కెచప్
సాస్‌లలో ఒక రకం కెచప్. కెచప్‌ని టమాటోలు, నూనె, వినెగర్, పంచదార, ఒక్కోసారి కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి చేస్తారు. ఇది వేడిగా తినరు. మనం ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, శాండ్విచ్ వంటివాటిల్లో ఎక్కువగా తినేది కెచప్పే.
మ్యాగీ టమాటో కెచప్. ® నెస్లే వారి రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్.
సాస్
టమాటో సాస్‌ని టమాటో, నూనె, మసాలాదినుసులతో పాటుగా వెజిటబుల్ లేక మీట్ స్టాక్ వాడి చేస్తారు. ఇందులో వినెగర్ వాడరు. సాధారణంగా పంచదార కూడా వాడరు. ఇది కొన్ని వంటకాలు వండుతున్నప్పుడూ, వాండాక పైన డ్రెస్సింగ్ లాగా వాడతారు. టమాటోతో మాత్రమే కాక అనేక రకాల సాస్‌లు చేసుకోవచ్చు. రెడ్ సాస్, వైట్ సాస్, బార్బెక్యూ సాస్ లాంటివి దీనికి ఉదాహరణలు. ఇంచుమించు వీటన్నిటినీ వేడిగా వడ్డిస్తారు.
You must log in to post a comment.