Covid-19 vaccine – How to Register

కోవిన్ వెబ్‌సైట్

వెబ్ సైటు ద్వారా నమోదు చేసుకోవడం ఎలా?

www.cowin.gov.in అనే వెబ్ సైటులోకి లాగ్ ఇన్ అవ్వాలి. అందులో మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నమోదు పేజీ కనిపిస్తుంది. అందులో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

వ్యాక్సీన్ వేసుకోవాలనుకునే వారి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం, వాటి వివరాలు, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను నింపాలి. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వివరాలు పొందుపరచాలి. అన్ని వివరాలు పొందుపరిచిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే దానిని ధ్రువీకరిస్తూ మొబైల్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో ముగ్గురు సభ్యులను కూడా ‘యాడ్ మోర్’ అనే ఆప్షన్ ద్వారా నమోదు చేయవచ్చు. ఆ వ్యక్తుల వివరాలు కూడా పైన వివరించిన పద్దతిలోనే నమోదు చేయాలి.

కోవిన్ వెబ్‌సైట్

ప్రతీ వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తవగానే కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. ఎవరి పేరునైనా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ పేజీ నుంచి వ్యాక్సీన్ తీసుకునే తేదీని నిర్ణయించుకోవచ్చు.

మనం నివసించే రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.

మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సీన్ కేంద్రాలన్నీ అక్కడ కనిపిస్తాయి. అందులోంచి వ్యాక్సీన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న తేదీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క సారి వ్యాక్సీన్ కేంద్రం, తేదీని ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరిగి అకౌంట్ డీటెయిల్స్ పేజీకి వెళ్ళాలి. ఆ తర్వాత బుక్ అపాయింట్మెంట్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా వ్యాక్సీన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఒక సారి పొందుపర్చిన వివరాలను సరి చూసుకుని కంఫర్మ్ బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే. రిజిస్ట్రేషన్ పూర్తయితే, “అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్” అనే పేజీ కనిపిస్తుంది. ఈ పేజీని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి

ఈ వివరాలను, ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను ధృవీకరించే సర్టిఫికేట్ లతో సహా వ్యాక్సీన్ కేంద్రానికి తీసుకుని వెళ్లాలి. వీటిని పరిశీలించిన తర్వాత వ్యాక్సీన్ ఇస్తారు. వ్యాక్సీన్ తీసుకునే తేదీని, యాప్, లేదా వెబ్ సైటులోకి లాగిన్ అయి ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

వ్యాక్సీన్ ప్రక్రియ పూర్తి అయిన 28 రోజులకు రెండో డోసు తీసుకోవడానికి కూడా యాప్‌లో తేదీ ఖరారు అయిపోతుంది.

ఒక వేళ మొదటి డోసు తీసుకున్న తర్వాత వేరే నగరానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, అక్కడ నుంచి కూడా వ్యాక్సీన్ తీసుకునే కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime