జీవితం – అత్యంత దారుణమైన వాస్తవాలు

ఆరోగ్యం

మనం granted గా తీసుకునే అనేక విషయాల్లో ప్రధానమైనది ఆరోగ్యం. మనకి అది ఉన్నంతసేపు దాని గురించిన తలపు ఉండదు. అనారోగ్యం వచ్చాకే దాని విలువ తెలిసేది. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి default state. కాబట్టి అది ఉంటే పెద్ద విషయం కాదు కానీ లేకపోతేనే పెద్ద విషయంలా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని తగించుకుంటూ, మంచి జీవనశైలిని కలిగి ఉన్నా కూడా మనం అనారోగ్యం పాలు అవ్వచ్చు. అసలు మన తప్పేమీ లేకుండానే కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురి అవ్వచ్చు. ఇన్ని కోట్ల components ఉన్న అద్భుత జీవ యంత్రమైన మన శరీరం ఏదో ఒక సమయంలో ఒక విషయంలో చేతులు ఎత్తెయ్యచ్చు. Anything could go wrong.

కుటుంబం

మన కుటుంబం మనకి బలమూ, బలహీనతా. ఆరోగ్యంలాగానే మంచి కుటుంబం విలువ కూడా అది లేనివాడికి బాగా తెలుస్తుంది. రక్తసంబంధం అయినంత మాత్రాన ఆ బంధం మనకి మంచి చేసేదే అవుతుందని ఏమీ లేదు. కొన్ని బంధాలు చేసే గాయాలు చితి వరకూ వెంటాడతాయి మనని. ఇది extended family విషయంలోనే కాదు. తలిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు లాంటి immediate family విషయంలో కూడా వర్తిస్తుంది.

మానసిక అనారోగ్యం

మానసిక అనారోగ్యం అన్నది మన భారతీయ సమాజంలో మనం ఊహించేదానికన్నా ఎక్కువే ఉంది. మానసిక సమస్యలకి కూడా వైద్యం అవసరం. కానీ అదంతా రోగి ‘బుర్రలో’ పుట్టినదే అని కొట్టి పారేస్తారు కొందరు. అది ఒక్కోసారి నిజమే అవ్వచ్చు కానీ అన్నిసార్లూ కాదు. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందని, ఆఫీస్‌లో బాసు తిట్టారని, ఇంట్లో నాన్న తిట్టారనీ మనం డిప్రెస్ అవుతాం. ఆ బాధ కొంత సమయం తరువాత తగ్గిపోతుంది. కానీ clinical depression అలాంటిది కాదు. దానికి తప్పనిసరిగా వైద్యం కావాలి. అది ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటేనో, యోగా, ధ్యానాల వంటివి చేస్తేనో తగ్గిపోయేది కాదు. మానసిక అనారోగ్యాన్ని మనం బాగు చెయ్యాలి అంటే మొట్టమొదట చేయాల్సింది దాన్ని మనం acknowledge చెయ్యడం. దాన్ని ఒక taboo లాగా చూడకపోవడం.

%d bloggers like this: