అదాయపన్నులో సెక్షన్ 80సీ – వివిధ పొదుపు, మదుపు సాధనాలు

80సీ కింద గరిష్టంగా 1,50,000 రుపాయలు పన్ను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. ఆపై NPSలో మరో 50,000 మినహాయింపు కూడా. అంటే మొత్తం 2,00,000 రుపాయల మినహాయింపు పొందవచ్చు.

ఉదాహరణకు ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి జీతం ఏడాదికి 10 లక్షలు అనుకుందాం. ఆదాయ స్లాబుల ప్రకారం మినహాయింపులేవీ లేకుండా 9,50,000 రుపాయలపై (2019 బడ్జెట్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ 50,000/- అందరికీ వర్తిస్తుంది) కట్టవలసిన పన్ను 1,06,600/-. అదే 80సీ ప్రకారం పైన చూసినట్టు 2,00,000 మినహాయింపుతో మొత్తం పన్ను 65,000కు తగ్గుతుంది. అంటే 46,600 రుపాయలు ఆదా.

పిల్లల స్కూల్ ఫీజు, గృహరుణం ఉంటే మూలధనంపై చెల్లింపు కూడా 80సీ కిందకు వస్తుంది. స్కూలుకెళ్ళే పిల్లలు, గృహరుణం ఉన్నవారు ఈ రెండు మినహాయింపులను తప్పక వాడాలి! ఇవి కాక ఇన్‌ఫ్రా బాండ్లు, NABARD గ్రామీణ బాండ్లు, ULIP, రిటైర్మెంట్ బీమా పథకాలు కూడా ఉన్నాయి

ఆయా సాధనాల వివరాలు చూద్దాం:

వీటిలో వయసు, ఆర్థిక లక్ష్యాలను బట్టి తగు సాధనాలు ఎంచుకోవాలి.

అదనపు బాధ్యతలేవీ లేని పెళ్ళి కాని వ్యక్తి భవిష్యనిధి, ELSS ఫండ్లు, జీవితబీమాతో పన్ను మినహాయింపు పొందటం ఉత్తమం. గృహరుణం తీసుకుంటే తదనుగుణంగా ప్రణాళిక మారుతుంది కానీ బీమా, భవిష్యనిధి కొనసాగించాలి. 50 ఏళ్ళ వయసు వరకు పన్ను ఆదా ఎఫ్‌డీల జోలికి వెళ్ళకపోవటమే మంచిది, ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి వాటిలో అతితక్కువ.

ప్రతి ఒక్కరు 80సీ మినహాయింపుల ద్వారా పన్ను తగ్గించుకోవటమే కాకుండా బీమా, రిటైర్‌మెంట్ లక్ష్యాలను చేరవచ్చు.

%d bloggers like this: