మహిళల భద్రత – తక్షణ సహాయం

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినా కూడా వారు భద్రత పరంగా ప్రతిరోజూ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని సార్లు తక్షణ సాయం తప్పని సరి అవుతోంది. తక్షణ సాయం కోసం ఎవరైనా 100 కు డయల్ చేయవచ్చు. వెంటనే పోలీసుల నుండి సహాయం అందుతుంది. ప్రత్యేకించి మహిళల కోసం కూడా హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో తక్షణ సాయం కోసం మహిళలు డయల్ చేయాల్సిన నంబరు 112 లేదా 1091 కు కాల్ చేయవచ్చు.

ఇంతే కాకుండా భద్రతకు సంబంధిన కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వాడేవారు ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో దిశా యాప్:

అత్యవసర సమయాల్లో మహిళలకు సహాయం అందించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ లో ఉన్న ఎస్ఓఎస్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మహిళలు తక్షణ సాయం పొందవచ్చు. ఇందులో ఇంకా దగ్గరలో ఉన్న రక్షిత స్థలాలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటళ్లు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు వంటి ఎంతో ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ యాప్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరి కోసం ట్రాకింగ్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి అమ్మాయి, మహిళా కూడా తప్పని సరిగా ఈ యాప్ ను వారి ఫోన్ లో ఉంచుకోవాలి.

%d bloggers like this: