మనాలి – సుందరమైన ప్రకృతి!

మనాలి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్యాటక ప్రాంతం మరియు హిమాచల్ మొత్తం పర్యాటకులలో నాల్గవ వంతు పర్యాటకులు మనాలి సందర్శిస్తున్నారు. మనాలి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ (బల్లకట్టు పోటీలు), ట్రెక్కింగ్ (నడక), కయకింగ్(పడవ), మరియు మౌంటైన్ బైకింగ్ (పర్వత మోటార్ సైకిళ్ళ పోటీ) వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ. మనాలి దాని తీవ్రమైన యాక్ క్రీడలు టైం పత్రిక యొక్క “బెస్ట్ అఫ్ ఆసియా” లో కూడా చూపబడింది మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు మరియు టిబెట్ ఆలయాలు మరియు బుద్ద ఆలయాలు ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా మనాలి హనీమూన్ జంటలకు అభిమాన గమ్యస్థానంగా మారింది. మే, జూన్, డిసెంబర్, జనవరి లో రోజుకు సుమారు 550 జంటలు మరియు ఇతర రోజులలో రోజుకు సుమారు 350 జంటలు హనీమూన్ కోసం మనాలికి వస్తారని గణాంకాలు తెలుపుచున్నాయి.

మనాలి దాని కాంతులీనే గోమ్పాస్ లేదా బుద్ధ ఆశ్రమాలకు పేరు పొందింది. కులు లోయ మొత్తంలో టిబెటన్ శరణార్ధులు ఎక్కువగా ఉంటారు. 1969లో నిర్మించిన గదన్ తెక్చ్చోక్లింగ్ గొంప ప్రసిద్ధి చెందినఆశ్రమం. ఈ ఆశ్రమం స్థానిక సమాజం యొక్క విరాళాలు మరియు ఆలయం యొక్క కార్ఖానాలో చేతితో నేసిన తివాచీల అమ్మకాలతో నిర్వహించబడుతుంది. ప్రొద్దు తిరుగుడు పూల తోటలో, చిన్నదిగా మరియు ఆధునికంగా నిర్మించిన హిమాలయన్ న్యిన్గమప గొంప, బజారుకు దగ్గరలో ఉంది. సముద్రమట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో నే ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి. కులూ జిల్లాలో భాగమైన మనాలి, రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది. సృష్టి కర్త బ్రహ్మ దేవుడిచేత నియమింపబడిన ధర్మ శాస్త్ర విధాయకుడు పేరు మను. ఆ పేరు నుండి ఈ ప్రాంతానికి మనాలి అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. సృష్టి మరియు నాశనం యొక్క ఏడు చక్రాలు పూర్తయిన తరువాత ఈ ప్రాంతానికి మను విచ్చేసాడని నమ్ముతారు. హిందూ మతానికి సంబంధించిన సప్త ఋషులు తల క్రిందులుగా తపస్సు చేసే ప్రాంతంగా మనాలి ప్రసిద్ది.   పర్యాటక ప్రాంతాలు

మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట , శిలలు, రాళ్ళు, మరియు విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ యొక్క మహోన్నత మరియు మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాత కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది.

పాండవ యువరాజు భీముని భార్య, స్థానిక దేవత హడింబి యొక్క ఆలయమైన హిడింబా దేవి ఆలయం 1553లో స్థాపించబడింది. ఈ ఆలయం దాని నాలుగు అంతస్తుల గోపురం మరియు సున్నితమైన దారు చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది.

సుందరమైన రహ్లా జలపాతములు మనాలి నుండి 27కిలోమీటర్ల దూరంలో రోహతంగ్ కనుమ ఎక్కడానికి ప్రారంభంలో 2501 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

మనికరణ్ : కులు నుండి 45 కిమీ. దూరంలో మనాలి మార్గంలో పార్వతి నది సమీపంలో ఉన్న ఈ ప్రదేశం వేడి నీటిబుగ్గకు ప్రసిద్ధి చెందింది.  

హడింబ టెంపుల్

  మనాలి లో ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో హడింబ టెంపుల్ ఒకటి. హిందూ పురాణాల లో రాక్షసి అయిన హడింబి చెల్లెలు హడింబా దేవికి ఈ కేవ్ టెంపుల్ అంకితమివ్వబడింది. దేవదారు వృక్షాల అడవిలో ఉన్న ఈ దేవాలయం హిమాలయాల పాదప్రాంతం లో ఉంది. 1553 కి చెందిన ఈ దేవాలయం భూమి నుండి ఉద్భవించిన ఒక పెద్ద రాతి నుండి నిర్మించబడింది. ఈ ఆలయం లోపల ఉన్న ఈ రాతి ని దేవత కి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.

స్థానిక పురాణాల ప్రకారం, ఇటువంటి ఆలయ నిర్మాణం వేరే ఎక్కడా కనపడకూడదని ఈ ఆలయ నిర్మాణానికి కారకుడైన రాజు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కళాకారుల కుడి చేతిని నరికించి వేసాడు.

ఉత్సవ గుర్రం తో నిర్వహించే “ఘోర్ పూజ” అనే వేడుకలో భాగంగా దేవత యొక్క ఆశిస్సులు భక్తులు పొందుతారు. మే 14 నాడు ఇక్కడ కొలువున్న దేవత యొక్క జన్మదిన వేడుకలకి అధిక సంఖ్యలో హాజరవుతారు.   సోలంగ్ లోయ : స్నో పాయింట్ గా ప్రసిద్ధి చెందింది, మనాలికి వాయవ్యంగా 13 కిమీ దూరంలో ఉంది.

సోలాంగ్ వాలీ

సోలంగ్ లోయ , మనాలి లో ఉన్న మరొక ప్రఖ్యాత పర్యాటక స్థలం , ఇది 300 మీటర్ ల ఎత్తు హై స్కి లిఫ్ట్ కు పెరుగడించింది. సోలాంగ్ విలేజ్ మరియు బీస్ కుండ్ మధ్యలో ఇది ఉంది. ప్రతి ఏడాది జరిగే వింటర్ స్కీయింగ్ ఫెస్టివల్ విశేషం గా పర్యాటకులని ఆకర్షిన్స్తుంది.జీప్ తో వెళ్ళగల ఎత్తిన రోడ్ మార్గం గాను ఈ ఉన్నతమైన పర్వతం పర్యాటకుల పిక్నిక్ స్పాట్ గాను ప్రసిద్ది. పారా గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్, స్కీయింగ్ మొదలగు క్రీడలలో పాల్గొనవచ్చు. అందమైన ప్రక్రుతి దృశ్యాలు,పర్వాతలు,గ్లేసియర్ లు కల రోహతంగ్ పాస్ పర్యటన పర్యాటకులకు అధ్బుతమైన అనుభూతిని పంచుతుంది.   రోహతంగ్ మనాలి నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన మంచు పడే ప్రాంతం, కానీ శీతాకాలంలో మంచు వలన మూయబడి ఉంటుంది. మనాలి జాతీయ రహదారి 21 మరియు జాతీయ రహదారి 1 ల ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లే కు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది.  

రోహతంగ్ పాస్

  “హైయెస్ట్ జీపబెల్ రోడ్ ఇన్ ది వరల్డ్” గా ప్రసిద్ది చెందిన రోహతంగ్ పాస్, ఏంతో మంది పర్యాటకులచే ఎండాకాలం లో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. మనాలి నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం కులూ ని లహౌల్ మరియు స్పిటి తో అనుసంధానం చేస్తుంది. సముద్ర మట్టం నుండి 4111 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి అందమైన పర్వతాలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు మరియు గ్లేసియర్ లు కనువిందు చేస్తాయి. పర్యాటక ప్రాంతాలకి ప్రవేశ ద్వారం గా వ్యవహరించడమే కాకుండా రోహతంగ్ పాస్ ట్రెక్కింగ్ లకి అనువైన ప్రాంతం గా కూడా ప్రసిద్ది చెందింది. మౌంటెన్ బైకింగ్, పారాగ్లైడింగ్ మరియు స్కైంగ్ వంటి ఆక్టివిటీస్ లని పర్యాటకులు చేపట్టొచ్చు.   మే లో తెరచుకునే ఈ పాస్ సెప్టెంబర్ లో భారీ మంచు వల్ల మూసివేయబడుతుంది. రోహతంగ్ పాస్ ద్వారా చేసే ప్రయాణం భారీ వర్షపాతం మరియు అధిక వేగంతో వీచే గాలుల వల్ల కొంచెం ప్రమాదకరమే. ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు వారి ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు ముందుగా ఇండియన్ ఆర్మీ నుండి అనుమతి తీసుకోవాలి.  

భ్రిగు లేక్హిందువులు పవిత్రంగా కొలిచే సరస్సు భ్రిగు సరస్సు. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ సరస్సులో సప్త ఋషులలో ఒకరైన భ్రుగ మహర్షి ధ్యానం చేసేవారని అంటారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన భ్రుగ సంహిత ని ఇక్కడే మహర్షి రచించారని కూడా అంటారు. ఈ భ్రిగు లేక్ ద్వారా పోషించబడే నెహ్రు కుండ్ అనే సహజమైన సరస్సు ఈ ప్రాంతానికి అదనపు అందాలని చేకూరుస్తుంది. మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు స్నానానికి ఉపయోగించాడని చెప్పబడే బిస్ కుండ్ ఇక్కడ ఉంది. ఇందులో ఒక్క సరి మునిగితే అన్ని చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడి వారి నమ్మకం.
ఇక్కడ ఉన్న వసిష్టుని గ్రామం మరొక ఆకర్షణ. సాండ్ స్టోన్ దేవాలయాలు, సహజ తటాకాలు ఇక్కడి విశేషాలు.   భగవంతుడు రాముని తమ్ముడు అయిన లక్ష్మణుడు ఇక్కడ వేడి సల్ఫర్ తటాకాలని సృష్టించాడని స్థానిక ఇతిహాసం. ఇక్కడి కాలా గురు మరియు రామ మందిరం ఇతర విశేషాలు.   వన్య మృగాలని చూడాలనుకునేవారు ఇక్కడి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ని సందర్శించవచ్చు. ఈ ప్రదేశం అంతరిస్తున్న పక్షి జాతులకు నెలవు, వెష్టర్న్ త్రాగోపాన్ , మరియు 300 ఇతర పక్షి జాతులు , 30 రకాల క్షిరదాలను చూడవచ్చు.   1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన జగన్నాథి దేవాలయం మనాలి లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం లో భువనేశ్వరి ని పుజిస్తారు.భువనేస్వారిని భగవంతుడు విష్ణువు యొక్క చెల్లెలు గా భక్తులు విశ్వసిస్తారు. రఘునాథ దేవాలయం ఇక్కడి మరొక తప్పక చూడతగ్గ ఆధ్యాత్మిక కేంద్రం.రఘునాథ జి కి అంకితం ఇవ్వబడిన ఈ దేవాలయం హిమాలయల లోని ఒక సముహమయిన పహరి, మరియు పిరమిడ్ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.   పారా గ్లైడింగ్, జోర్బింగ్, ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్ , మౌంటెన్ బైకింగ్ , పర్వతారోహణ వంటి సాహసోపేతమైన క్రీడలకి పీరు గడించింది ఈ మనాలి.డియో తిబ్బ బేస్ క్యాంపు , పిన్ పార్వతి పాస్ , బిస్ కుండ్, SAR పాస్ , చంద్రఖని, బ్రచైల్ , బాల్ తాల్ లేక్ మొదలగు ప్రఖ్యాత ట్రెక్కింగ్ దారులు.మౌంటెన్ బైకింగ్ లో ఆసక్తి కల పర్యాటకులకు హతంగ్ పాస్ , లడఖ్ మరియు లహౌల్ స్పిటి అఫ్ మనాలి వంటివి పుష్కలమైన అవకాశాలు కలిగిస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు మౌంటెన్ రోడ్లు మంచు లేకుండా స్పష్టంగా ఉండడం వల్ల ఈ సమయం మౌంటెన్ బైకింగ్ కి అనువైన సమయం.

బిజిలీ మహదేవ్ ఆలయం
ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది::   కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి.   పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.   ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది.ఈ ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు.   అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని… ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. 12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ. ఈ ఆలయం కులు మనాలీ లో కులు వేలీ కు పారావతి వేలీ కు మధ్యలో ఉంది.. ఈ ఆలయానికి ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు… ట్రెక్కీంగ్ ద్వారా మాత్రమే చేరుకోగలం…   ప్రయాణ సౌకర్యాలు మనాలికి రైలు ద్వారా వెళ్ళటం కష్టసాధ్యం. సమీపంలో బ్రాడ్ గేజ్ ముఖ్య కేంద్రాలు చండీగర్ 315 కిలోమీటర్లు,పఠాన్ కోట్ (325 కిలోమీటర్లు) మరియు కాల్క (310 కిలోమీటర్లు). సమీపంలోని నారో గేజ్ ముఖ్యకేంద్రం జోగిందర్ నగర్ వద్ద ఉంది (135 కిలోమీటర్లు).

సమీపంలోని విమానాశ్రయం భున్టార్, మనాలి నుండి సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రసుతం, కింగ్ ఫిషేర్ రెడ్ ఢిల్లీ నుండి నిరంతరాయ సేవలను, ఎయిర్ ఇండియా వారానికి రెండు సార్లు సేవలను మరియు MDLR ఎయిర్ లైన్స్ ఢిల్లీకి వారానికి ఆరుసార్లు సేవలను అందిస్తున్నాయి.   వాయు, రైలు, మరియు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులు మనాలి కి సులభం గా చేరుకోగలరు. మనాలి నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుంతర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న స్వదేశి విమానాశ్రయం. న్యూ ఢిల్లీ, చండీగర్, ధర్మశాల, షిమ్లా మరియు పతంకోట్ వంటి ప్రముఖమైన భారతీయ నగరాలకు ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, విదేశీ పర్యాటకులని మనాలి చేరుకునేందుకు తోడ్పడుతుంది.

మనాలి నుండి 165 కిలోమీటర్ల దూరం లో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇండియా నుండి చండీగర్ చేరే ప్రాంతం లో వివిధ ప్రాంతాలకి అనుసంధానమై ఉంది. చండీగర్, షిమ్లా, న్యూ ఢిల్లీ మరియు పతంకోట్ పట్టణాలకు హిమాచల్ ప్రదేశ్ టూరిసం డెవలప్మెంట్ కార్పొరేషన్ (HPTDC) బస్సులు తరచూ సేవలు అందిస్తూ ఉంటాయి.

ఏడాది పొడవునా మనాలి లో ని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ, మార్చ్ నుండి జూన్ మాసాలు మనాలి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం గా పరిగణించవచ్చు.

%d bloggers like this: