సూయజ్‌ కాలువ (కృత్రిమ జలమార్గం)

The Suez Canal: History, Location & Importance - Video & Lesson Transcript  | Study.com
Suez Canal - The economy | Britannica
  • ఎక్కడ ఉంది? : ఈజిప్టులో
  • కాలువ పొడవు : 193 కి.మీ. 
  • కాలువ లోతు : 78 అడుగులు
  • కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు) 
  • ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు. 
  • కట్టింది ఎక్కడ? : సూయెజ్‌ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం)
  • బయల్దేరే రేవు: పోర్ట్‌ సయెద్‌ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు)
  • చేరుకునే రేవు: పోర్ట్‌ ట్యూఫిక్‌ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) 
  • నిర్మాణం మొదలైంది : 1859
  • నిర్మాణం పూర్తయింది : 1869
  • కెనాల్‌ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి. 
  • కెనాల్‌ లేకుంటే? : షిప్పింగ్‌కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ తిరగవలసి వచ్చేది.   
  • నౌక ప్రయాణ సమయం : వేగాన్ని బట్టి 11 నుంచి 16 గంటలు 
  • నౌక ప్రయాణ వేగం : గంటలకు 15 కి.మీ. (8 నాటికల్‌ కి.మీ.).

సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్‌ గివెన్‌’ షిప్ (25-03-2021)

సూయజ్‌ కెనాల్‌

సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్‌ గివెన్‌’ షిప్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

దీనికి రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షిప్ తైవాన్‌లోని ‘ఎవర్‌గ్రీన్‌ మెరైన్‌’ అనే సంస్థకు చెందినది. సూయజ్‌ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి. దీంతో సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు సుమారు 9.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70 వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

సూయజ్‌ కెనాల్‌
నౌక చుట్టూ ఉన్న ఇసుకను తవ్వుతున్నారు.

కాలువ రెండు తీరాలను తాకుతూ షిప్‌ ఆగిపోవడంతో దానిని బైటికి తీసుకురావడం కష్టమవుతోందని క్యాంప్‌బెల్‌ యూనివర్సిటీ మారిటైమ్‌ హిస్టరీలో నిపుణుడు సాల్‌ మెర్కోగ్లియానో అన్నారు.

సూయజ్‌ కెనాల్‌

ఎవర్‌ గివెన్‌లాంటి పెద్ద ఓడలు ప్రయాణించేందుకు వీలుగా 2015లో సూయజ్‌ కెనాల్‌ను విస్తరించారు.

సూయజ్ కాలువ
%d bloggers like this: