కొత్తవారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే – సహాయపడే చిట్కాలు

ముందుగా షేర్ మార్కెట్ ని ప్రతిరోజూ నెల రోజుల పాటు గమనించండి. నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ లో ఐదు కంపెనీలు సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజూ ఈ ఐదిటినే గమనించండి. ఏ రేటు దగ్గర నుండి ఓపెన్ అయ్యి ఏ రేటు దగ్గర క్లోజ్ అయ్యింది? ఎంత పెరుగుతుంది/తగ్గుతుంది? ఇటువంటి విషయాలు ప్రతిరీజూ గమనించడం ద్వారా స్టాక్స్ మీద ఒక అవగాహన వస్తుంది.

ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ మొదలు పెట్టండి. ఈ స్టాక్ ఈ రేటు దగ్గర ఇన్ని షేర్ లు కొన్నాను అని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు ఆ షేర్ పెరుగుతుందో తగ్గుతుందో చూస్తూ, నష్టమైతే ఎంతవరకు ఉంచుకుని అమ్మగలరో, లాభమైతే ఎంత వచ్చింది ఏ రేటుకి అమ్మితే ఈ లాభమొచ్చింది? తర్వాత ఇంకా పెరిగిందా? ఇలా ట్రేడ్ చేయకపోయినా చేసినట్టే పేపర్ మీద రాస్తూ లాభ నష్టాలు ఒక నెలరోజులు రాయండి.

ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చుంటుంది కాబట్టి మంచి బ్రోకరేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసి మీరు ట్రేడ్ చేయవచ్చు. ఏ కంపెనీ స్టాక్ మంచిది ఏది కొనాలి ఎంతకు కొనాలి అనే విషయాలు యూట్యూబ్, టెలిగ్రామ్ యాప్స్ లో గ్రూప్స్ లో చెప్తూ ఉంటారు ఏదో ఒకటి ఫాలో అవుతుండండి. ఇలా మీరు పెట్టుబడికి ముందుగా ఈ పనులు చేసి సిద్ధమవవచ్చు.

%d bloggers like this: