- కైలాష్ టెంపుల్
భారతదేశంలోని మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్ద ఉన్న రాతిని తొలిచి కట్టిన హిందూ దేవాలయాలలో కైలాష కైలాసనాథ ఆలయం అతిపెద్దది. రాక్ క్లిఫ్ ముఖం నుండి చెక్కబడిన ఒక మెగాలిత్, దాని పరిమాణం, వాస్తుశిల్పం, శిల్ప చికిత్స, మరియు “భారతీయ వాస్తుశిల్పలో రాక్-కట్ దశకు అత్యున్నతమైన ఉదాహరణ” కావడం కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప గుహ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అభయారణ్యం పై ఉన్న సూపర్ స్ట్రక్చర్ పైభాగం క్రింద ఉన్న కోర్టు స్థాయికి 32.6 మీటర్లు అయినప్పటికీ, రాతి ముఖం ఆలయం వెనుక నుండి ముందు వైపుకు క్రిందికి వాలుగా ఉంటుంది.
ఆలయం మొత్తం ఒకే శిలను చెక్కి నిర్మించబడినది. ఆలయ శిఖరం నుండి మొదలై కిందకు చెక్కబడిందని అంచనా.
ఇప్పుడు మనకున్న భారీ వాహనాలు, పెద్ద పనిముట్లు ఏవీ లేని కాలంలో (8వ శతాబ్దం) ఇంతటి కట్టడాన్ని నిర్మించారు. అందుకు రెండు లక్షల టన్నుల రాయిని త్రవ్వి వెలికితీశారు.
మరో విషయమేమిటంటే ఆ వెలికితీసిన రాళ్ళు ఆ చోటు నుండి వంద మైళ్ళ వ్యాసార్థంలో ఎక్కడా లేవు. మరెక్కడ విసర్జించినట్టు?
Who built Kailasa temple at Ellora?
The Kailasa Temple in Ellora, that can never be built once again on Earth! 164 feet long, 108 feet wide & 100 feet high, Entire Mandir from top to bottom was cut out from solid basalt bedrock! The temple was built by Krishna I of the Rashtrakuta Dynasty. They were constructed during 600 AD to 1000 AD.
The largest Monolithic Structure of the World. And here stands wonders of the wonders! Kailasa Temple is the largest of the rock-cut Hindu temples at the Ellora Caves, Aurangabad District, Maharashtra, India.
The world-famous Kailasanath Temple is a marvelous example of Rashtrakuta architecture. It represents Mount Kailash, the abode of Lord Shiva. The temple has four parts- the central shrine, the entrance gate, the Nandi shrine, and a group of five shrines surrounding the courtyard. A two-storeyed gateway opens to reveal a U-shaped courtyard. The dimensions of the courtyard are 82 m x 46 m at the base. The courtyard is edged by a columned arcade three stories high containing enormous sculptures of different deities. Originally flying bridges of stone connected these galleries to the central temple, which have collapsed.
ఎల్లోరా పురాతత్వ ప్రదేశం ఔరంగాబాద్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ ప్రదేశం మహారాష్ట్రలో కలదు. ఈ ప్రదేశాన్ని ప్రారంభంలో రాష్ట్రకూట వంశస్ధులు పునర్నించారు. ఎల్లోరా మొత్తంగా 34 గుహలు కలిగి ఉంది. ఈ నిర్మాణాలు మూడు గ్రూపులుగా వర్గీకరించారు. బౌద్ధమత, హిందూ మత మరియు జైన మత గ్రూపులుగా కలవు. బౌద్ధమతానికి మొదటి 12 గుహలు, హిందూ మతానికి తర్వాతి 17 గుహలు, జైన మతస్ధలకు 5 గుహలు కలవు. ఈ తవ్వకాలన్నీ ఒకదానికొకటి సమీపంలోనే ఉండి ఆ కాలంలో ఈ మతాలమధ్య గల పరమత సహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఎల్లోరా – గుహల ప్రపంచం మొదటి గుహల సముదాయం బౌద్ధ మతానికి సంబంధించినది. ఎల్లోరా గుహలను మొదటగా బౌద్ధులు క్రీ. శ 450 నుండి 700 సంవత్సరాల మధ్య తవ్వకాలు జరిపారు. వాటిలో 12 గుహలను వెల్లడించగలిగారు వాటిని గుహలు 1 – 5 గాను మరియు గుహలు 6 – 12 గాను విభజించారు. బ్రాహ్మణుల గుహలనే హిందూ గుహలని కూడా పిలుస్తారు. ఇవి గుహ నెం.13 నుండి గుహ నెం.29 వరకు ఉంటాయి. మొత్తంగా 17 గుహలు గా పడమటి ప్రాంతంలో కలవు. ఈ గుహలన్నీ వివిధ కాలాలలో నిర్మించారు. ఎల్లోరాలో చివరగా జైనమత గుహలను కనుగొన్నారు. ఇక్కడి తవ్వకాలలో లభ్యమైన గుహలు అసంపూర్తిగా ఉన్నప్పటికి ఎంతో వివరవంతంగా ఉన్నాయి. వీటి వివరాల వెల్లడిలో పరిశోధకులకు సునాయాసంగా ఉండి అప్పటి వరకు వారు పరిశోధించిన బౌద్ధ మరియు హిందు గుహల శ్రమకు ఏ మాత్రం పోలిక లేదు. గుహ నెం.30 నుండి గుహ నెం.34 వరకు ఈ గ్రూపులో అయిదు గుహలున్నాయి. అన్ని గుహలలోను ప్రధానంగా ఉన్న వస్తువు నీటి తొట్టెలు. ఈ గుహలలో ఆ కాలంనాటి సన్యాసులు, వారి శిష్యులు ఉండేవారు. కనుక వారికి నీటి సౌకర్యం చేతికి అందుబాటులో ఉండటం అవసరమయ్యేది. అంతేకాక వారు వర్షపు నీటిని నిలువ చేసే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ నీటిని గుహలలోని పెద్ద రాళ్ళను కోసి ధారలుగా తమ నీటి తొట్టెలలోకి పట్టేవారు. ఎల్లోరాకు ఎపుడు మరియు ఎలా వెళ్ళాలి? గుహలను సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే దర్శించవచ్చు. వాతావరణం ప్రధానంగా చల్లగాను, ఆహ్లాదకరంగాను ఉంటుంది. అయితే, వేసవిలో కొద్దిపాటి వేడితో అసౌకర్యమనిపిస్తుంది. వర్షాకాలం సందర్శనకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ కల ఒక నది పూర్తి ప్రవాహంతో ఆ సమయంలో ప్రవహించి చుట్టుపట్ల అందాలను మరింత పెంచుతుంది. ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఇక ప్రయాణం ఎలా చేయాలి అంటే, విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సమీపంలోని ఔరంగాబాద్ పట్టణం చేరాలి. ఔరంగాబాద్ ఎల్లోరాకు సమీపంగా ఉంటుంది. ఔరంగాబాద్ విమానాశ్రయం గుహలకు దగ్గరగా ఉండి తేలికగా చేరేలా ఉంటుంది. ఔరంగాబాద్ రైలు స్టేషన్ కూడా ఎల్లోరా గుహలకు 45 నిమిషాల దూరంలో కలుపబడి ఉంది. రోడ్డు ప్రయాణం అంటే 30 కి.మీ. ల దూరంలో కల అహ్మదాబాద్ జంక్షన్ నుండి కూడా ఎల్లోరా గుహలకు తేలికగా చేరుకోవచ్చు. ఆటోలలో ఇక్కడనుండి గుహలకు చేరుకోవచ్చు.ఎల్లోరా గుహలు భారత దేశ సంస్కృతి ప్రతిబింబించే పది ప్రధాన స్ధలాలలో ఒకటిగా పరిగణించవచ్చు. సంస్కృతిపరంగా, జాతి పరంగా ఎన్నో విలువలు కల ఈ గుహలు మూడు మతాల వ్యాప్తిని భారతదేశం నుండి ప్రపంచానికి అందించాయి.
బౌద్ధుల గుహలు
గుహ నెం.1తవ్వకాలలో మొదటి గుహ ఇది. దక్షిణాదిన నిర్మించిన మొదటి బౌద్ధారామం. దీనిలో నాలుగు గదులు, మాత్రం ఉంటాయి. ఏ రకమైన శిల్పాలు లేవు. గుహ నెం.2 బుద్ధుడి జ్ఞాపికలతో నిర్మించిన మరో గుహ ఇది. ఇది మెట్ల చివరి భాగంలో ఉంటుంది. దీనికి ఒక మంటపం మరియు దానిలో బుద్ధుని అసంపూర్ణ చిత్రాలు ఒక గ్యాలరీగా ప్రదర్శించబడతాయి. ఇక్కడ కనుగొనిన శిల్పాలు పెద్దవి మరియు అందంగా ఉంటాయి. వీటిలో లక్ష్మీ, పంచిక మరియు ఐశ్వర్య దేవత, హరితి మొదలైనవి చేరి ఉంటాయి. గుహ నెం.3చారిత్రాత్మకతలో దీనికి వేరు గుహలు సాటి రావు. దీనిలో కూర్చొని ఉన్న బుద్ధుడు అసంపూర్ణంగా కనపడతాడు. ఇక్కడే ఇంకా ఇతర బౌద్ధమత చిహ్నాలు, అలంకరణలు కనపడతాయి. గుహ నెం.4ఒకప్పుడు ఈ గుహ రెండు అంతస్తులుగా ఉండేది. కాని ఇపుడు శిధిలావస్ధలో ఉంది. దీనిలో కూడా కూర్చుని ఉన్న బుద్ధుడి శిల్పం కనపడుతుంది. గుహ నెం. 5 ఈ గుహ 117 అడుగుల లోతు మరియు 59 అడుగుల వెడల్పు కలిగి ప్రధానంగా ఒక బౌద్ధ విహారాన్ని తలపిస్తుంది. దీనిపేరు మహర్వాద. దీనిలో 20 గదులు బౌద్ధ సన్యాసులకొరకు నిర్మించారు. అందమైన బుద్ధ దేవాలయం ఉంటుంది. ఇక్కడే రెండు పొడవైన సన్నని బెంచీలు కలవు
గుహ నెం.6ఈ గుహలో నలుచదరంగా ఒక హాలు ఉంటుంది. బోధిసత్వ చిత్రాలు మాత మహామయూరి మరియు తార చిత్రాలుంటాయి.గుహ నెం.7ఈ గుహ ఇతర గుహలంత ప్రసిద్ధి కాదు. దీనిలో సాధారణ హాలు, స్తంభాలతో ఉంటుంది.
గుహ నెం.8ఒకప్పటి బౌద్ధ విహారమైన ఈ గుహ విలువైన బుద్ధుడి శిల్పాలు కలిగి ఉంది. ఈ గుహ పూర్తి భాగాన్ని చూసి రావచ్చు. గుహ నెం.9 ఈ గుహలో అందమైన మాత తారాదేవి తన భక్తులను ఒక ఏనుగు, ఒక పాము, అగ్ని మరియు ఓడ మునక వంటివాటినుండి రక్షిస్తున్న చిత్రం కనపడుతుంది. దేవాలయానికి పక్కనే ఒక టెర్రస్ కూడా ఉంటుంది. గుహ నెం.10 ఈ గుహకు ప్రసిద్ధి చెందిన శిల్పి విశ్వకర్మ పేరు పెట్టబడింది. ఈ గుహను సుతర్ కా ఝోప్రా అంటే వడ్రంగి గుడిసె అని కూడా అంటారు. వడ్రంగులు ఈ గుహను దర్శించి విశ్వకర్మకు నివాళి అర్పిస్తారు. ఇక్కడే ఒక బుద్ధుడి మంటపాన్ని కూడా చూస్తారు. ప్రవేశ ద్వారం వద్దే, బుద్ధుడి విగ్రహాన్ని ధర్మకక్ర ప్రవర్తన ముద్రలో 11 అడుగుల ఎత్తు విగ్రహంగా చూస్తారు. భారతదేశంలో చైత్య వంశస్దుల పాలన కాలం ప్రాముఖ్యతను ఈ గుహ వివరిస్తుంది. గుహ నెం.11 (దో ధాళ్)దో ధాళ్ అంటే అర్ధం రెండు అంతస్తులు అని. అయితే ఈ గుహ మూడు అంతస్తులుగా ఉంటుంది. కాని నేల అంతస్తు పూర్తిగా కుంగిపోవటంతో ఇది రెండు అంతస్తులుగానే ఉంటుంది. ఈ గుహలో కూడా బుద్ధుడు పద్మాసనం వేసి కూర్చున్న భంగిమతో విగ్రహం కనపడుతుంది. దీనితోపాటు, గణేశ, మాత దుర్గ ల విగ్రహాలు కూడా కనపడతాయి. గుహ నెం.12 (తీన్ ధాళ్)ఈ గుహ మహారాష్ట్ర లోని అన్ని బౌద్ధ విహారాలకంటే పెద్దది. అది మూడు అంతస్తుల పొడవు. వెడల్పైన ప్రవేశం కలిగి అతి పెద్ద ప్రాంగణం కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రతి అంతస్తు చేరేందుకు వేరు వేరుగా మెట్లు కలవు. ఈ హాలులో అనేక స్తంభాలు మరియు బుద్ధుడి ఇతర దేవతల చిత్రాలు, శిల్పాలు ఉంటాయి.
కుబేరున్ని ఓడించి పుష్పక విమానాన్ని దొంగలించి అందులో తిరిగి వెళ్తున్న దశకంఠుడు అకస్మాత్తుగా విమానం ఓ చోట ఆగిపోయి కదలకుండా మొరాయించేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పరమశివుడు కేళీవిలాసంలో ఉంటాడని,అందుకే ఆ వైపుగా ఎవ్వరినీ అనుమతించరని నందీశ్వరుని ద్వారా తెలుసుకుంటాడు. అయినా అహంకారదర్పంతో తన మార్గానికి అడ్డొచ్చిన కైలాస పర్వతాన్ని పెకలించి పారేస్తానని పిచ్చిప్రేలాపనలు చేసి కైలాసాన్నే కదిలించబోగా పరమశివుడు తన కాలి బొటనవ్రేలితో అతన్ని అదిమిపెట్టి గర్వభంగం కలిగిస్తాడు.ఈ శిల్పంలో రావణుడి మెడ వెనక్కి తిరిగి ఉండటం కూడా స్పష్టంగా గమనించవచ్చు…. బరువు మొయ్యలేక దశకంఠుడు వెయ్యి సంవత్సరాల పాటూ అరుస్తూ శివ స్తోత్రాలు వల్లిస్తాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి వెయ్యి సంవత్సరాల ఆయుష్షును తిరిగి ప్రసాదించి, చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కానుకగా ఇస్తాడు. … ఈ శిల్పం ఎల్లోరా గుహాలయాలలో ఉంది
ఒకే రాత్రి పై శిల్పాలు చెక్కడం వేరే… కానీ ఒక కొండను మొత్తం… ఒక దేవాలయంగా మలచడం… ఆ దేవాలయంలో శిల్పాలను సృష్టించడం… అది ఒక ప్రపంచ అద్భుతమే… నభూతో న భవిష్యత్… ఇలాంటి కట్టడాన్ని తిరిగి చెక్కడం అసాధ్యం… అదే ఎల్లోరా గుహాలయాల విషయం… ఈ గుహాలయాలను మొత్తం మూడు వేర్వేరు మతాలవారు… బౌద్ధులు… హిందువులు.. జైనులు కట్టించారు… ఈ ఆలయాలను నిర్మించడానికి దాదాపు 800 సంవత్సరాలు పైగా పట్టింది… దాదాపు 20 జనరేషన్స్ వారు ఈ ఆలయాల కోసం కష్టపడ్డారు… రోజుకి దాదాపు వెయ్యి మంది పని చేసేవారు… మూడు వేల టన్నుల రాతిని కొండ నుండి వేరుచేసి ఆలయాన్ని నిర్మించారట.
You must log in to post a comment.