ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా?

  • ఇంటి పైన కూల్ సిమెంట్ వేయొచ్చు… రెండు కోటింగ్స్ వేస్తే బాగా పనిచేస్తుంది.
  • సూర్యుడు అస్తమించిన తరువాత తలుపులు, కిటికీలు తీసి ఉంచండి.
  • వంట కూడా సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసేయండి. వంట గది, బాత్రూం లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించి ఇంట్లోని వేడిని బయటకు పంపించండి.
  • ఫ్రిడ్జ్ ని వంట గదిలోనే పెట్టండి. ఫ్రిడ్జ్ మోటార్ చాలా వేడిగా ఉంటుంది, చాలా మంది దానిని హల్ లోనో, బెడ్రూమ్ లోనో పెడతారు, దాని వల్ల బెడ్రూమ్ లేదా హల్ లో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  • సాయంత్రం ఇంట్లో నేల ను నీటితో తుడవడం, కడగడం లాంటివి చేయవచ్చు.
  • ఇండోర్ ప్లాంట్స్ పెంచవచ్చు.
  • సాయంత్రం పూట ఇంట్లో, బయట ఉన్న మొక్కలకు నీళ్ళు పోయడం.
  • మధ్యాహ్నం గోనె సంచులు నీటిలో తడిపి, కిటికీలకు కట్టవచ్చు. లేదా కిటికీలకు sun protection sheets ఉపయోగించవచ్చు.
  • ఒక పెద్ద గిన్నె లో ఐస్ ముక్కలు తీసుకొని, సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టవచ్చు. లేదా పెడల్స్టర్ ఫ్యాన్ ఎదురుగా పెట్టవచ్చు.
  • ఇంట్లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయెన్సెస్ అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించండి. అవి కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి
  • ఎయిర్ కూలర్ ఉపయోగించొచ్చు. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదు.
  • మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమి ఇంటిలోకి రాకుండా వెదురు చాపలు (bamboo mats) ఉపయోగించవచ్చు.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంటిని చల్లపరచడం ఎంత ముఖ్యమో… మనం చల్లగా ఉండడం కూడా అంతే ముఖ్యం ఈ ఎండా కాలం లో…. కాటన్ దుస్తులు ధరించండి, పడుకోబోయే ముందు చల్లని నీటితో స్నానం చేయండి, చలువ పానీయాలు ఎక్కువ తాగండి, ఈ కాలం లో పరుపు కన్నా నేల చాలా సౌకర్యం గా ఉంటుంది పడుకోవడానికి.

%d bloggers like this: