స్మృతి ఇరానీ(1976)
స్మృతి ఇరానీ గారి అసలు పేరు స్మృతి మల్హోత్రా , ఆమె ఢిల్లీలో జన్మించారు. స్మృతి గారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు.
దేశ టెలివిజన్ రంగంలో ఆమె చాలా ప్రసిద్ధి చెందిన నటీమణి, మరియు హిందీ చలనచిత్ర పరిశ్రమలో కూడా సహాయ నటి గా మంచి పేరు తెచ్చుకున్నారు. స్మృతి తాత గారు , తండ్రి గారు ఆర్.ఎస్.ఎస్ లో సభ్యులు మరియు బీజేపీ పూర్వ పార్టీ జనసంఘ్ పార్టీకి మద్దతు దారులుగా ఉండేవారు. స్మృతి తల్లి గారు శిబాని గారు ఢిల్లీ జనసంఘ్ పార్టీలో మహిళా నాయకురాలు.
స్మృతి 2003లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి, అద్వానీ గార్ల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి 2004,2009ఎన్నికల్లో పార్టీ తరుపున ఉత్తర భారతం లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి గా , మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు.
2009,2014లలో చాందిని చౌక్ , అమేథీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011, 2016లలో రాజ్యసభ సభ్యురాలు గా ఎన్నికయ్యారు.
2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిగా 2016 వరకు పనిచేశారు, 2017 నుండి 2018 వరకు కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు.2016 నుండి ప్రస్తుతం వరకు కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదనంగా 2019 నుంచి కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
ప్రస్తుత ప్రధాన మంత్రి మోడీ గారికి మొదట్లో స్మృతి బద్ధ వ్యతిరేకి మరియు ఎక్కువగా విమర్శలు చేసేవారు. స్మృతి రాజకీయ జీవితం లో అత్యంత గొప్ప విజయం ఏదైనా ఉందంటే 2019లో జరిగిన ఎన్నికల్లో అమేథీ లోక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించడం.
You must log in to post a comment.