ముందు ఒక బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు సంవత్సరాలు మంచానికి పరిమితం అయ్యారు. తరువాత కొన్ని చిత్రాలు చేసిన మంచి గుర్తింపు రాక పోగా అవకాశాలు కూడా తగ్గాయి, నటుడిగా నిలద్రొక్కుకోవడానికి చిన్న పాత్రలను సైతం పోషించారు.

1995లో వచ్చిన ఆసాయి చిత్రం తో కథానాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో స్థానం నిలుపుకున్నారు. తరువాత కాలంలో వచ్చిన” కథాల్ కొట్టాయి(తెలుగు లో ప్రేమ లేఖ)” తమిళ మరియు తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది, ఆ చిత్రం తరువాత అజిత్ బిజీ నటుడిగా మరీనా 1996 మధ్య నుండి 1998 చివరి వరకు ఆయన నటించిన చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి, అటు వ్యక్తి గత జీవితంలో కూడా పరాజయం పాలయ్యారు( ప్రేమించిన నటి హీరా దూరం అయ్యింది). అజిత్ సినీ జీవితం ముగుస్తుంది అని చాలా మంది విశ్లేషణ కూడా చేశారు. వారి అంచనాలు తప్పని నిరూపిస్తూ1999 లో వరుసగా ఆయన నటించిన 6 చిత్రాలు విజయం సాధించడమే కాకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోగా అజిత్ ఎదిగారు. ముఖ్యంగా ఆయన నటించిన వాలి చిత్రం తెలుగు, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించింది.

2000 నుంచి 2003వరకు అత్యధిక హిట్ చిత్రాలను అందించారు. 2003 నుండి 2007 వరకు అత్యధిక పరాజయాలు పొందిన హీరోగా అజిత్ చరిత్ర సృష్టించారు. ఆ 4 ఏళ్లలో 2006 లో వారాలరు చిత్రం తప్పించి మిగిలిన చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి.2007 లో బిల్లా చిత్రం ఘన విజయం, 2008 నుంచి 2011 వరకు మళ్ళీ వరుస పరాజయాలు, 2011లో మంగతా ఘన విజయం , 2012 ,2013లలో వరుస పరాజయాలు ఇలా ఆయన సినీ జీవితంలో విజయాల కన్న పరాజయాలు ఎక్కువగా ఉంటాయి. 2014 నుండి 2017 వరకు చేసిన వరుసగా చేసిన 5 చిత్రాలన్నీ విజయాలు సాధించాయి, 2017లో వచ్చిన వివేకం అభిమానులను మెప్పించిన విజయం సాధించలేకపోయింది, 2019లో విశ్వాసం, నెర్కొండ పర్వై చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

అజిత్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం నటుడిగా గానే కాకుండా రేసింగ్, ఫోటోగ్రఫీ, వంట , డ్రోన్స్ తయారు మరియు మెకానిక్స్ వంటి క్లిష్టమైన అంశంపై పూర్తి స్థాయిలో పట్టు ఆయన సొంతం. అజిత్ గారు భారత దేశంలో వాణిజ్య విమానాన్ని నడిపే పైలట్ లైసెన్స్ కలిగిన ఏకైక నటుడు. అజిత్ గారు తమిళం, హిందీ, ఇంగ్లీషు, సింధీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు, అలాగే మలయాళం , తెలుగు భాషలను కూడా మాట్లాడగలరు.

అజిత్ గారు నటి షాలిని గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అజిత్ గారు హిందూ , షాలిని గారు క్రిస్టియన్ అయిన వారింట్లో రెండు మతాలను పాటిస్తారు. అజిత్ గారి కుటుంబ నేపథ్యం చూస్తే తండ్రి మలయాళీ, తల్లి కలకత్తా నగరంలో స్థిరపడిన సింధీ , భార్య చెన్నై లో స్థిరపడిన మలయాళీ .

అజిత్ గారు గొప్ప మానవతావాది , సేవా గుణం కలిగిన వ్యక్తి , తాను పెద్ద నటుడిగా ఉన్న చిన్న వారి నుండి పెద్ద వారి వరకు అందరిని సమానంగా గౌరవిస్తారు. అజిత్ గారు సినీ జీవితంలో మరియు నిజ జీవితంలో పడి లేచిన కెరటం పరిశ్రమలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదుర్కొని ఈరోజు గొప్ప నటుడిగా ఎదిగారు.

%d bloggers like this: