ఎలిఫెంటా – రాతిలోని అద్భుతం

ప్రసిద్ధి చెందిన ఎలిఫెంటా గుహలు ఇపుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్ధ గుర్తించింది. ఇవి ఎలిఫెంటా దీవిలో కలవు. వీటికి ఈ పేరు పోర్చుగీసు భాషనుండి వచ్చింది. వారు ఇక్కడకు వచ్చినపుడు ఏనుగుల శిల్పశైలి అధిక స్ధాయిలో కనపడగా, దీనికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. ఇది ముంబై నగర ముందు భాగంలోని ఘరాపురి దీవిలో కలదు. ఘరాపురి అంటే గుహల నగరం అని అర్ధం చెపుతారు. ఎలిఫెంటా లో రెండు రకాల గుహలు కలవు. అవి ఒకటి హిందు మరియు రెండవది బుద్ధ గుహలుగా చెపుతారు. రెండు గుహలను సోమవారాలు నిర్వహణ నిమిత్తం మూసి వేస్తారు.

ద్వీపంలో బోటు విహారం

ఈ దీవికి బోటు లేదా ఫెర్రీ లోముంబై నగరంలోని కొలబా వద్దకల గేట్ వేఆఫ్ ఇండియా టర్మినల్ నుండి చేరవచ్చు . ప్రతి గంటకు ఈ సర్వీసు ఉంటుంది . ప్రయాణపు ఛార్జీలు కూడా తక్కువే . ఒక గంట సమయం పడుతుంది . పర్యాటకులు బోటు ప్రయాణం మరియు ముంబై హార్బర్ లోని శబ్దాలు ఆనందించవచ్చు .

మార్గంలో గేట్ వే ఆఫ్ ఇండియా టర్మినల్ కు దూరంగా కల యూనివర్శిటీ టవర్ , విక్టోరియా టర్మినస్ టవర్ మరియు హోటల్ తాజ్ లను ముంబై నగర ఆకాశం బ్యాక్ గ్రౌండ్ లో చూసి ఆనందించవచ్చు . ఫెర్రీ కనుక ఒక సారి ద్వీపం చేరితే, పర్యాటకులు జెట్టీ నుండి దిగి నేరుగా ప్రధాన గుహ మెట్లవద్దకు చేరుకోవచ్చు. గుహలకు చేరాలంటే, నేరో గేజ్ మిని ట్రైన్ సర్వీసు అయిన ఎలిఫెంటా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో కూడా చేరవచ్చు. ఎలిఫెంటా దీవి ఎవరు నిర్మించారో ఇప్పటికి తెలియదు కాని ఇవి క్రీ.5 నుండి 8వ శతాబ్దంలోనివిగా చెపుతారు.

గుహలు మరియు యోగ…
ప్రధాన దైవ క్షేత్రం లేదా గ్రేట్ కేవ్ అనేది చాలా ప్రసిద్ధి చెందినది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రధానమైనవి ఎలిఫెంటా త్రిమూర్తి మరియు నటరాజ. శివుడు నాట్యం చేసే నటరాజ విగ్రహం తప్పక చూడవలసినది. ప్రధాన గుహలే కాక పర్యాటకులు శివభగవానుడి వివిధ యోగాసనాలు కూడా దర్శిస్తారు. పాలనలో భాగంగా, యాజమాన్యం ఇక్కడే ఒక మ్యూజియం కూడా పెట్టింది.

కొంచెం కష్టపడి దీవి పై భాగానికిచేరుకోగలిగితే , ఒక పెద్ద ఫిరంగిని కేనన్ పాయింట్ లో చూడవచ్చు . అంతేకాక , ఇక్కడినుండి ముంబై నగర కోస్తాతీర అందాలు , ఆకాశం , దీవి మొత్తంగాను ఎంతో మనోహరంగా కనపడతాయి . చాలామంది పర్యాటకులు పైకి వెళ్ళేందుకు శ్రమగా భావిస్తారు .కాని పైకి వెళ్ళి చూడగలిగితే , మీరు పడిన కష్టానికి తగ్గ ఫలితం అనిపిస్తుంది .

%d bloggers like this:
Available for Amazon Prime